త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | ఈ రోజు ఏం జ‌రుగుతుందో చూడండి.. వారిని అంతం చేస్తున్నా.. ఇరాన్‌కు ట్రంప్ సీరియ‌స్ వార్నింగ్‌

Donald Trump | ఇరాన్‌ (Iran)కు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మ‌రోసారి తీవ్ర హెచ్చ‌రిక‌లు చేశారు. 'ఇరాన్‌లోని ఉగ్రవాద పాలనను పూర్తిగా నాశనం చేస్తాం' అంటూ ట్రూత్‌లో పోస్టు పెట్టారు.

D

International | Published On Mar 13, 2026, 3.21 pm IST

Donald Trump | ఈ రోజు ఏం జ‌రుగుతుందో చూడండి.. వారిని అంతం చేస్తున్నా.. ఇరాన్‌కు ట్రంప్ సీరియ‌స్ వార్నింగ్‌
Advertisement

Donald Trump | మ‌ధ్య‌ప్రాచ్యంలో ఉద్రిక్త‌త‌లు ఏమాత్రం చ‌ల్లార‌డం లేదు. రోజురోజుకూ తీవ్ర‌త‌ర‌మ‌వుతున్నాయి. యుద్ధం త్వ‌ర‌లోనే ముగిస్తామంటూ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెబుతున్న‌ప్ప‌టికీ.. అక్క‌డ ప‌రిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఇరాన్‌ (Iran)కు అధ్య‌క్షుడు ట్రంప్ మ‌రోసారి తీవ్ర హెచ్చ‌రిక‌లు చేశారు. 'ఇరాన్‌లోని ఉగ్రవాద పాలనను పూర్తిగా నాశనం చేస్తాం' అంటూ ట్రూత్‌లో పోస్టు పెట్టారు. ఈ రోజు ఇరాన్‌లో ఏం జ‌రుగుతుందో చూడండి.. వారిని అంతం చేస్తున్నాం అంటూ పేర్కొన్నారు.

వారిని అంతం చేస్తున్నాం..

"పిచ్చిగా ప్రవర్తించే నేతలు ఏం జరుగుతుందో మీరు ఈరోజు చూస్తారు. మా సైనికులు చేసిన దాడిలో ఇరాన్ నౌకాదళం ఆనవాళ్లు లేకుండా పోయింది. ఇకపై ఇరాన్ వైమానికదళం కూడా ఉండదు. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేస్తున్నాం. ఇరాన్ నాయ‌కులు భూమిపై నుంచి తుడిచిపెట్టుకుపోయారు. మా వ‌ద్ద అస‌మాన‌మైన మందుగుండు సామ‌గ్రి, అప‌రిమిత‌మైన ఆయుధాలు ఉన్నాయి. ఈరోజు ఏం జ‌రుగుతుందో చూడండి. 47 ఏళ్లుగా అమాయ‌కుల‌ను ఇరాన్ బ‌లి చేసింది. అమెరికా 47వ అధ్య‌క్షుడిగా నేను వారిని అంతం చేస్తున్నాను. ఇది నాకు ద‌క్కిన గొప్ప గౌర‌వంగా భావిస్తున్నాను" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

యుద్ధం పూర్తి కాలేదు..

ఇరాన్‌పై అమెరికా వ్యూహం త‌ప్పిందంటూ ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాల‌కు ట్రంప్ కౌంట‌ర్ ఇచ్చారు. "ఒకవేళ మీరు ఆ విఫలమైన (Failing) న్యూయార్క్ టైమ్స్ చదివితే.. మేము గెలవడం లేదని మీరు తప్పుగా అనుకుంటారు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. చ‌రిత్ర‌లో ఏ దేశ‌మూ దెబ్బ‌తిన‌నంత తీవ్రంగా ఇరాన్‌ను దెబ్బ‌తీసిన‌ట్లు చెప్పుకొచ్చారు. యుద్ధం ఇంకా పూర్తిగా ముగియ‌లేద‌ని వ్యాఖ్యానించారు. కొన్నేళ్లుగా ఇరాన్ ప్రపంచానికి కలిగిస్తున్న నష్టానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకోబోతోంద‌ని పేర్కొన్నారు. ఇరాన్ నుంచి వచ్చే ఎలాంటి దాడికి తాను భయపడన‌ని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Also Read..

అలా చేస్తే మ‌హిళ‌ల్ని ఎవ‌రూ ఉద్యోగాల్లోకి తీసుకోరు.. నెల‌స‌రి సెల‌వుల‌పై సుప్రీం కీల‌క వ్యాఖ్య‌లు

టాలీవుడ్‌కు బిగ్ రిలీఫ్ - సినిమా టికెట్ రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీల‌క తీర్పు

10 నెల‌ల గ‌రిష్టానికి ద్ర‌వ్యోల్బ‌ణం.. పేద‌, మ‌ధ్య త‌ర‌గతి ఖ‌ర్చు త‌డిసి మోపెడు..

Advertisement
Advertisement