IND Vs SL | బుమ్రా ఫిట్..! టీమిండియాకు ఊరట..
IND Vs SL | శ్రీలంక పర్యటనకు ముందు భారత జట్టుకు ఊరట కలిగింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో నిర్వహించిన తప్పనిసరి ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాసయ్యాడు. దీంతో వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ మెడికల్ టీమ్ స్పష్టం చేసింది.
IND Vs SL | శ్రీలంక పర్యటనకు ముందు భారత జట్టుకు ఊరట కలిగింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో నిర్వహించిన తప్పనిసరి ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాసయ్యాడు. దీంతో వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ మెడికల్ టీమ్ స్పష్టం చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బుమ్రా గాయపడ్డ విషయం తెలిసింది. బంతి తగలడంతో అయిన ఈ గాయం కారణంగా లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డేకు దూరమయ్యాడు. అయితే, ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకున్న బుమ్రాకు వైద్య బృందం మళ్లీ మైదానంలో క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇచ్చింది.
బీసీసీఐ అధికారి రెస్పాన్స్ ఇదే..
బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి పీటీఐతో మాట్లాడుతూ ‘‘జస్ప్రీత్ బుమ్రా ప్రభావ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సూచించిన అన్ని ఫిట్‌నెస్ పరీక్షల్లో పాసయ్యాడు. జట్టు ప్రణాళికల్లో బుమ్రా కీలక ఆటగాడు కావడంతో రెండు టెస్టులకు అందుబాటులో అవకాశం ఉంది’’ అని తెలిపారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్టుకు గాలే వేదిక కానుండగా.. రెండో, చివరి టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలో జరగనుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో కీలకం
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో ఈ సిరీస్ భారత్‌కు కీలకంగా మారింది. ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన తొమ్మిది టెస్టుల్లో కనీసం ఏడు విజయాలు సాధించాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో శ్రీలంకపై 2-0తో సిరీస్ విజయం సాధించడం టీమిండియాకు ఎంతో కీలకం కానుంది. ఆ తర్వాత భారత్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లాల్సి రానుంది.
గాయాల బెడద..
అయితే, బుమ్రా పునరాగమనంతో జట్టుకు ఊరటనిచ్చినా.. మరికొందరు ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. హర్షిత్ రాణా తొడ కండరాల గాయంతో జట్టుకు దూరమయ్యాడు. నితీశ్ రెడ్డి క్వాడ్రిసెప్స్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. వెన్నులో స్ట్రెస్ రియాక్షన్ కారణంగా ఆకాశ్ దీప్ చాలాకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. బుమ్రా రాకతో బౌలింగ్ విభాగం బలోపేతం కానుండగా.. మిగిలిన ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై జట్టు యాజమాన్యం దృష్టి సారించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది
- ●Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే
- ●KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం
- ●CM Revanth Reddy | ఆ మూడు ప్రాజెక్టులకు ఎన్డీఎస్ఏ సూచనలు పాటించండి.. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయండి
- ●Monkey Skull in Bag | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కే ప్రయాణికుడి బ్యాగ్‌లో 'కోతి పుర్రె'
- ●TGSWREIS | గురుకుల విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచితంగా నీట్ 2027 లాంగ్ టర్మ్ కోచింగ్.. వివరాలివే..!

Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది

Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే

KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం

CM Revanth Reddy | ఆ మూడు ప్రాజెక్టులకు ఎన్డీఎస్ఏ సూచనలు పాటించండి.. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయండి






