త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TVK Vijay | ప్చ్ విజ‌య్‌కి మ‌ళ్లీ నిరాశే.. 118 మంది సంత‌కాల‌తో రండి

TVK Vijay | త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వ ఏర్పాటుపై నెల‌కొన్న‌ ఉత్కంఠ‌కు తెర‌ప‌డ‌టం లేదు. వ‌రుస‌గా రెండోరోజు గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన టీవీకే చీఫ్ విజ‌య్‌కి నిరాశే ఎదురైంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మెజారిటీ మ‌ద్ద‌తు టీవీకేకి ఇంకా ల‌భించ‌లేదని గ‌వ‌ర్న‌ర్ చెప్పారు. 118 మంది ఎమ్మెల్యేల సంత‌కాల‌తో రావాల‌ని విజ‌య్‌ని తిరిగి వెన‌క్కి పంపించారు.

D

National | Published On May 7, 2026, 4.40 pm IST

TVK Vijay | ప్చ్ విజ‌య్‌కి మ‌ళ్లీ నిరాశే.. 118 మంది సంత‌కాల‌తో రండి
Advertisement
  • మెజారిటీపై క‌న్విన్స్ కాని గ‌వ‌ర్న‌ర్‌
  • సీఎం కాన్వాయ్‌ని తిర‌స్క‌రించిన విజ‌య్‌
  • గ‌వ‌ర్న‌ర్ తీరుపై విమ‌ర్శ‌లు

TVK Vijay | త్రినేత్ర న్యూస్ : ఇవాళ వ‌రుస‌గా రెండోరోజు గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను విజ‌య్ క‌లిశారు. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు, అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. ఇక ఈ భేటీపై లోక్‌భవ‌న్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. "ఇవాళ గవర్నర్ ఆర్లేకర్‌తో విజయ్ భేటీ అయ్యారు. మెజార్టీ కనిపించడం లేదని వివరించారు. మెజార్టీతోనే రావాలని గవర్నర్‌ సూచించారు" అని అందులో పేర్కొంది.

విజ‌య్‌కి గ‌వ‌ర్న‌ర్ హామీ..

భేటీ సంద‌ర్భంగా విజ‌య్‌కి గ‌వ‌ర్న‌ర్ ప‌లు ప్ర‌శ్న‌లు సంధించిన‌ట్లుగా తెలిసింది. 113 మంది ఎమ్మెల్యేల‌తో మెజారిటీ స‌భ‌లో మీ బ‌లాన్ని ఎలా నిరూపించుకుంటారు..? ఈ సంఖ్య‌తో స్థిర‌మైన ప్ర‌భుత్వం ఎలా ఏర్ప‌డుతుంది..? మీకు మ‌ద్ద‌తిచ్చే పార్టీలు, ఎమ్మెల్యేల వివ‌రాల‌తో లిస్టును నాకు అందించండి అని విజ‌య్‌కి గ‌వ‌ర్న‌ర్ సూచించిన‌ట్లు స‌మాచారం. అదే స‌మ‌యంలో విజ‌య్‌కి గ‌వ‌ర్న‌ర్ ఓ కీల‌క హామీ కూడా ఇచ్చిన‌ట్లుగా రాజ్‌భ‌వ‌న్ వ‌ర్గాల ద్వారా తెలిసింది. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు ఇత‌ర పార్టీలెవ‌రినీ ఆహ్వానించ‌బోన‌ని విజ‌య్‌కి గ‌వ‌ర్న‌ర్ హామీ ఇచ్చార‌ట‌. ప్ర‌మాణ స్వీకారానికి ముందే మ‌ద్ద‌తు తెలుపుతూ 118 మంది ఎమ్మెల్యేలు చేసిన సంత‌కాల‌తో రావాల‌ని టీవీకే చీఫ్‌కి గ‌వ‌ర్న‌ర్ సూచించిన‌ట్లు తెలుస్తోంది.

అనుమ‌తివ్వండి..

ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజ‌య్‌కి అనుమ‌తివ్వాల‌ని డీఎంకే కూట‌మి పార్టీలు వీకేసీ, సీపీఎం, సీపీఐ గ‌వ‌ర్న‌ర్‌ను కోరాయి. ఇదే అంశంపై ఆయా పార్టీలు స్టాలిన్‌తో కూడా చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలిసింది. టీవీకేతో క‌లిసి వెళ్తామ‌ని చెప్ప‌గా.. మీ ఇష్టం అని నిర్ణ‌యాన్ని మిత్ర‌ప‌క్ష‌ పార్టీల‌కే స్టాలిన్ వ‌దిలేశార‌ట‌. దీంతో వారు కూడా టీవీకేకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంపై అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

మెజారిటీపై క‌న్విన్స్ కాని గ‌వ‌ర్న‌ర్‌..

త‌మిళ‌నాడులో 234 అసెంబ్లీ స్థానాల‌కు గానూ విజ‌య్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలుపొందింది. విజయ్ రెండు నియోజకవర్గాల్లో గెలవడంతో ఒక సీటు వదులుకోవాలి. దీంతో పార్టీ బలం 107కి తగ్గుతుంది. కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో సంఖ్య 112కి చేరింది. కానీ మెజారిటీకి కావలసిన 118కి ఇంకా తక్కువ ఉన్నాయి. టీవీకే చూపించిన మెజారిటీపై గ‌వ‌ర్న‌ర్ క‌న్విన్స్ కావ‌డంలేదు.

గ‌వ‌ర్న‌ర్ వెనుక బీజేపీ

గ‌వ‌ర్న‌ర్ తీరుపై ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. టీవీకే పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌కుండా గ‌వ‌ర్న‌ర్ ద్వారా బీజేపీ అడ్డుప‌డుతోంద‌ని ఆరోపిస్తున్నాయి. గ‌వ‌ర్న‌ర్ తీరు ప్ర‌జా తీర్పును అవ‌మానించ‌డ‌మే అంటూ ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. విజ‌య్ సీఎం అవ్వ‌డం బీజేపీకి ఏ మాత్రం ఇష్టం లేదని.. ఆ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేతో క‌మ‌లం పార్టీ గేమ్ ఆడుతోంద‌ని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ విమ‌ర్శించారు. గ‌వ‌ర్న‌ర్‌ను అడ్డుపెట్టుకుని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌కుండా అడ్డుకోవ‌డం దారుణ‌మ‌ని వ్యాఖ్యానించారు. అయితే, ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను బీజేపీ తోసిపుచ్చింది.

సీఎం కాన్వాయ్ వద్దు: విజయ్‌

ఎన్నిక‌ల్లో గెలుపు అనంత‌రం ప్రొటోకాల్ ప్ర‌కారం పోలీసులు అందించిన ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని విజ‌య్ సున్నితంగా తిర‌స్క‌రించారు. ప్రమాణస్వీకారానికి ముందే ఆ ఏర్పాటు తనకు వద్దని విజయ్ చెప్పారు. ఈ విష‌యాన్ని టీవీకే వెల్లడించింది. పోలీసులు కూడా ఈ విష‌యాన్ని ధ్రువీకరించారు.

Also Read..

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.. బండి సంజ‌య్‌పై కేటీఆర్ ఆగ్ర‌హం

బ‌డ్జెట్ ధ‌ర‌కే 5జి ట్యాబ్‌ను లాంచ్ చేసిన ఏస‌ర్‌.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

బూతు సాంగ్ కాంట్ర‌వ‌ర్సీ.. విచారణకు హాజరైన నోరా ఫతేహి.. తప్పుకు ప్రాయశ్చిత్తంగా....

Advertisement
Advertisement