Errabelli Dayakar Rao | ఒక్క గింజ ధాన్యమైనా కొన్నారా..? పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు : ఎర్రబెల్లి దయాకర్ రావు
Errabelli Dayakar Rao | రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెబుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ఒక్క గింజ ధాన్యమైనా కొన్నారా..? అని నిలదీశారు.
Errabelli Dayakar Rao | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెబుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ఒక్క గింజ ధాన్యమైనా కొన్నారా..? అని నిలదీశారు. తెలంగాణ భవన్‌లో ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం మీడియాతో మాట్లాడారు.
రైతు మేళా అని కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్న ఈ రోజు ఏర్పాటు చేసింది. ఏం చేశారని రైతు మేళా గుర్తొచ్చింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి కాంగ్రెస్ నాయకులు రైతుల మేళా పెట్టండి. కాంగ్రెస్ కార్యకర్తలను బస్సులో తీసుకొచ్చి మేళా నిర్వహిస్తున్నారు. కేంద్రాలకు వెళ్లి మేము ఇది చేసాం అని చెప్తే మేము దేనికైనా రెడీ అని చెప్పాం. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు మీరు వ్యవసాయ శాఖ మంత్రి కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై మంత్రి కాదు అని ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.
మీరు మంత్రులుగా ఏం చేశారు. ఒక్క గింజ ధాన్యం అయిన కొన్నారా? 50 శాతం కొనుగోళ్లు కొనలేదు. బోనస్ ఇచ్చారా? కేసీఆర్ ఇచ్చిన స్కీమ్స్ కూడా మీరు అమలు చేయలేదు. రైతు బోగస్ ప్రభుత్వం అయ్యింది కాంగ్రెస్. రైతులను మోసం చేశారు. మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలో తీవ్ర పంట నష్టం జరగడంతో పాటు రైతులు చనిపోయారు. కనీసం అధికారులు వెళ్ళి రిపోర్ట్ రాశారా? కేటీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యింది. కేటీఆర్ రైతుల గురించి మాట్లాడితే కేసు పెట్టారు. రేవంత్ రెడ్డి కేసీఆర్‌పైన అడ్డగోలుగా ఇష్టానుసారంగా మాట్లాడారు.. రేవంత్ మీద ఎన్ని కేసులు పెట్టాలి. రైతుల కోసం మా పోరాటం ఆగదు. దమ్ముంటే కేసులు పెట్టు, జైలుకు వెళ్లేందుకు అయిన సిద్ధమే. చనిపోయిన రైతులను ఆదుకోవాలి, పంట నష్టపరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నామని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



