త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TVK Vijay | మెజారిటీ నిరూపించుకోవాల్సింది అసెంబ్లీలో.. రాజ్‌భ‌వ‌న్‌లో కాదు.. విజ‌య్ కోసం గ‌ళ‌మెత్తిన నేత‌లు

TVK Vijay | అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించిన విజ‌య్ నేతృత్వంలోని టీవీకేకి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గ‌వ‌ర్న‌ర్ అవ‌కాశం ఇవ్వ‌డం లేదు. దీనిపై ప్ర‌తిప‌క్షాలు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నాయి. ప‌లువురు న్యాయ‌వాదులు, సినీ న‌టులు విజ‌య్ కోసం గ‌ళం విప్పుతున్నారు. "మెజారిటీ నిరూపించుకోవాల్సింది అసెంబ్లీలో.. రాజ్‌భ‌వ‌న్‌లో కాదు" అంటూ గ‌తంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తున్నారు.

D

National | Published On May 7, 2026, 5.29 pm IST

TVK Vijay | మెజారిటీ నిరూపించుకోవాల్సింది అసెంబ్లీలో.. రాజ్‌భ‌వ‌న్‌లో కాదు.. విజ‌య్ కోసం గ‌ళ‌మెత్తిన నేత‌లు
Advertisement

TVK Vijay | అత్య‌ధిక స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించిన టీవీకేకి (TVK) నిరాశ త‌ప్ప‌డం లేదు. మెజారిటీ లేద‌న్న కార‌ణంతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజ‌య్‌ (Vijay)కి గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తించ‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. గ‌వ‌ర్న‌ర్ తీరుపై కాంగ్రెస్‌, డీఎంకే స‌హా, ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే విష‌యంపై సీనియ‌ర్ న్యాయ‌వాది, రాజ్య‌స‌భ ఎంపీ క‌పిల్ సిబ‌ల్ కూడా స్పందించారు.

సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది..

గ‌వ‌ర్న‌ర్లు బీజేపీ ఏజెంట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని క‌పిల్ సిబ‌ల్‌ (Kapil Sibal) మండిప‌డ్డారు. ఎవ‌రికీ స్ప‌ష్ట‌మైన మెజారిటీ లేన‌ప్పుడు సంప్ర‌దాయం ప్ర‌కారం గ‌వ‌ర్న‌ర్ అత్య‌ధిక స్థానాలు గెలుచుకున్న పార్టీని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాల‌న్నారు. అలా కాకుండా మెజారిటీ చూపించాల‌ని గ‌వ‌ర్న‌ర్ విజ‌య్‌ని అడ‌గ‌లేర‌ని తెలిపారు. ఏ పార్టీ అయినా మెజారిటీ మ‌ద్ద‌తు ఉంద‌ని నిరూపించుకునేది శాస‌న‌స‌భ‌లోనే అని.. ఇదే విష‌యాన్ని సుప్రీంకోర్టు కూడా గ‌తంలో స్ప‌ష్టంగా చెప్పింద‌ని ఈ సంద‌ర్భంగా క‌మిల్ సిబల్ గుర్తు చేశారు.

రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కుతున్నారు..

ఈ సంద‌ర్భంగా బీజేపీపై క‌పిల్ సిబ‌ల్ విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌మ ప్ర‌యోజ‌నాల కోసం బీజేపీ నేత‌లు రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కుతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించిన టీవీకేకి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమ‌తించాల‌ని డిమాండ్ చేశారు. విజ‌య్‌తో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయించాల‌ని సూచించారు. ప్ర‌మాణ స్వీకారం త‌ర్వాత త‌న మెజారిటీని స‌భ‌లో నిరూపించుకునే అవ‌కాశం ఇవ్వాల‌న్నారు.

ప్రజా తీర్పును అవమానించడమే..

గ‌వ‌ర్న‌ర్ తీరు ప్ర‌జా తీర్పును అవ‌మానించ‌డ‌మే అంటూ ప్ర‌ముఖ న‌టుడు, రాజ్య‌స‌భ ఎంపీ క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్‌ను ఆహ్వానించకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఇది 'ప్రజాస్వామ్యానికి జరిగిన అవమానం'గా అభివర్ణించారు. రాష్ట్ర‌ చరిత్రలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ చూడలేదన్నారు. ఈ క్రమంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన బాధ్యత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిపై ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు.

గ‌తంలో ఎస్.ఆర్. బొమ్మై కేసు కేసులో సుప్రీంకోర్టు వెలువ‌రించిన చారిత్మాత్మ‌క తీర్పును ఈ సంద‌ర్భంగా క‌మ‌ల్ హాస‌న్ ఉద‌హ‌రించారు. "మెజారిటీ అనేది అసెంబ్లీ వేదిక‌గా నిరూపించుకోవాలి.. రాజ్‌భవన్‌లో కాదు" అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఇది త‌న డిమాండ్ కాద‌ని.. ఒక భారతీయ పౌరుడిగా తాను చేస్తున్న హెచ్చరిక అని ఆయన స్పష్టం చేశారు.

గతం మర్చిపోయారా..

ఈ విష‌యంలో విజ‌య్‌కి త‌మిళ న‌టుడు విశాల్ (Hero Vishal) కూడా మ‌ద్ద‌తుగా నిలిచారు. విజ‌య్ నేతృత్వంలోని టీవీకే పార్టీ భారీ మెజారిటీతో గెలిచి అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింద‌ని గుర్తు చేశారు. ఆ పార్టీకి ప్ర‌జ‌లు పార్టీకి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చార‌న్నారు. అయిన‌ప్ప‌టికీ ఇలా ఎందుకు జ‌రుగుతోంది..? ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గ‌వ‌ర్న‌ర్ ఎందుకు అవ‌కాశం ఇవ్వ‌డం లేదు..? అంటూ ప్ర‌శ్నించారు. 2017-18లో గోవా, మణిపూర్, మేఘాలయ, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన రాజ‌కీయ‌ పరిణామాలను విశాల్ ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. అప్పట్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చి, తర్వాత అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించారని ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు త‌మిళ‌నాడులోనూ విజ‌య్ పార్టీకి అవ‌కాశం ఇవ్వాల‌ని విశాల్ డిమాండ్ చేశారు. ఇప్పుడు త‌మిళ‌నాడులో 233 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంద‌న్నారు. ప్రాథమిక హక్కులు రాజకీయ నాయకులకే కాదు.. తమిళనాడు ప్రజలకు కూడా తెలుసున‌ని వ్యాఖ్యానించారు.

గవర్నర్ చర్య రాజ్యాంగ విరుద్ధం : ముకుల్ రోహత్గీ

టీవీకే చీఫ్ విజ‌య్‌కి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మ‌ద్ద‌తుగా నిలిచారు. ఈ మేర‌కు తమిళనాడు గవర్నర్ వైఖరిని తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. గ‌వ‌ర్న‌ర్ చ‌ర్య‌ను "రాజ్యాంగ విరుద్ధం"గా అభివర్ణించారు. అతిపెద్ద పార్టీ నాయకుడిగా విజయ్‌తో ప్రమాణ స్వీకారం చేయించాలని, అసెంబ్లీ వేదికగా తన మెజారిటీని నిరూపించుకోవడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం బలపరీక్ష సభలోనే జరగాలన్నారు. గవర్నర్ ముందు ముందే బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ తక్షణమే ప్ర‌భుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

విజ‌య్‌కి ప్ర‌జ‌ల అండ ఉంది..

విజ‌య్‌కి ప్ర‌జ‌ల అండ ఉంద‌ని.. మ‌రో న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ అన్నారు. అసెంబ్లీ వేదిక‌గా తన బలాన్ని నిరూపించుకునే హక్కు ఆయనకు ఉందన్నారు.

Also Read..

ప్చ్ విజ‌య్‌కి మ‌ళ్లీ నిరాశే.. 118 మంది సంత‌కాల‌తో రండి

ఒక్క గింజ ధాన్యమైనా కొన్నారా..? పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు : ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

ముఖ్య‌మంత్రిగా బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావు

Advertisement
Advertisement