త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Air Pollution | ఢిల్లీలో కాలుష్యానికి ఆప్ నేత‌లు కుట్ర : బీజేపీ మంత్రి

Delhi Air Pollution | దీపావ‌ళి (Diwali) పండుగ వేళ ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని (Delhi Air Pollution) పెంచేందుకు పంజాబ్‌లోని ఆప్ ప్ర‌భుత్వం కుట్ర‌ప‌న్నింద‌ని బీజేపీ (BJP) ఆరోపించింది. న‌వంబ‌ర్ 7న 125 ప్రాంతాల్లో పంట వ్య‌ర్థాల ద‌హ‌నం న‌మోద‌వ‌గా.. న‌వంబ‌ర్ 8 నాటికి ఆ సంఖ్య 1,200కి పెరిగింద‌ని పేర్కొంది. ఒక్క రోజులోనే 10 రెట్లు ఎలా పెరిగింది..? అంటూ ప్ర‌శ్నించింది.

D

National | Published On Nov 9, 2026, 4.06 pm IST

Delhi Air Pollution | ఢిల్లీలో కాలుష్యానికి ఆప్ నేత‌లు కుట్ర : బీజేపీ మంత్రి
Advertisement
  • గ్యాస్ ఛాంబ‌ర్‌లా ఢిల్లీ
  • అధికార‌, విప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం

Delhi Air Pollution | త్రినేత్ర న్యూస్ : దేశ‌రాజ‌ధాని ఢిల్లీ కాలుష్య కోర‌ల్లో చిక్కుకుంది. దీపావ‌ళి (Deepavali) పండుగ నేప‌థ్యంలో ఆదివారం రాత్రి ప్ర‌జ‌లు ప‌టాకులు కాల్చడంతో న‌గ‌ర‌మంతా తీవ్ర వాయు కాలుష్యంతో గ్యాస్ (Delhi Air Pollution) ఛాంబ‌ర్‌గా మారిపోయింది. ఆదివారం రాత్రి 7 గంటలకు 371గా ఉన్న గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ).. ఉద‌యం 8.01 గంట‌ల స‌మ‌యానికి 483కు పెరిగింది. దీంతో విష‌పూరిత‌మైన పొగ‌తో ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. న‌గ‌రంలో తాజా ప‌రిస్థితిపై అధికార బీజేపీ, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం చోటు చేసుకుంది.

ఢిల్లీలో కాలుష్యానికి పంజాబ్ ప్ర‌భుత్వం కుట్రప‌న్నింద‌ని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీలో కాలుష్యాన్ని కృత్రిమంగా పెంచేందుకు పంగుడ‌ను ల‌క్ష్యంగా చేసుకుని పంజాబ్‌లోని ఆప్ ప్ర‌భుత్వం కావాల‌నే పంట వ్య‌ర్థాల ద‌హ‌నాల‌కు పాల్ప‌డింద‌ని ఢిల్లీ మంత్రి క‌పిల్ మిశ్రా (Kapil Mishra) ఆరోపించారు. "దీపావళి రోజున పంజాబ్‌లో పంట వ్యర్థాలను కాల్చే ఘటనలు అకస్మాత్తుగా పెరిగాయి. రాజ‌ధానిలో కాలుష్యాన్ని మ‌రింత పెంచేందుకు ఉద్దేశ‌పూర్వ‌కంగా చేసిన ప్ర‌య‌త్న‌మే ఇది. పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ దీనిపై విచార‌ణ జ‌ర‌పాలి. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు. త‌న‌కు, బీజేపీ నేత సిర్సాకు పంజాబ్‌లోని రైతుల నుంచి వ‌రుస‌గా ఫోన్ కాల్స్ వ‌చ్చాయ‌ని తెలిపారు. తాము ఇళ్ల‌లో దీపావ‌ళి జ‌రుపుకుంటుంటే త‌మ‌ పొలాల‌కు నిప్పు పెడుతున్నారంటూ రైతులు త‌మ‌తో చెప్పిన‌ట్లు మంత్రి ఆరోపించారు.

అయితే రైతుల వాద‌న‌ల‌ను తాము మొద‌ట్లో న‌మ్మ‌లేద‌ని మంత్రి పేర్కొన్నారు. ప్ర‌భుత్వం అందుబాటులో ఉంచిన పంట వ్య‌ర్థాల ద‌హ‌నానికి సంబంధించిన శాటిలైట్ డేటాను ప‌రిశీలించిన‌ట్లు చెప్పారు. న‌వంబ‌ర్ 7న 125 ప్రాంతాల్లో పంట వ్య‌ర్థాల ద‌హ‌నం న‌మోదైన‌ట్లు చెప్పారు. అయితే, దీపావ‌ళి రోజున అంటే న‌వంబ‌ర్ 8 నాటికి ఆ సంఖ్య 1,200కి పెరిగింద‌ని పేర్కొన్నారు. ఒక్క రోజులోనే 10 రెట్లు ఎలా పెరిగింది..? అని ప్ర‌శ్నించారు. దీన్ని చాలా తీవ్ర‌మైన విష‌యంగా పేర్కొన్న మంత్రి క‌పిల్ మిశ్రా.. ఇది రైతులపై, దీపావళిపై, ఢిల్లీపై, పంజాబ్‌పై జరిగిన కుట్రగా అభివ‌ర్ణించారు. పంజాబ్‌లోని ఢిల్లీ ఆప్ నేత‌ల ఫోన్ కాల్ డేటాను ప‌రిశీలించాలంటూ సీఎం మాన్‌ను కోరారు.

కాలుష్య డేటాను ప్ర‌భుత్వం తొక్కిపెడుతోందా..?

మ‌రోవైపు ఢిల్లీలో క్షీణిస్తున్న గాలి నాణ్యతపై బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా (Pawan Khera) తీవ్రంగా తప్పుబట్టారు. నవంబర్ 9 తెల్లవారుజామున ఢిల్లీలోని పలు మానిటరింగ్ స్టేషన్ల నుంచి కాలుష్య రీడింగ్‌లు అందుబాటులో లేకుండా పోయాయని ఆయన ఆరోపించారు. న‌వంబ‌ర్ 8-9 రాత్రి 2 గంట‌ల నుంచి 3 గంట‌ల మ‌ధ్య ఢిల్లీలోని 39 మ మానిట‌రింగ్ స్టేష‌న్ల‌లో 25 చోట్ల ఎలాంటి PM2.5 రీడింగ్‌లు నమోదు కాలేదని చెప్పారు. ప్రభుత్వం కాలుష్య డేటాను తొక్కిపెడుతోందా..? లేదంటే కాలుష్య స్థాయిలను రికార్డ్ చేయకుండా మానిటరింగ్ పరికరాలను ఉద్దేశపూర్వకంగా స్విచ్ ఆఫ్ చేశారా..? అని అనుమానం వ్య‌క్తం చేశారు. లేదంటే ఆ స‌మ‌యంలో కాలుష్య స్థాయిలు ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరి.. కాలుష్యాన్ని కొలిచే పరికరాల గరిష్ట సామర్థ్యాన్ని (Measuring Capacity) మించిపోయిందా..? అని నిల‌దీశారు. కార‌ణం ఏదైనా ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఖేరా డిమాండ్ చేశారు.

AQI రీడింగ్‌లలో రిగ్గింగ్ జరుగుతోంది..

ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (AQI) ప్రమాదకర స్థాయికి చేరుకున్నప్పటికీ.. పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు చూపించేందుకు బీజేపీ ప్రభుత్వం కాలుష్య గణాంకాలను తారుమారు చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత‌ సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. కాలుష్యానికి సంబంధించిన రీడింగ్‌లను తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఏక్యూఐ మానిటరింగ్ స్టేషన్ల చుట్టూ నేరుగా నీళ్లు జల్లుతోందని ఆరోపించారు. అంతేకాదు, కొన్ని మానిట‌రింగ్ స్టేష‌న్ల‌ను మూసివేశార‌ని చెప్పారు. కాలుష్యం ఎక్కువ‌గా ఉండే పారిశ్రామిక‌, నివాస ప్రాంతాల‌ను కాకుండా పచ్చదనంతో కూడిన ప్రశాంతమైన ప్రాంతాల్లో 20 కొత్త ఏక్యూఐ స్టేష‌న్‌ల‌ను ఏర్పాటు చేశార‌ని విమ‌ర్శించారు.

Also Read..

క్యాన్సర్ రోగుల‌కు భారీ ఊరట.. 96.45 శాతం వరకు త‌గ్గిన‌ మందుల ధరలు..!

జీసీసీలను సంప్రదాయ సేవలకే పరిమితం కానివ్వం.. ఆవిష్క‌ర‌ణ కేంద్రాలుగా త‌యారు చేస్తం

మేక్‌మైట్రిప్‌ ఐపీఓకు సెబీ గ్రీన్‌సిగ్నల్.. త్వరలో మార్కెట్‌లోకి..

Advertisement
Advertisement