త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Korean Kanakaraju Vs DC | లోకేష్ క‌న‌గ‌రాజ్ వ‌ర్సెస్ కొరియ‌న్ క‌న‌క‌రాజు … ఫ‌స్ట్ డే విన్న‌ర్ ఎవ‌రంటే?

ఈ శుక్ర‌వారం వ‌రుణ్ తేజ్ కొరియ‌న్ క‌న‌క‌రాజుతో పాటు లోకేష్ క‌న‌గ‌రాజ్ డీసీ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. ఈ రెండు సినిమాల్లో ఫ‌స్ట్ డే బాక్సాఫీస్ విన్న‌ర్‌గా ఎవ‌రు నిలిచారంటే?

N

Entertainment | Published On Aug 8, 2026, 2.49 pm IST

Korean Kanakaraju Vs DC | లోకేష్ క‌న‌గ‌రాజ్ వ‌ర్సెస్ కొరియ‌న్ క‌న‌క‌రాజు … ఫ‌స్ట్ డే విన్న‌ర్ ఎవ‌రంటే?
Advertisement

Korean Kanakaraju Vs DC |  ఈ శుక్ర‌వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద మూడు సినిమాలు రిలీజ‌య్యాయి. మెగా హీరో వ‌రుణ్‌తేజ్ న‌టించిన కొరియ‌న్ క‌న‌క‌రాజుతో పాటుగా మ‌రో స్ట్రెయిట్ మూవీ కేజీక్యూ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. వాటితో పాటు డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజు హీరోగా న‌టించిన డ‌బ్బింగ్ మూవీ డీసీ కూడా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ల‌లో కొరియ‌న్ క‌న‌క‌రాజుకు లోకేష్ క‌న‌గ‌రాజు సినిమా గ‌ట్టిగానే పోటీ ఇచ్చింది. మౌత్ టాక్ బాగుండ‌టంతో తెలుగులో డీసీ మూవీ ఊహించిన దానికంటే ఎక్కువ‌గానే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది.

ప‌ది కోట్లు...

ప్రీమియ‌ర్స్‌తో క‌లిపి తొలిరోజు కొరియ‌న్ క‌న‌క‌రాజు మూవీకి 10.20 కోట్ల గ్రాస్‌ వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. టాక్స్‌లు, రెంట‌ల్స్ పోను ఆరు కోట్ల తొంభై ఐదు ల‌క్ష‌ల‌ వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇండియా వైడ్‌గా 3.95 కోట్ల వ‌సూళ్లు రాగా...ఓవ‌ర్‌సీస్‌లో రెండు కోట్ల క‌లెక్ష‌న్స్‌ను ఈ సినిమా సొంతం చేసుకుంది.

హార‌ర్ కామెడీగా తెర‌కెక్కిన ఈ సినిమాలో వ‌రుణ్‌తేజ్‌, రితికా నాయ‌క్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. క‌మెడియ‌న్ స‌త్య కీల‌క పాత్ర పోషించారు. కొరియ‌న్ బ్యాక్‌డ్రాప్‌లో డైరెక్ట‌ర్ మేర్ల‌పాక గాంధీ ఈ సినిమాను రూపొందించారు. కాన్సెప్ట్ పాత‌దే అయినా స‌త్య కామెడీ బాగుంద‌నే టాక్ వ‌స్తుంది.

తెలుగులో...

కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ డీసీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అరుణ్ మాథేశ్వ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమాలో వామికా గ‌బ్బి హీరోయిన్‌గా న‌టించింది. మొద‌టి రోజు తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌లిపి ఈ మూవీకి 4.40 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చాయి. త‌మిళ వెర్ష‌న్ రెండు కోట్ల ఎన‌భైఐదు ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌గా...తెలుగు వెర్ష‌న్ కోటి అర‌వై ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్‌తో స‌ర్‌ప్రైజ్ చేసింది. డీసీ మూవీ కోసం తెలుగులో ఎలాంటి ప్ర‌మోష‌న్స్ చేయ‌లేదు. కానీ మౌత్ టాక్ బాగుండ‌టం సినిమాకు క‌లిసివ‌చ్చింది. రెండో రోజు డీసీ వ‌సూళ్లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. డీసీ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. క‌థ రొటీన్ అయినా టెక్నిక‌ల్‌గా బ్రిలియెంట్ మూవీ అంటూ ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.

 

Advertisement
Advertisement