Anil Kumar Eravathri | కేటీఆర్‌కు హాఫ్ నాలెడ్జ్..
Anil Kumar Eravathri | హ్యాండ్లూమ్, పవర్‌లూమ్‌కు తేడా తెలియకుండా ఆ శాఖకు కేటీఆర్( KTR ) మంత్రిగా పని చేయడం మన దౌర్భాగ్యమని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్( Anil Kumar Eravathri ) పేర్కొన్నారు. హాఫ్ నాలెడ్జ్‌తో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారని విమర్శించారు.
2021లోనే నేతన్నల పొదుపు సొమ్ము ఆపేశారు
నేతన్నలకు రూ. 5 లక్షల బీమా ఇస్తున్నాం
ఇందిరమ్మ చీరల కోసం రూ. 460 కోట్లు ఇచ్చాం
బతుకమ్మ చీరల బకాయిలు రూ. 290 కోట్లు చెల్లించాం
ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్
Anil Kumar Eravathri | త్రినేత్ర.న్యూస్ : హ్యాండ్లూమ్, పవర్‌లూమ్‌కు తేడా తెలియకుండా ఆ శాఖకు కేటీఆర్( KTR ) మంత్రిగా పని చేయడం మన దౌర్భాగ్యమని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్( Anil Kumar Eravathri ) పేర్కొన్నారు. హాఫ్ నాలెడ్జ్‌తో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారని విమర్శించారు. గాంధీ భవన్‌లో రాష్ట్ర చేనేత సంక్షేమ సంస్థ వైస్ చైర్మన్ జక్కని అనితతో కలిసి అనిల్ మీడియాతో మాట్లాడారు.
కేటిఆర్‌కు దోచుకోవడం తప్పా పేద ప్రజలు కష్టాలు తెలియదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేతన్నల పొదుపు సొమ్ము ఆగిపోయింది. నేతన్నల పొదుపు సొమ్మును 2021 నుండి ఇవ్వకుండా ఆపేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు డబ్బులు మాత్రం ఇచ్చారు. కానీ నేతన్నల పొదుపు సొమ్ము ఎందుకు ఇవ్వలేదు. సిరిసిల్లలో ఎంతోమంది నేతన్నలు చనిపోయారు కానీ కేటీఆర్ పట్టించుకోలేదని అనిల్ ధ్వజమెత్తారు.
59 ఏండ్లు దాటిన నేతన్నలకు ఏమి రక్షణ ఇచ్చారో కేటీఆర్ చెప్పాలి..?
రాష్ట్రాన్ని దోచుకోవాలనేది మీ దొరల నైజం. పేదల జీవితాలు మీకు అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నేతన్నలకు రూ. 230 కోట్లు చెల్లించింది. నేతన్నలు 59 సవత్సరాలు వచ్చాక కూడా మగ్గాలు వేస్తున్నారు. వాళ్ళ జీవితాలు దయనీయ పరిస్థితిలో ఉన్నాయి. 59 ఏండ్లు దాటిన నేతన్నలకు ఏమి రక్షణ ఇచ్చారో కేటీఆర్ చెప్పాలి..? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏ వయసులో చనిపోయినా రూ. 5 లక్షల బీమా ఇస్తుంది. నేతన్నలు పడే కష్టాలు ఎవరికి రావొద్దు అని కోరుకుంటున్నానని అనిల్ పేర్కొన్నారు.
బతుకమ్మ చీరలకు రూ. 400 కోట్లు బకాయిలు ఇవ్వలేదు
కాంగ్రెస్ చేనేత భరోసాకు జీవో నెంబర్ 13 విడుదల చేసింది. 60 ప్రాథమిక సహకార సంఘాలకు రూ. కోటి 9 లక్షలు విడుదల చేశాం. జీవో నెంబర్ 18తో వేములవాడలో రూ. 5 కోట్లు మంజూరు చేశాం. రూ. 460 కోట్లు కోటి మందికి చీరల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది. కేటిఆర్ మంత్రిగా ఉన్నప్పుడు బతుకమ్మ చీరలకు రూ. 400 కోట్లు బకాయిలు ఇవ్వలేదు. మేము వచ్చాక రూ. 290 కోట్లు చెల్లించామని ఈరవత్రి అనిల్ తెలిపారు.
తాజావార్తలు
- ●KTR | యూఏఈలో బతుకమ్మ సంబురాలు.. కేటీఆర్‌కు ఆహ్వానం
- ●Korean Kanakaraju Vs DC | లోకేష్ కనగరాజ్ వర్సెస్ కొరియన్ కనకరాజు ... ఫస్ట్ డే విన్నర్ ఎవరంటే?
- ●E20 Petrol | ఈ20 పెట్రోల్‌పై ఆయిల్ కంపెనీల స్పష్టత.. నీరు ఉందా, లేదా..?
- ●KCR | పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ.2.25 కోట్లు అందించాలని నిర్ణయం
- ●PM Modi | ప్రశ్నించడం కాదు.. సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఉండాలి.. యువతకు ప్రధాని కీలక సూచన
- ●OTT Review | ఇల్లీగల్ ఎఫైర్స్‌పై వచ్చిన మలయాళం మూవీ - ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో సాగే థ్రిల్లర్ సినిమా ఎలా ఉందంటే?

KTR | యూఏఈలో బతుకమ్మ సంబురాలు.. కేటీఆర్‌కు ఆహ్వానం

Korean Kanakaraju Vs DC | లోకేష్ కనగరాజ్ వర్సెస్ కొరియన్ కనకరాజు ... ఫస్ట్ డే విన్నర్ ఎవరంటే?

E20 Petrol | ఈ20 పెట్రోల్‌పై ఆయిల్ కంపెనీల స్పష్టత.. నీరు ఉందా, లేదా..?

KCR | పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ.2.25 కోట్లు అందించాలని నిర్ణయం





