త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sridhar Babu | మ‌న బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా గ్లోబ‌ల్ స‌మ్మిట్‌ ఏర్పాట్లు ఉండాలి

Sridhar Babu | తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మ‌రింత పెరిగేలా గ్లోబ‌ల్ స‌మ్మిట్ ఏర్పాట్లు (Global Summit Preparations) చేయాల‌ని మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు (Sridhar Babu) అధికారుల‌ను ఆదేశించారు.

S

Telangana | Published On Nov 24, 2026, 2.24 pm IST

Sridhar Babu | మ‌న బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా గ్లోబ‌ల్ స‌మ్మిట్‌ ఏర్పాట్లు ఉండాలి
Advertisement
  • పెండింగ్ పనుల‌ను వెంట‌నే పూర్తి చేయండి
  • భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ ప‌ర్య‌ట‌న‌లో మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు

Sridhar Babu | త్రినేత్ర న్యూస్‌: తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మ‌రింత పెరిగేలా గ్లోబ‌ల్ స‌మ్మిట్ ఏర్పాట్లు (Global Summit Preparations) చేయాల‌ని మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు (Sridhar Babu) అధికారుల‌ను ఆదేశించారు. పెండింగ్ ప‌నుల‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మంగ‌ళ‌వారం భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ (Bharath Future City)లో ఆయ‌న ప‌ర్య‌టించి క్షేత్రస్థాయిలో ప‌నుల‌ను ప‌రిశీలించారు. ప్రధాన వేదిక, ఎక్స్‌పో జోన్, సెక్యూరిటీ, ట్రాఫిక్ నియంత్రణ, కనెక్టివిటీ, అతిథులకు వసతులు తదితర అంశాలపై ప్రత్యేక సమీక్ష చేసిన అనంత‌రం ఆయ‌న మాట్లాడారు.

తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగేలా ఏర్పాట్లు ఉండాలి. సమ్మిట్ గడువు సమీపిస్తున్నందున పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి. ఏర్పాట్లలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా పకడ్బందీగా వ్యవహరించాలి. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలి అని శ్రీ‌ధ‌ర్‌బాబు సూచించారు.

Advertisement
Advertisement