Kamal Haasan | మా మధ్య ఉంది పోటీనే …అసూయ కాదు – రజనీ కామెంట్లపై కమల్ హాసన్ రియాక్షన్…
దళపతి విజయ్ సీఎం కాకుండా తాను ఎలాంటి రాజకీయాలు చేయలేదని రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట సంచలనంగా మారాయి. దళపతి విజయ్ కాకుండా కమల్ హాసన్ సీఎం అయ్యుంటే తాను అసూయపడేవాడిని అని అన్నారు. రజనీకాంత్ జెలసీ వ్యాఖ్యలపై కమల్‌హాసన్ రియాక్ట్ అయ్యారు.
Entertainment | Published On May 17, 2026, 4.47 pm IST
Kamal Haasan | తమిళనాడు రాజకీయాలు సినిమాలకు మించిన ట్విస్ట్‌లతో సాగుతున్నాయి. దళపతి విజయ్ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతోన్న కోలీవుడ్‌లో జరుగుతోన్న పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తోన్నాయి. విజయ్ సీఎం కాకుండా రజనీకాంత్ అడ్డుకునే ప్రయత్నాలు చేశారంటూ పుకార్లు వచ్చాయి. ఈ రూమర్లపై సూపర్ స్టార్ రజనీకాంత్ రియాక్ట్ అయ్యారు. విజయ్‌పై తనకు ఎలాంటి అసూయ లేదని అన్నారు. స్నేహ బంధంతోనే తాను మాజీ సీఎం స్టాలిన్‌ను కలిశానని, రాజకీయ కుట్రల కోసం కాదని క్లారిటీ ఇచ్చారు. విజయ్ కాకుండా కమల్‌హాసన్ సీఎం అయితే అసూయపడేవాడిని అని రజనీ కాంత్ సరదాగా కామెంట్లు చేశారు. విజయ్‌కి, తనకు మధ్య జనరేషన్ గ్యాప్ ఉందని, కానీ కమల్ మాత్రం తన సమకాలీనుడని, ఇద్దరం ఒకే తరం వారమని రజనీకాంత్ వ్యాఖ్యానించారు.
పోటీ కాదు...
రజనీకాంత్ కామెంట్లపై కమల్ హాసన్ రియాక్ట్ అయ్యారు. రజనీకాంత్‌కు, తనకు మధ్య ఉంది పోటీయే కానీ అసూయ కాదని అన్నారు. సినిమాలు కాకుండా తామిద్దరం క్రికెట్ ఆడినా కూడా కలిసికట్టుగానే ఉండేవాళ్లమని అన్నాడు. తమిళనాడులో ఉన్న బెస్ట్ స్పోర్ట్స్‌మెన్స్ మేమే అంటూ పంచ్‌లు వేశారు. విజయ్ కొత్త ప్రభుత్వం పాలన తీరు ఎలా ఉందని అడిగిన ప్రశ్నలకు కూడా కమల్‌హాసన్ స్పందించారు.
విజయ్ పాలన...
నాలుగైదు రోజులకే విజయ్ పరిపాలనపై ఓ అభిప్రాయానికి రావడం సరికాదని అన్నారు. "ఆరు నెలల గడిస్తేగానీ చెప్పలేం. కొత్తగా వచ్చిన వారిని తేలికగా చూడకూడదు... అలాగని వారి నుండి మరీ ఎక్కువగా ఆశించకూడదు" అని కమల్ హాసన్ అన్నారు.
ప్రస్తుతం కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి ఓ సినిమా చేస్తోన్నారు. దాదాపు 700 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు.
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026

Jayam Ravi | నెలకు నలభై లక్షలు ఇవ్వాల్సిందే – జయం రవి నుంచి భరణం కోరిన భార్య – తెరపైకి అగ్ర హీరో పేరు…
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



