Nifty 500, | క్యూ2లో కంపెనీల లాభాలు 32 శాతం జంప్.. మెటల్స్, ఫైనాన్షియల్స్ హవా.. దేశీయ సూచీల దారెటు..?
Nifty 500, | 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నిఫ్టీ 500 కంపెనీలు అద్భుతమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేశాయి. గతేడాదితో పోలిస్తే కంపెనీల మొత్తం నికర లాభాలు 32 శాతం పెరిగాయి. మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా స్మాల్ క్యాప్ కంపెనీలు లాభాల వృద్ధిలో పెద్ద కంపెనీలను అధిగమించాయి.
Nifty 500, | 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నిఫ్టీ 500 కంపెనీలు అద్భుతమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేశాయి. గతేడాదితో పోలిస్తే కంపెనీల మొత్తం నికర లాభాలు 32 శాతం పెరిగాయి. మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా స్మాల్ క్యాప్ కంపెనీలు లాభాల వృద్ధిలో పెద్ద కంపెనీలను అధిగమించాయి.
గత 3 ఏళ్లలో అత్యుత్తమ త్రైమాసిక ఆర్థిక పనితీరు..
భారత కార్పొరేట్ రంగం గత మూడేళ్లలోనే అత్యుత్తమ త్రైమాసిక ఆర్థిక పనితీరును నమోదు చేసింది. 2026 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో నిఫ్టీ 500 పరిధిలోని కంపెనీల మొత్తం అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 25 శాతం పెరిగాయి. నిర్వహణ లాభం (ఈబీఐటీడీఏ) 24 శాతం, పన్నుల అనంతర నికర లాభం (పీఏటీ) 32 శాతం వృద్ధి చెందాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను మినహాయిస్తే అమ్మకాలు, ఈబీఐటీడీఏ, నికర లాభాల వృద్ధి వరుసగా 23 శాతం, 23 శాతం, 30 శాతంగా నమోదైంది. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం తర్వాత అత్యుత్తమ త్రైమాసిక వృద్ధిగా నిలిచింది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఎంఓఎఫ్ఎస్ఎల్) నవంబర్ 2026 ఇండియా స్ట్రాటజీ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను మినహాయించిన నిఫ్టీ-500 కంపెనీల నికర లాభాలు 27 శాతం పెరిగాయి.
76 శాతం వృద్ధితో మెటల్స్ రంగం..
రంగాల వారీగా చూస్తే మెటల్స్ రంగం 76 శాతం లాభాల వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలు 61 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు 20 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ మూడు రంగాలు కలిపి నిఫ్టీ-500 కంపెనీల అదనపు లాభాల వృద్ధిలో దాదాపు 68 శాతం వాటాను అందించాయి. యుటిలిటీస్ రంగం 46 శాతం, సిమెంట్ 43 శాతం, ఆటోమొబైల్స్ 34 శాతం, క్యాపిటల్ గూడ్స్ 28 శాతం లాభాల వృద్ధిని సాధించాయి. ఫైనాన్షియల్ రంగంలో బ్యాంకులు 20 శాతం, ఎన్‌బీఎఫ్‌సీ రుణ సంస్థలు 21 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మరోవైపు కన్జ్యూమర్ కంపెనీల లాభాల వృద్ధి కేవలం 2 శాతానికే పరిమితమైంది. హెల్త్‌కేర్ రంగం 13 శాతం, టెక్నాలజీ రంగం 10 శాతం వృద్ధిని సాధించాయి. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్) మినహా మిగిలిన అన్ని రంగాలు సానుకూల లాభాల వృద్ధిని నమోదు చేశాయి.
స్మాల్ క్యాప్ కంపెనీలు 34 శాతం వృద్ధి..
మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా చూస్తే స్మాల్ క్యాప్ కంపెనీలు 34 శాతం లాభాల వృద్ధితో ముందంజలో నిలిచాయి. లార్జ్ క్యాప్ కంపెనీలు 31 శాతం, మిడ్ క్యాప్ కంపెనీలు 26 శాతం వృద్ధిని సాధించాయి. నిఫ్టీ-100 కంపెనీల లాభాలు 34 శాతం పెరగగా, నిఫ్టీ మిడ్‌క్యాప్-150 కంపెనీల లాభాలు 24 శాతం వృద్ధి చెందాయి. నిఫ్టీ-500 పరిధిలో సగానికి పైగా కంపెనీలు 15 శాతానికి మించిన లాభాల వృద్ధిని నమోదు చేయగా, కేవలం 4 శాతం కంపెనీలు మాత్రమే నష్టాలను ప్రకటించాయి. మరోవైపు, ఆర్థికేతర నిఫ్టీ-500 కంపెనీల ఈబీఐటీడీఏ మార్జిన్లు 20 బేసిస్ పాయింట్లు పెరిగి 17.4 శాతానికి చేరాయి. మెటల్స్ రంగంలో మార్జిన్లు 280 బేసిస్ పాయింట్లు పెరిగి 20.5 శాతానికి చేరడం విశేషం.
సూచీల దారెటు..?
అనుకూలమైన లోహాల ధరలు, అధిక ప్రీమియంలు ఇందుకు తోడ్పడ్డాయి. భారత ఈక్విటీ మార్కెట్లపై ఎంఓఎఫ్ఎస్ఎల్ సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తోంది. మెరుగుపడుతున్న కంపెనీల లాభాలు, దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, పలు రంగాల్లో ఆకర్షణీయమైన విలువలు, తగ్గుతున్న ముడి చమురు ధరలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి వస్తున్న పెట్టుబడులు మార్కెట్లకు అనుకూల అంశాలని పేర్కొంది. అయితే భౌగోళిక రాజకీయ పరిణామాలు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, కృత్రిమ మేధకు సంబంధించిన అంతర్జాతీయ అనిశ్చితులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు కీలకమైన రిస్కులుగా ఉన్నాయని హెచ్చరించింది. ఈ క్రమంలో ఇప్పటికే ఆల్ టైం గరిష్ట స్థాయిల వద్ద భారతీయ బెంచ్ మార్క్ సూచీలు ట్రేడవుతుండగా, పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. లాభాల స్వీకరణ ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున భారీ ఎత్తన పెట్టుబడులు పెట్టడం తగ్గించాలని అంటున్నారు. ఇక నిఫ్టీ ప్రస్తుతం కీలక నిరోధక స్థాయిల వద్ద ఉందని, 26000 మార్కుకు పైనే కొనసాగితే దీర్ఘకాలంలో మరింత ర్యాలీ ఉంటుందని చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. రూ.6.39 లక్షల కోట్ల సంపద ఆవిరి..
నవంబర్ 23, 2026

Stock Markets | ఆల్‌టైమ్ హై దిశగా సెన్సెక్స్, నిఫ్టీ.. భారీ ర్యాలీతో ముగిసిన సూచీలు..
నవంబర్ 20, 2026

Nifty Bank | బ్యాంకింగ్ షేర్లలో భారీ ర్యాలీ.. సరికొత్త మైలురాయికి చేరిన బ్యాంక్ నిఫ్టీ సూచీ..
నవంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Delhi High Court | తండ్రి ఇంటిని ఖాళీ చేయాల్సిందే.. కొడుకు, కోడలికి కోర్టు షాక్..!
- ●Fahadh Faasil | ఫహాద్ ఫాజిల్ కొత్త సినిమా టైటిల్‌పై వివాదం - రాజమౌళి కొడుకును ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
- ●Sridhar Babu | మన బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు ఉండాలి
- ●Sonia Gandhi | రాజీవ్ గాంధీ హత్య కోసం ఉద్దేశపూర్వకంగానే భద్రతను తొలగించారు : సోనియా గాంధీ
- ●Reliance Jio | జియో న్యూ ఇయర్ 2027 ఆఫర్.. రూ.399కే అపరిమిత డేటా..
- ●Sai Pallavi | కొడుకుకు హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో చియాన్ విక్రమ్ మూవీ.. హీరోయిన్గా సాయిపల్లవి!

Delhi High Court | తండ్రి ఇంటిని ఖాళీ చేయాల్సిందే.. కొడుకు, కోడలికి కోర్టు షాక్..!

Fahadh Faasil | ఫహాద్ ఫాజిల్ కొత్త సినిమా టైటిల్‌పై వివాదం - రాజమౌళి కొడుకును ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Sridhar Babu | మన బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు ఉండాలి

Sonia Gandhi | రాజీవ్ గాంధీ హత్య కోసం ఉద్దేశపూర్వకంగానే భద్రతను తొలగించారు : సోనియా గాంధీ



