త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fahadh Faasil | ఫ‌హాద్ ఫాజిల్ కొత్త సినిమా టైటిల్‌పై వివాదం – రాజ‌మౌళి కొడుకును ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు

మ‌ల‌యాళ విల‌క్ష‌ణ న‌టుడు ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా 96, స‌త్యం సుంద‌రం సినిమాల ఫేమ్ ప్రేమ్ కుమార్ డైరెక్ష‌న్‌లో రాబోతున్న థ్రిల్ల‌ర్ మూవీకి అస‌రీరి అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమాను తెలుగులో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ రిలీజ్ చేయ‌బోతున్నారు. కాగా ఈ తెలుగు టైటిల్ విష‌యంలో కార్తికేయ‌ను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. తెలుగుకు తెగులు ప‌ట్టించ‌వ‌ద్దంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

N

Entertainment | Published On Nov 24, 2026, 2.39 pm IST

Fahadh Faasil | ఫ‌హాద్ ఫాజిల్ కొత్త సినిమా టైటిల్‌పై వివాదం – రాజ‌మౌళి కొడుకును ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు
Advertisement

Fahadh Faasil |  మ‌ల‌యాళ వెర్స‌టైల్ యాక్ట‌ర్ ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా 96, స‌త్యం సుంద‌రం సినిమాల ఫేమ్ ప్రేమ్ కుమార్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా రాబోతుంది. ఈ మూవీ టైటిల్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు. ప్రేమ‌, మాన‌వ సంబంధాల ప్ర‌ధానంగా సినిమాలు చేసిన ప్రేమ్‌కుమార్ త‌న పంథాను మారుస్తూ ఫ‌స్ట్ టైమ్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో ఈ మూవీని తెర‌కెక్కిస్తోన్నారు.

రిలీజ్‌....

ఈ సినిమాకు అస‌రీరి అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. 2027 జ‌న‌వ‌రి 1న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సోమ‌వారం రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ ఆస‌క్తిని రేకెత్తించింది. ఇందులో స్క్రీన్ ప‌గిలిగిన ఓ మొబైల్‌ఫోన్‌... వైబ్రేష‌న్ సౌండ్స్ క‌నిపించాయి. అన్‌నౌన్ నంబ‌ర్ నుంచి కాల్ వ‌స్తున్న‌ట్లుగా మొబైల్ స్క్రీన్‌పై క‌నిపించింది. చివ‌ర‌కు డిఫ‌రెంట్ లుక్‌లో ఈ వీడియోలో ఫ‌హాద్ ఫాజిల్ క‌నిపించాడు.

రాజ‌మౌళి త‌న‌యుడు....

అస‌రీరి సినిమాను తెలుగులో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ రిలీజ్ చేయ‌బోతున్నారు. కాగా ఈ సినిమా టైటిల్‌పై నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. అశ‌రీరి అనే ప‌దాన్ని త‌ప్పుగా అస‌రీరిగా ఈ గ్లింప్స్‌లో చూపించ‌డంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అశ‌రీరి అంటే ఆకాశం నుంచి వినిపించే దైవం సందేశం అని అర్థం. పురాణాల‌తో ముడిప‌డిన ప‌విత్ర‌మైన ప‌దాన్ని త‌ప్పుగా ఎలా చూపిస్తారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తెలుగు తేలియ‌క‌పోతే తెలుసుకుకోవాలి...అంతే కానీ న‌చ్చిన‌ట్లు రాయ‌డం స‌రికాద‌ని రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ‌పై విమ‌ర్శ‌లుగుప్పిస్తున్నారు. సినిమా ర‌చ‌యిత‌లు త‌మ మిడిమిడిజ్ఞానంతో తెలుగు భాష‌కు తెగులు ప‌ట్టిస్తున్నార‌ని ప‌లువురు నెటిజ‌న్లు పెట్టిన కామెంట్లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

షూటింగ్ పూర్తి...

అస‌రీరి సినిమాలో శివద, చేతన్, గీత, హరీష్ ఉత్తమన్, కరుణాకరన్, శరణ్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. గోవింద్ వసంత మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ థ్రిల్ల‌ర్ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కొన‌సాగుతోన్నాయి.