త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sai Pallavi | కొడుకుకు హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో చియాన్‌ విక్రమ్ మూవీ.. హీరోయిన్‌గా సాయిపల్లవి!

రామాయ‌ణ‌, ఓం విజ‌యాల త‌ర్వాత మ‌రో ప్ర‌యోగానికి సిద్ధ‌మైంది నాచుర‌ల్ బ్యూటీ సాయిప‌ల్ల‌వి. త‌మిళంలో చియాన్ విక్ర‌మ్ హీరోగా మారి సెల్వ‌రాజ్ డైరెక్ష‌న్‌లో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ రాబోతున్న‌ట్లు స‌మాచారం. ఇందులో సాయిప‌ల్ల‌వి ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. రా అండ్ ర‌స్టిక్‌గా ఆమె క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ని టాక్ వినిపిస్తోంది.

N

Entertainment | Published On Nov 24, 2026, 1.58 pm IST

Sai Pallavi | కొడుకుకు హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో చియాన్‌ విక్రమ్ మూవీ.. హీరోయిన్‌గా సాయిపల్లవి!
Advertisement

Sai Pallavi |  రామాయ‌ణ మూవీతో బాలీవుడ్‌లో తొలి హిట్‌ను అందుకుంది సాయిప‌ల్ల‌వి. ఈ మైథాల‌జీ మూవీలో సీత పాత్ర కోసం నాచుర‌ల్ బ్యూటీని ఎంపిక‌చేయ‌డంపై చాలా విమ‌ర్శ‌లొచ్చాయి. వాటికి త‌న న‌ట‌న‌తోనే బ‌దులిచ్చింది సాయిప‌ల్ల‌వి. ర‌ణ‌బీర్‌క‌పూర్ హీరోయిన్‌గా న‌టించిన రామాయ‌ణ ఇర‌వై రోజుల్లో 1700 కోట్ల క‌లెక్ష‌న్లు ద‌క్కించుకుంది. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

బాలీవుడ్‌లో అవ‌కాశాలు....

రామాయ‌ణ త‌ర్వాత బాలీవుడ్‌లో సాయిప‌ల్ల‌వికి అవ‌కాశాలు పెరిగాయి. అగ్ర బ్యాన‌ర్లు, ద‌ర్శ‌కులు ఆమెతో సినిమాలు చేసేందుకు ఆస‌క్తిని చూపుతున్నాయి. రామాయ‌ణ త‌ర్వాత హిందీ సినిమాల‌కు కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చి తిరిగి ద‌క్షిణాది సినిమాల‌పై ఫోక‌స్ పెట్టాల‌ని నాచుర‌ల్ బ్యూటీ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

మారి సెల్వ‌రాజ్‌....

ఇటీవ‌ల రిలీజైన ఓంలో పోలీస్ పాత్ర‌లో మెప్పించిన ఈ బ్యూటీ తాజాగా మ‌రో త‌మిళ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. కోలీవుడ్ సీనియ‌ర్ హీరో చియాన్ విక్ర‌మ్‌తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. విక్ర‌మ్ , సందేశాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు మారి సెల్వ‌రాజ్ కాంబినేష‌న్‌లో ఓ కోలీవుడ్ మూవీ రాబోతున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం సొసైటీలో నెల‌కొన్న ఓ సామాజిక స‌మ‌స్య ప్ర‌ధానంగా ద‌ర్శ‌కుడు మారి సెల్వ‌రాజ్ ఓ క‌థ‌ను సిద్ధం చేసిన‌ట్లు చెబుతోన్నారు. ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో విక్ర‌మ్ ఈ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. డీ గ్లామ‌ర్ లుక్‌లో రా అండ్ ర‌స్టిక్‌గా ఉంటుంద‌ని అంటున్నారు. సాయిప‌ల్ల‌వి రోల్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

కొడుకు త‌ర్వాత‌....

ఈ త‌మిళ సినిమాలో ఉరియాండి ఫేమ్ విజ‌య్ కుమార్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు త‌మిళ సినీ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ధృవ్ విక్ర‌మ్‌తో బైస‌న్ అనే సినిమా చేశాడు మారి సెల్వ‌రాజ్‌. ఈ సినిమాతోనే హీరోగా కెరీర్‌లో తొలి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను అందుకున్నాడు ధృవ్. కొడుకుకు హిట్టు ఇచ్చిన డైరెక్ట‌ర్‌తో ఇప్పుడు తండ్రి సినిమా చేయ‌బోతుండ‌టం త‌మిళ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

 

Advertisement
Advertisement