Reliance Jio | జియో న్యూ ఇయర్ 2027 ఆఫర్.. రూ.399కే అపరిమిత డేటా..
Reliance Jio | రిలయన్స్ జియో పదేళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకుని హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2027ను ప్రకటించింది. ఇందులో రూ.399, రూ.3,999 ప్రీపెయిడ్ ప్లాన్లతోపాటు అపరిమిత 5జి డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు, నైట్ డేటా ఆఫర్‌ను అందిస్తోంది. డిజిటల్ సేవలు, ఓటీటీ ప్రయోజనాలను కూడా రీఛార్జ్ ప్లాన్లలో భాగంగా చేర్చింది.
Reliance Jio | రిలయన్స్ జియో పదేళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకుని హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2027ను ప్రకటించింది. ఇందులో రూ.399, రూ.3,999 ప్రీపెయిడ్ ప్లాన్లతోపాటు అపరిమిత 5జి డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు, నైట్ డేటా ఆఫర్‌ను అందిస్తోంది. డిజిటల్ సేవలు, ఓటీటీ ప్రయోజనాలను కూడా రీఛార్జ్ ప్లాన్లలో భాగంగా చేర్చింది.
ఏయే ఆఫర్లను అందిస్తోంది..
రిలయన్స్ జియో తన పదేళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త సంవత్సర ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇందులో రూ.399 ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత 4జి, 5జి డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అందిస్తారు. వీటితోపాటు 12 నెలల క్యాన్వా ప్రొ సబ్‌స్క్రిప్షన్, జియోహాట్‌స్టార్ మొబైల్ (హాలీవుడ్ కంటెంట్ సహా), ఫ్యాన్‌కోడ్, జియోగేమ్స్, 50 జీబీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ ప్రయోజనాలు లభిస్తాయి. ఇక రూ.3,999 వార్షిక ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత 4జి, 5జి డేటా, వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. అదనంగా 12 నెలల క్యాన్వా ప్రొ లైట్, జియోహాట్‌స్టార్ మొబైల్, ఫ్యాన్‌కోడ్, 50 జీబీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్‌ను అందిస్తున్నారు.
చిన్న ప్యాక్‌లు సైతం..
అపరిమిత 5జి డేటా కోసం రూ.15, రూ.25 యాడ్ ఆన్ ప్యాక్‌లను కూడా ప్రకటించింది. రూ.15 ప్యాక్ ఒక రోజు, రూ.25 ప్యాక్ రెండు రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంటాయి. మరోవైపు రూ.50 నైట్ డేటా ప్యాక్ ద్వారా 28 రోజుల పాటు ప్రతి రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అపరిమిత 4జి, 5జి డేటా వినియోగించుకోవచ్చు. రూ.399, రూ.3,999 ప్లాన్లు, రూ.25 యాడ్ ఆన్ ప్యాక్ నవంబర్ 24 నుంచి అందుబాటులోకి రానుండగా, రూ.50 నైట్ డేటా ప్యాక్ నవంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. వినియోగదారులు మైజియో యాప్, జియో వెబ్‌సైట్, జియో స్టోర్లు, అధీకృత రిటైల్ స్టోర్ల ద్వారా ఈ ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవచ్చు.
తాజావార్తలు
- ●Sonia Gandhi | రాజీవ్ గాంధీ హత్య కోసం ఉద్దేశపూర్వకంగానే భద్రతను తొలగించారు : సోనియా గాంధీ
- ●Sai Pallavi | కొడుకుకు హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో చియాన్ విక్రమ్ మూవీ.. హీరోయిన్గా సాయిపల్లవి!
- ●Vivek Venkata Swamy | తెలంగాణ యువతకు జర్మనీలో ఉద్యోగావకాశాలు: మంత్రి వివేక్ వెంకటస్వామి
- ●Motorola Edge 70 Neo | మోటోరోలా ఎడ్జ్ 70 నియో లాంచ్.. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదుర్స్..
- ●Madras High Court | మహిళా కలెక్టర్‌కు ఎమ్మెల్యే అసభ్యకర మెసేజ్‌లు.. విజయ్ ప్రభుత్వంపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం
- ●Vijay Antony | అమీర్‌పేట వీధుల్లో హీరో విజయ్ ఆంటోనీ సందడి.. హోటల్లో చాయ్ తాగుతూ స్థానికులతో ముచ్చట్లు

Sonia Gandhi | రాజీవ్ గాంధీ హత్య కోసం ఉద్దేశపూర్వకంగానే భద్రతను తొలగించారు : సోనియా గాంధీ

Sai Pallavi | కొడుకుకు హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో చియాన్ విక్రమ్ మూవీ.. హీరోయిన్గా సాయిపల్లవి!

Vivek Venkata Swamy | తెలంగాణ యువతకు జర్మనీలో ఉద్యోగావకాశాలు: మంత్రి వివేక్ వెంకటస్వామి

Motorola Edge 70 Neo | మోటోరోలా ఎడ్జ్ 70 నియో లాంచ్.. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదుర్స్..






