PM Modi | అస్సాంలో బీజేపీకి హ్యాట్రిక్ ఖాయం.. కాంగ్రెస్ యువరాజుకు వందో ఓటమి తప్పదు : ప్రధాని మోదీ
PM Modi | అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం నమోదు చేయడం ఖాయమని (BJP will hit hat trick) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ధీమావ్యక్తం చేశారు. కాంగ్రెస్ యువరాజుకు వందో ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు.
PM Modi | అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం నమోదు చేయడం ఖాయమని (BJP will hit hat trick) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ధీమావ్యక్తం చేశారు. ఏప్రిల్ 9న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీమాజి జిల్లాలోని గోగాముఖ్‌లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. గత పదేళ్లలో అస్సాంలో చాలా అభివృద్ధి జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏని మరోసారి ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోసారి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసి.. ఆరవ షెడ్యూల్ కింద గిరిజనులకు రక్షణ కల్పిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాని తీవ్ర విమర్శలు చేశారు. 60-65 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మపుత్ర నదిపై కేవలం మూడు వంతెనలను మాత్రమే నిర్మించగా.. బీజేపీ పదేళ్లలో ఐదు వంతెనలు నిర్మించి ప్రజల జీవితాలను, జీవనోపాధిని ఎంతో సులభతరం చేసిందని చెప్పారు. హస్తం పార్టీకి వరుసగా మూడోసారి కూడా ఓటమి తప్పదన్నారు. కాంగ్రెస్ యువరాజుకు వందో ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు.
కాగా, 126 అసెంబ్లీ స్థానాలు ఉన్న అస్సాంలో ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రధాని ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఇక ఈ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటికే మ్యానిఫెస్టోను కూడా రిలీజ్ చేసింది. మొత్తం 31 హామీలతో కూడిన మ్యానిఫెస్టోను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma), ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు నేతలు విడుదల చేశారు. ఇందులో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)తో పాటు మహిళలకు నెలకు రూ.3వేలు, రెండు లక్షల ఉద్యోగాలు వంటి హామీలు ప్రకటించారు.
Also Read..
ఐసీఐసీఐ బ్యాంకులో రూ.23 కోట్ల మోసం.. నకిలీ బంగారం పెట్టి రుణం పొందిన కస్టమర్లు
సీసీటీవీ కెమెరాల అమ్మకాలపై కఠిన నిబంధనలు తెచ్చిన ప్రభుత్వం.. చైనా కంపెనీలకు షాకే
గోల్డ్ లోన్ తీసుకున్నాక ధరలు పడిపోతే ఏం చేస్తారు..? LTV అంటే ఏమిటి..?
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






