త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iQOO Z11x 5G | ఐక్యూ నుంచి జ‌డ్‌11ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్‌.. భారీ బ్యాట‌రీ, ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే..

iQOO Z11x 5G | మొబైల్స్ త‌యారీదారు ఐక్యూ నూత‌నంగా ఐక్యూ జ‌డ్‌11ఎక్స్ 5జి పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. జ‌డ్‌11 సిరీస్‌లో వ‌చ్చిన లేటెస్ట్ ఐక్యూ ఫోన్ ఇదే కాగా ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం.

S

Technology | Published On Mar 13, 2026, 3.41 pm IST

iQOO Z11x 5G | ఐక్యూ నుంచి జ‌డ్‌11ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్‌.. భారీ బ్యాట‌రీ, ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే..
Advertisement

iQOO Z11x 5G | మొబైల్స్ త‌యారీదారు ఐక్యూ నూత‌నంగా ఐక్యూ జ‌డ్‌11ఎక్స్ 5జి పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. జ‌డ్‌11 సిరీస్‌లో వ‌చ్చిన లేటెస్ట్ ఐక్యూ ఫోన్ ఇదే కాగా ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. ఈ ఫోన్‌ను రెండు ర‌కాల క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో, 3 ర‌కాల స్టోరేజ్ వేరియెంట్ల‌లో లాంచ్ చేశారు. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ట‌ర్బో ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. 7200 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాట‌రీ ఇందులో ఉంది. ఇదే ఈ ఫోన్‌కు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. ఈ ఫోన్‌కు 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను కూడా ఇస్తున్నారు. అందువ‌ల్ల ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవ‌చ్చు. వెనుక వైపు డ్యుయల్ కెమెరాల‌ను ఇచ్చారు. అందులో ఒక‌టి 50 మెగాపిక్స‌ల్ కెమెరాగా ప‌నిచేస్తుంది.

ధ‌ర వివ‌రాలు..

ఐక్యూ జ‌డ్‌11ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.18,999 ఉండ‌గా, 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర‌ను రూ.20,999గా నిర్ణ‌యించారు. అలాగే 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.22,999గా ఉంది. ఈ ఫోన్‌పై యాక్సిస్ బ్యాంక్‌, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల‌తో రూ.2వేల వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీన్ని మార్చి 16 నుంచి అమెజాన్‌లో విక్ర‌యించ‌నున్నారు. ప్రిస్మాటిక్ గ్రీన్‌, టైటాన్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో ఈ ఫోన్ ల‌భ్యం కానుంది.

అద్భుత‌మైన ఫీచ‌ర్లు..

ఐక్యూ జ‌డ్‌11ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్‌లో డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్‌6 ల‌భిస్తుంది. దీనికి 2 ఏళ్ల వ‌ర‌కు ఓఎస్ అప్‌గ్రేడ్స్‌ను, 4 ఏళ్ల వ‌ర‌కు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామ‌ని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌లో 6.76 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేయ‌గా దీనికి ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. తెర‌పై నాణ్య‌మైన దృశ్యాల‌ను వీక్షించ‌వ‌చ్చు. సూర్య‌కాంతిలోనూ స్ప‌ష్టంగా ఫోన్‌ను చూసేలా డిస్‌ప్లేకు 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. ఐపీ68, ఐపీ69 డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్ కూడా ఉంది. 8జీబీ ర్యామ్‌, 256జీబీ వ‌ర‌కు స్టోరేజ్‌ను ఇచ్చారు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. వెనుక వైపు 50, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండు ఉండ‌గా, ముందు వైపు 32 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి వంటి క‌నెక్టివిటీ ఫీచ‌ర్లు ఉన్నాయి.

Advertisement
Advertisement