Raghunandan Rao | ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. యాక్టర్‌గా తాను చేయబోతున్న మొదటి సినిమాలోనే సీఎం పాత్రలో కనిపించబోతున్నారు. ఆ సినిమా ఏదంటే?
Entertainment | Published On May 7, 2026, 4.48 pm IST
Raghunandan Rao | బీజేపీ ఎంపీ రఘునందన్ రావు యాక్టర్‌గా మారారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మొదటి మూవీలోనే సీఎం పాత్రలో కనిపించబోతున్నారు. సీనియర్ యాక్టర్ పోసాని కృష్ణమురళి స్వీయ దర్శకత్వంలో అపరేషన్ అరుణారెడ్డి పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తోన్నారు. గురువారం ఈ మూవీ వివరాలను పోసాని వెల్లడించారు.
సీఎం పాత్రలో...
ఆపరేషన్ అరుణా రెడ్డి సినిమాలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు పోసాని కృష్ణమురళి వెల్లడించారు.రఘునందన్ రావు అంటే నాకు ఇష్టం. "నేనంటే ఆయనకు అభిమానం. ఈ చిత్రంలో సీఎం పాత్ర ఆయన చేస్తే బాగుంటుందని అనిపించింది. ఆయన్ని అప్రోచ్ అయ్యా. రఘునందన్ రావు కూడా కథ విని బాగుంది .... నేను చేస్తా అని అన్నారు. సీఎం పాత్రలో నటించిన ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా" అని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు.
పాలిటిక్స్‌కు సంబంధం లేదు...
ఈ సినిమాకు పాలిటిక్స్ కు ఎలాంటి సంబంధం లేదని, . వందశాతం సిన్సియర్ గా తాను చేసిన సినిమా ఇదని పోసాని కృష్ణమురళి చెప్పారు. ఆపరేషన్ అరుణారెడ్డిలో ఒక్క బూతు గానీ, ఒక్క అసభ్యమైన సన్నివేశం గానీ ఉండదని అన్నారు. "ఆపరేషన్ అరుణారెడ్డి మూవీ స్క్రీన్ ప్లే..ఇండియాలోనే ఒక బెస్ట్ స్క్రీన్ ప్లే అవుతుందని గర్వంగా చెప్పగలను. నా కెరీర్ లో కూడా ఇది బెస్ట్ స్క్రీన్ ప్లేగా పేరు తెచ్చుకుంటుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఏం జరుగుతుందో ఊహించలేరు. తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్, జనసేన, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు..అన్ని పార్టీల వాళ్లు ఈ సినిమాను చూడొచ్చు. వాళ్లందరికీ నచ్చే చిత్రమవుతుంది" అని పోసాని వెల్లడించారు.
విజయ్ టార్గెట్...
తమిళనాట విజయ్ లాంటి మంచి వ్యక్తి గెలవడం సంతోషంగా ఉందని పోసాని చెప్పారు. అతన్ని డీఎంకే, ఎన్నాడీఎంకే లాంటి పార్టీలు అనవసరంగా టార్గెట్ చేస్తున్నాయని పోసాని చెప్పారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



