త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iranian Oil | భార‌త్‌కు ఇరాన్ ముడి చ‌మురు.. ఏడేళ్ల‌లో తొలిసారి

Iranian Oil | దాదాపు ఏడేళ్ల త‌ర్వాత‌ భార‌త్ మ‌ళ్లీ ఇప్పుడు ఇరాన్ నుంచి ముడి చ‌మురును (Iranian Oil) దిగుమ‌తి చేసుకుంటోంది. ఇరాన్ నుంచి దాదాపు 6 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో 'పింగ్ షున్' (Ping Shun) అనే భారీ చమురు నౌక (Oil Tanker) భారత్‌ వైపు బయల్దేరింది.

D

National | Published On Apr 1, 2026, 4.16 pm IST

Iranian Oil | భార‌త్‌కు ఇరాన్ ముడి చ‌మురు.. ఏడేళ్ల‌లో తొలిసారి
Advertisement

Iranian Oil | పశ్చిమాసియాలో యుద్ధం కార‌ణంగా అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా పెరిగిన విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ముడిచ‌మురు ధ‌ర‌ల‌ను తగ్గించే ప్ర‌య‌త్నంలో భాగంగా ఇరాన్‌ ముడి చమురు (Iranian crude oil)పై విధించిన ఆంక్ష‌ల‌ను అమెరికా ఎత్తివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఫ‌లితంగా ఇరాన్‌ చమురు కొనుగోలుకు భార‌తీయ‌ చ‌మురు సంస్థ‌లు ఆస‌క్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే దాదాపు ఏడేళ్ల త‌ర్వాత‌ భార‌త్ మ‌ళ్లీ ఇప్పుడు ఇరాన్ నుంచి ముడి చ‌మురును (Iranian Oil) దిగుమ‌తి చేసుకుంటోంది.

ఇరాన్ నుంచి దాదాపు 6 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో 'పింగ్ షున్' (Ping Shun) అనే భారీ చమురు నౌక (Oil Tanker) భారత్‌ వైపు బయల్దేరింది. ఈ ట్యాంక‌ర్ మార్చి ప్రారంభంలో ఖ‌ర్గ్ ద్వీపం (Kharg Island) నుంచి ముడి చమురును లోడ్ చేసుకుంది. ఈ వారం చివ‌రి నాటికి అది భార‌త పోర్టుకు చేరుకుంటుంద‌ని అధికారులు తెలిపారు. త్వ‌ర‌లోనే గుజరాత్‌లోని వాడినార్ (Vadinar) రేవుకు చేరుకోనుంది. కాగా, ఇరాన్ నుంచి భార‌త్ ముడి చ‌మురు దిగుమ‌తి చేసుకోవ‌డం ఏడేళ్ల‌లో ఇదే తొలిసారి.

2019 మే నెలలో అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిన విష‌యం తెలిసిందే. అప్పటి నుంచి ఇరాన్ చమురు భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. 2018లో భారత్ రోజుకు సుమారు 5,18,000 బ్యారెళ్ల ఇరాన్ చమురును దిగుమతి చేసుకోగా.. మే 2019 నాటికి అది రోజుకు 2,68,000 బ్యారెళ్లకు తగ్గింది. మ‌రోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ సుమారు 350 మిలియన్ డాలర్ల విలువైన 50 లక్షల బ్యారెళ్ల ఇరాన్ చమురును కొనుగోలు చేసినట్లు సమాచారం.

Also Read..

అస్సాంలో బీజేపీకి హ్యాట్రిక్ ఖాయం.. కాంగ్రెస్ యువ‌రాజుకు వందో ఓట‌మి త‌ప్ప‌దు : ప్ర‌ధాని మోదీ

ఐసీఐసీఐ బ్యాంకులో రూ.23 కోట్ల మోసం.. న‌కిలీ బంగారం పెట్టి రుణం పొందిన క‌స్ట‌మ‌ర్లు

సీసీటీవీ కెమెరాల అమ్మ‌కాల‌పై క‌ఠిన నిబంధ‌న‌లు తెచ్చిన‌ ప్ర‌భుత్వం.. చైనా కంపెనీల‌కు షాకే

Advertisement
Advertisement