త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | మేమే అక్క‌డ ధ‌ర్నాకు దిగుతాం.. సుప్రీంకోర్టు తీవ్ర‌ హెచ్చ‌రిక‌లు

Supreme Court | ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) స‌మీపంలో స‌రైన ఫుట్‌పాత్‌లు (Footpath), పాద‌చారుల క్రాసింగ్‌లు (pedestrian crossings) లేక‌పోవ‌డంపై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. స‌మ‌స్య పరిష్క‌రించ‌క‌పోతే తామే అక్క‌డ ధ‌ర్నాకు దిగుతామ‌ని న్యాయ‌మూర్తులు జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్ తీవ్రంగా హెచ్చ‌రించారు.

D

National | Published On Oct 17, 2026, 12.03 pm IST

Supreme Court | మేమే అక్క‌డ ధ‌ర్నాకు దిగుతాం.. సుప్రీంకోర్టు తీవ్ర‌ హెచ్చ‌రిక‌లు
Advertisement

Supreme Court | ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) స‌మీపంలో స‌రైన ఫుట్‌పాత్‌లు, పాద‌చారుల క్రాసింగ్‌లు లేక‌పోవ‌డం (pedestrian crossings)పై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించకపోతే.. కోర్టు ప్ర‌ధాన గేటు వ‌ద్ద తామే స్వ‌యంగా ధ‌ర్నాకు దిగుతామ‌ని న్యాయ‌మూర్తులు జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్ తీవ్రంగా హెచ్చ‌రించారు. పనులు పూర్తయ్యేదాకా అక్కడి నుంచి కదిలే ప్ర‌స‌క్తే లేదని తేల్చిచెప్పారు. అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) విక్రమ్‌జిత్ బెనర్జీని కూడా ఇంటికి వెళ్ల‌నివ్వ‌మ‌ని హెచ్చ‌రించారు.

ప్రతిరోజూ వేలాది మంది న్యాయవాదులు, వ్యాజ్యదారులు, స్థానికులు, పిల్ల‌లు ఈ ర‌హ‌దారిని ఉప‌యోగిస్తున్నార‌ని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. అయిన‌ప్ప‌టికీ హైకోర్టు జంక్ష‌న్‌, నేష‌న‌ల్ జూలాజిక‌ల్ పార్క్ స‌మీపంలో స‌రైన పాద‌చారుల క్రాసింగ్ లేక‌పోవ‌డం ప‌ట్ల అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం పౌరులకు సురక్షితమైన, ఎలాంటి అడ్డంకులు లేని ఫుట్‌పాత్‌లను ఉపయోగించుకునే హక్కు ఉందని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. పాదచారుల భద్రత అత్యంత ముఖ్యమైనదని పునరుద్ఘాటించింది. వాహన రాకపోకల కంటే వాటికే పెద్దపీట వేయాలని పేర్కొంది. ఈ మేరకు రోడ్ల వెంట ఫుట్‌పాత్‌ల ఏర్పాటు, నిర్వహణను ప్రభుత్వాలు తప్పనిసరిగా చేపట్టాలని ఆదేశించింది.

మిమ్మ‌ల్ని కూడా ఇంటికి వెళ్ల‌నివ్వం..

నవంబర్ 25లోగా మధుర రోడ్డుపై పాదచారుల భద్రతను నిర్ధారించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోకపోతే, ఢిల్లీ హైకోర్టు ప్రధాన ద్వారం వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చ‌రించింది. "ఇంకా ఆలస్యం జరిగితే సహించేది లేదు. వచ్చే విచారణ తేదీలోగా అధికారులు ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలి. లేదంటే హైకోర్టు గేటు వ‌ద్ద మేమిద్ద‌ర‌మే స్వ‌యంగా ధ‌ర్నాకు దిగుతాము. ప‌నులు పూర్త‌య్యే వ‌ర‌కూ అక్క‌డి నుంచి క‌దిలేది లేదు. విక్రమ్‌జిత్ బెనర్జీని కూడా ఇంటికి వెళ్లనివ్వ‌ము. అవ‌స‌ర‌మైతే ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (Chief Secretary) కూడా వ్య‌క్తిగ‌తంగా కోర్టుకు పిలిపిస్తాము" అని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.

రాష్ట్రాల‌కు కీల‌క ఆదేశాలు

అదే స‌మ‌యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రోడ్లపై ఆక్రమణలు లేకుండా, సురక్షితమైన, స్పష్టంగా గుర్తించబడిన ఫుట్‌పాత్‌లు ఉండేలా చూడాలని సుప్రీం ధ‌ర్మాస‌నం ఆదేశించింది. రోడ్ల వెంట ఫుట్‌పాత్‌ల ఏర్పాటు, నిర్వహణను ప్రభుత్వాలు తప్పనిసరిగా చేపట్టాలని స్ప‌ష్టం చేసింది. అలాగే రోడ్ల పక్కన ఉండే అన‌ధికారిక స్టాల్స్‌, విద్యుత్ పోల్స్‌, చెత్తాచెదారం వంటి అన్ని ర‌కాల ఆక్ర‌మ‌ణ‌లు, అడ్డంకుల‌ను తొల‌గించి ఫుట్‌పాత్‌లను పాదచారులకు పూర్తిగా అందుబాటులోకి తెవాలని స్పష్టం చేసింది. ఫుట్‌పాత్‌ల నిర్మాణంలో ఐఆర్‌సీ మార్గదర్శకాలను పాటించాల‌ని సూచించింది. దివ్యాంగులు సులభంగా నడవడానికి వీలుగా ప్రత్యేక ర్యాంపులు, జారిపడకుండా ఉండే ఉపరితలాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాల అమలును పర్యవేక్షించడానికి ఒక కేంద్ర కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ధ‌ర్మాస‌నం ఆదేశించింది. అనంత‌రం త‌దుప‌రి విచార‌ణ‌ను న‌వంబ‌ర్ 25కు వాయిదా వేసింది.

Also Read..

మ‌హిళ‌ల‌ను రాత్రిపూట నిర్బంధించ‌డ‌మేంటి..? ఇది ఏ చ‌ట్ట‌ప్ర‌కారం స‌మ‌ర్థ‌నీయం : నేహా బోరా

ముంబైలో సీజేపీ నిర‌స‌న‌ అట్ట‌ర్ ఫ్లాప్

రోడ్డు ప్రమాదాల నివారణే ప్ర‌భుత్వ‌ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

Advertisement
Advertisement