త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

President Droupadi Murmu | ప్రొటోకాల్ వివాదం.. తృణ‌మూల్ నేత‌ల‌కు అపాయింట్‌మెంట్ నిరాక‌రించిన రాష్ట్ర‌ప‌తి ముర్ము

President Droupadi Murmu | అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెనర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ బృందానికి తీవ్ర నిరాశ ఎదురైంది. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును (President Droupadi Murmu) క‌లిసేందుకు అపాయింట్‌మెంట్ కోర‌గా అందుకు కార్యాల‌యం నిరాక‌రించింది.

D

National | Published On Mar 13, 2026, 3.59 pm IST

President Droupadi Murmu | ప్రొటోకాల్ వివాదం.. తృణ‌మూల్ నేత‌ల‌కు అపాయింట్‌మెంట్ నిరాక‌రించిన రాష్ట్ర‌ప‌తి ముర్ము
Advertisement

President Droupadi Murmu | అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెనర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ బృందానికి తీవ్ర నిరాశ ఎదురైంది. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును (President Droupadi Murmu) క‌లిసేందుకు అపాయింట్‌మెంట్ కోర‌గా అందుకు కార్యాల‌యం నిరాక‌రించింది. సమయాభావం కారణంగా అపాయింట్‌మెంట్ ఇవ్వలేమని స్పష్టం చేసినట్లు శుక్రవారం ఉదయం ప్ర‌భుత్వ‌ వర్గాలు వెల్లడించాయి.

కాగా, పశ్చిమబెంగాల్‌లో గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించేందుకు 12 మంది సభ్యుల టీఎంసీ ప్రతినిధి బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్‌మెంట్ కోరింది. ఈ మేర‌కు ఈనెల 9న రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యానికి లేఖ రాసింది. అయితే, అందుకు రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం నిరాక‌రించింది. దీంతో వ‌చ్చే వారం అయినా అవ‌కాశం ఇవ్వాల‌ని వారు మ‌రో లేఖ‌ను రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యానికి పంపిన‌ట్లు సంబంధిత వ‌ర్గాల ద్వారా తెలిసింది. అయితే, దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కూ వారికి ఎలాంటి స‌మాచారం లేద‌ని టీఎంసీ ఎంపీ సౌగ‌త రాయ్ తెలిపారు.

బెంగాల్ ప్ర‌భుత్వంపై రాష్ట్ర‌ప‌తి అస‌హ‌నం..

ఇటీవ‌లే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగాల్‌ ప‌ర్య‌ట‌న‌లో ప్రొటోకాల్ (Protocol) ఉల్లంఘ‌న జ‌రిగిన విష‌యం తెలిసిందే. 9వ అంతర్జాతీయ సంతాల్ సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్రపతి సిలిగుడికి వెళ్లిన సమయంలో ప్రొటోకాల్ ఉల్లంఘ‌న చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్ర‌ప‌తి ముర్ము తీవ్ర అసంతృప్తి కూడా వ్య‌క్తం చేశారు. తాను బాగ్డోగ్రా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న‌ప్పుడు ముఖ్య‌మంత్రి గానీ, కేబినెట్ మంత్రులు గానీ ఎందుకు రాలేద‌ని ముర్ము రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించారు. అంతేకాదు, కార్య‌క్ర‌మ వేదిక‌ను మార్చ‌డంపై కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గిరిజనులకు చేరకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

"ఇక్కడ సంతాల్స్, గిరిజప ప్ర‌జ‌ల కోసం అభివృద్ధి జరుగుతోందా..? నేనైతే అలా అనుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప‌థ‌కాలు మీకు అందుతున్నాయా..? కొంతమందిని ఇక్కడికి రాకుండా అడ్డుకుంటున్నారని నేను భావిస్తున్నాను. బహుశా సంతాల్స్ అభివృద్ధి చెందడం ఇక్క‌డ‌ కొంతమందికి ఇష్టం లేదేమో" అని ముర్ము తీవ్ర స్థాయిలో అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఇక ప్రొటోకాల్ ఉల్లంఘ‌నపై కేంద్ర హోంశాఖ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. బీజేపీ నేత‌లు సైతం దీదీ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ఈ విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో తృణ‌మూల్ నేత‌ల‌కు రాష్ట్ర‌ప‌తి అపాయింట్‌మెంట్ నిరాక‌రించ‌డం ప్ర‌స్తుతం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

https://x.com/ANI/status/2030244746413637697

Also Read..

ఈ రోజు ఏం జ‌రుగుతుందో చూడండి.. వారిని అంతం చేస్తున్నా.. ఇరాన్‌కు ట్రంప్ సీరియ‌స్ వార్నింగ్‌

ఎమ్జీఆర్‌పై అనుచిత కామెంట్ల వివాదం - క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌

ఐక్యూ నుంచి జ‌డ్‌11ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్‌.. భారీ బ్యాట‌రీ, ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే..

Advertisement
Advertisement