Supreme Court | సుప్రీంకోర్టులో జడ్జిల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం.. 34 నుంచి 38కి పెరుగనున్న సంఖ్య
Supreme Court | దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో (Supreme Court) జడ్జిల సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ఆమోదం తెలిపారు.
Supreme Court | త్రినేత్ర.న్యూస్: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో (Supreme Court) జడ్జిల సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. దీంతో సుప్రీంకోర్టులో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించి, సత్వర న్యాయం అందించేందుకు వీలవుతున్నారు. కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన ప్రతిపాదనకు అనుగుణంగా, రాష్ట్రపతి 'సుప్రీంకోర్టు సవరణ ఆర్డినెన్స్, 2026'ను జారీ చేశారు. దీంతో ప్రధాన న్యాయమూర్తితో కలిపి సుప్రీంకోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య 34 నుంచి 38కి పెరుగనుంది. 2019 తర్వాత సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచడం ఇదే మొదటిసారి.
కాగా, దేశ అత్యున్నత న్యాయస్థానంలో రెండు న్యాయమూర్తులు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత సీజేఐ సూర్యకాంత్ కంటే ముందు ఆ పదవిలో ఉన్న జస్టిస్ బీఆర్ గవాయ్ గతేడాది నవంబర్‌లో పదవీ విరమణ చేశారు. ఈ ఏడాది ఎప్రిల్‌లో జస్టిస్ రాజేశ్ బిందాల్ రిటైర్ అయ్యారు. 2026 చివరి నాటికి మరో ముగ్గురు జడ్జిలు పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పంకజ్ మిట్టల్ వచ్చే నెలలో, జస్టిస్ సంజయ్ కరోల్ ఆగస్టులో రిటైర్ కానున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో దాదాపు 92,000 కంటే ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జడ్జిల సంఖ్య పెంపునకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో, ఈ ఆర్డినెన్స్‌ను రానున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు రూపంలో ప్రవేశపెట్టి, ఉభయ సభల ఆమోదంతో పూర్తిస్థాయి చట్టంగా మార్చనున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






