Actor Dhanush | నాకు ఏ పార్టీ మద్దతూ లేదు.. నా వెనుక బలమైన అభిమాన గణం ఉంది : ధనుష్
Actor Dhanush | తనకు భారతీయ జనతా పార్టీ (BJP) తెరవెనుక మద్దతు ఇస్తోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని తమిళ స్టార్ ధనుష్ (Actor Dhanush) కొట్టిపారేశారు. తనకు దైవాశీస్సులు, అభిమానులు, ప్రజల మద్దతు తప్ప ఏ పార్టీ మద్దతూ లేదని తేల్చిచెప్పారు.
Actor Dhanush | త్రినేత్ర న్యూస్ : తమిళ స్టార్ ధనుష్ (Actor Dhanush) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన ‘తమిళగ ఎళుచ్చి కళగం (Thamizhaga Ezhuchi Kazhagam) పేరుతో పార్టీ పేరును ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనకు భారతీయ జనతా పార్టీ (BJP) తెరవెనుక మద్దతు ఇస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ మద్దతు ప్రచారంపై ధనుష్ క్లారిటీ ఇచ్చారు. తనకు దైవాశీస్సులు, అభిమానులు, ప్రజల మద్దతు తప్ప ఏ పార్టీ మద్దతూ లేదని తేల్చిచెప్పారు.
తన తాజా చిత్రం ‘ఓం’ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. "నా గురించి అనేక వదంతులు ప్రచారంలో ఉన్నాయి. కొందరు నా వెనుక ఉన్నారని, మరికొందరు నాకు మద్దతు ఇస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నాకు ఏ వ్యక్తి లేదా సంస్థ ప్రత్యేకంగా మద్దతు ఇవ్వడం లేదు. నన్ను దేవుడు నడిపిస్తున్నాడు. నా వెనుక బలమైన అభిమాన గణం ఉంది. ప్రజలు నాకు మద్దతుగా ఉన్నారు. నాకు ఏ వ్యక్తి, సంస్థ మద్దతు ఇవ్వడం లేదు" అని ధనుష్ స్పష్టం చేశారు.
చెన్నైలో తన అభిమాన సంఘం మహిళా విభాగంతో (women functionaries) ధనుష్ గత నెల ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,000 నుంచి 5,000 మంది మహిళలు హాజరయ్యారు. వారందరితో ధనుష్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారితో ఫొటోలు కూడా దిగారు. దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకుని తన మహిళా అభిమానులకు వెండి దీపాలను ధనుష్ కానుకగా ఇచ్చారు. అయితే, ఆ దీపాలపై భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తు అయిన తామర పువ్వు (కమలం) ముద్ర ఉండటంతో ఆయనకు బీజేపీ మద్దతు ఉందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై ధనుష్ క్లారిటీ ఇచ్చారు.
Also Read..
రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు హ్యారీ బాక్సర్ అరెస్ట్
పండుగ వేళ ఎఫ్‌డీఏ కొరడా.. బ్లింకిట్, జెప్టో లైసెన్సులు రద్దు.. డీమార్ట్‌పై చర్యలు
ఈ 20 కాస్త 420గా మారింది.. కేంద్రంపై రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ramchander Rao | భారత్‌ను బంగ్లాదేశ్‌లా మార్చాలని చూస్తున్నారా..?
నవంబర్ 6, 2026

Amit Shah | వీధుల్లో కాదు.. పార్లమెంట్లో చర్చకు రండి : రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్
నవంబర్ 5, 2026

Kiren Rijiju | ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలంటే ముందు విదేశీ పర్యటనలు ఆపి.. ఈ 7 సూచనలు పాటించండి.. రాహుల్‌కు కేంద్ర మంత్రి చురకలు
నవంబర్ 5, 2026
తాజావార్తలు
- ●హైదరాబాద్‌లో రాహుల్ గ్లోబల్ స్కెచ్! భారత్ సమ్మిట్ వెనుక అసలు వ్యూహమేంటి?
- ●Foreign Investors | భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల వెల్లువ.. కారణాలేమిటి..?
- ●Diwali celebrations in Indiramma Houses | కోమల-సమ్మయ్య దంపతుల ఇందిరమ్మ ఇంట్లో దీపావళి జరుపుకున్నా.. చాలా సంతోషంగా ఉంది
- ●Surekha Vani | సురేఖా వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ - అడ్వాంటేజ్ తీసుకోవద్దంటూ వార్నింగ్
- ●Zomato | జొమాటో గుడ్ న్యూస్.. 40 కిలోమీటర్ల దూరం నుంచీ ఫుడ్ డెలివరీ..
- ●Harry Boxer | రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు హ్యారీ బాక్సర్ అరెస్ట్

హైదరాబాద్‌లో రాహుల్ గ్లోబల్ స్కెచ్! భారత్ సమ్మిట్ వెనుక అసలు వ్యూహమేంటి?

Foreign Investors | భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల వెల్లువ.. కారణాలేమిటి..?

Diwali celebrations in Indiramma Houses | కోమల-సమ్మయ్య దంపతుల ఇందిరమ్మ ఇంట్లో దీపావళి జరుపుకున్నా.. చాలా సంతోషంగా ఉంది

Surekha Vani | సురేఖా వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ - అడ్వాంటేజ్ తీసుకోవద్దంటూ వార్నింగ్



