Rajendra Prasad | ఎమ్జీఆర్‌పై అనుచిత కామెంట్ల వివాదం – క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
ఎమ్జీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై టాలీవుడ్ సీనియర్ యాక్టర్ రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పారు. ఓ వీడియోను రిలీజ్ చేశారు. తాను పొరపాటుగా అన్న మాటలను కొందరు కావాలనే పెద్దది చేశారని అన్నాడు. ఎమ్జీఆర్‌కు సరితూగే స్థాయి తనకు కాదని రాజేంద్రప్రసాద్ చెప్పారు.
Entertainment | Published On Mar 13, 2026, 3.43 pm IST
Rajendra Prasad | తమిళ సినీ వర్గాలతో పాటు అభిమానులకు టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పారు. తాను పొరపాటుగా అన్న ఓ మాటను కావాలనే కొందరు పెద్దది చేసి రాద్దాంతం చేశారని అన్నారు. ఇటీవలే కాంతారావు స్మారక జాతీయ పురస్కారాన్ని రాజేంద్రప్రసాద్ అందుకున్నారు. ఈ అవార్డు వేడుకలో కాంతారావు గొప్పతనాన్ని గురించి చెబుతూ తమిళ దివంగత అగ్ర నటుడు ఎమ్జీఆర్‌పై రాజేంద్రప్రసాద్ నోరు జారారు. కాంతారావును చూసి ఎమ్జీఆర్ భయంతో వణికిపోయి ఉ...పోసుకునేవాడంటూ అన్నారు. ఎమ్జీఆర్‌ను ఉద్దేశిస్తూ రెండు, మూడు సార్లు ఈ అనుచిత పదాన్ని వాడారు రాజేంద్రప్రసాద్.
విమర్శలు...
రాజేంద్రప్రసాద్ స్పీచ్‌పై తమిళ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. టాలీవుడ్ హీరో గొప్పతనాన్ని గురించి చెప్పడానికి తాము దైవంగా భావించే ఎమ్జీఆర్‌ను తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదంటూ విమర్శలు గుప్పించారు. అభిమానులు మాత్రమే కాకుండా హీరో విశాల్, సీనియర్ నటుడు నాజర్‌తో పాటు మరికొంత మంది తమిళ నటులు కూడా రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్ కామెంట్లు తమిళ ప్రజల మనసులను గాయపరిచాయని, గొప్ప నటుడి నుంచి ఇలాంటి చీప్ వ్యాఖ్యలను ఊహించలేదంటూ నాజర్ అన్నారు. రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
వీడియో రిలీజ్...
విమర్శలు, ట్రోల్స్ ఎక్కువ కావడంతో ఈ వివాదంపై రాజేంద్రప్రసాద్ రియాక్ట్ అయ్యారు. తమిళ సినీ అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు.
రెండు రోజుల క్రితం జరిగిన ఒక వేడుకలో తమిళ దిగ్గజ నటుడు ఎమ్జీఆర్‌పై అనుకోకుండా మాట దొర్లిందని రాజేంద్రప్రసాద్ అన్నారు. కావాలని తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. పొరపాటుగా తాను అన్న వ్యాఖ్యలను కొందరు కావాలని పెద్దది చేశారని పేర్కొన్నారు. "ఎమ్జీఆర్ గురించి చులకనగా మాట్లాడేంత ధైర్యం నాకు లేదు. ఆయన స్థాయికి నేను సరితూగలేను. నేను మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుంటున్నప్పుడు ఎమ్జీఆర్ సీఎంగా ఉన్నారు. మా యాక్టింగ్ క్లాస్‌లకు హాజరయ్యారు మా నటనను మెచ్చుకున్న గొప్ప వ్యక్తి ఎమ్జీఆర్. నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే.. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. ఇలాంటి పొరపాటు మళ్ళీ జరగదని హామీ ఇస్తున్నాను" అని ఈ వీడియోలో రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



