త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kiren Rijiju | ఎన్నిక‌ల్లో ఎక్కువ సీట్లు గెల‌వాలంటే ముందు విదేశీ ప‌ర్య‌ట‌న‌లు ఆపి.. ఈ 7 సూచనలు పాటించండి.. రాహుల్‌కు కేంద్ర మంత్రి చుర‌క‌లు

Kiren Rijiju | రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై కేంద్ర పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు (Kiren Rijiju) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హ‌స్తం పార్టీ ఎన్నిక‌ల్లో ఎక్కువ సీట్లు సాధించేందుకు 7 సూచనలతో కూడిన సక్సెస్ మంత్రాన్ని రాహుల్‌కు కౌంట‌ర్‌గా అందించారు.

D

National | Published On Nov 5, 2026, 11.20 am IST

Kiren Rijiju | ఎన్నిక‌ల్లో ఎక్కువ సీట్లు గెల‌వాలంటే ముందు విదేశీ ప‌ర్య‌ట‌న‌లు ఆపి.. ఈ 7 సూచనలు పాటించండి.. రాహుల్‌కు కేంద్ర మంత్రి చుర‌క‌లు
Advertisement

Kiren Rijiju | త్రినేత్ర న్యూస్ : భారత ప్రయోజనాలను విదేశీ శక్తులకు మోదీ ఎలా తాకట్టు పెట్టారనే అంశంపై పార్లమెంట్‌లో బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాలంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స‌వాల్ విసిరిన విష‌యం తెలిసిందే. ఈ అంశంపై అధికార‌, విప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ప్ర‌ధాని మోదీ దేశ ద్రోహి అని, ఆయ‌న్ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ నియంత్రిస్తున్నార‌ని రాహుల్ ఆరోపించారు. పార్ల‌మెంటులో త‌న‌తో చ‌ర్చ‌కు వ‌స్తే ఈ విష‌యాల‌న్నింటినీ తాను కేవ‌లం 5 నిమిషాల్లోనే నిరూపించ‌గ‌ల‌న‌ని వ్యాఖ్యానించారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను ఎన్డీయే ప‌క్షాల నేత‌లు తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో రాహుల్ గాంధీపై కేంద్ర పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు (Kiren Rijiju) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హ‌స్తం పార్టీ ఎన్నిక‌ల్లో ఎక్కువ సీట్లు సాధించేందుకు 7 సూచనలతో కూడిన సక్సెస్ మంత్రాన్ని రాహుల్‌కు కౌంట‌ర్‌గా అందించారు. ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీ సీట్ల సంఖ్యను మెరుగుపరుచుకోవాలంటే.. రాహుల్ జీ ముందు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్ల‌డం మానుకుని దేశంలోనే ఎక్కువ స‌మ‌యం గ‌డ‌పాలంటూ హిత‌వు ప‌లికారు. అంతేకాదు భార‌త వ్య‌తిరేక శ‌క్తుల‌కు దూరంగా ఉండాలంటూ చుర‌క‌లంటించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, ప్రధాని మోదీపై ద్వేషాన్ని వీడాల‌ని, రాజ్యాంగాన్ని గౌర‌వించాల‌ని సూచించారు.

రాహుల్‌కు రిజుజు సూచించిన 7 సూత్రాలు ఇవే..

  • తరచూ రహస్య విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు (Secret foreign vacations) వెళ్ల‌డం మానుకుని భార‌త్‌లోనే ఎక్కువ స‌మ‌యం గ‌డపండి.
  • పెద్దలను గౌరవించండి. మన భారతీయ సంప్రదాయం ప్రకారం వారి నుంచి విలువైన జ్ఞానాన్ని పొందండి
  • భార‌త్‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించే వ్య‌క్తుల‌కు దూరంగా ఉండండి. వారి అజెండాల‌ను ప్ర‌చారం చేయ‌డం ఆపండి.
  • బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, ప్రధాని మోదీపై ద్వేషాన్ని వీడి.. బీజేపీని శ‌త్రువుగా కాకుండా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా చూడాలి.
  • పార్లమెంటును సీరియస్‌గా తీసుకోవాలి. స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతూ.. తోటి ఎంపీల‌ను చ‌ర్చ‌లు, సంభాష‌ణ‌ల్లో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్స‌హించాలి.
  • భారత రాజ్యాంగాన్ని, దేశంలోని అత్యున్నత రాజ్యాంగ సంస్థలను గౌరవించడం నేర్చుకోవాలి.
  • కుటుంబ రాజకీయాలకు ఇక‌నైనా స్వస్తి పలకాలి.. కాంగ్రెస్ పార్టీని ఒక ప్రజాస్వామ్య పార్టీగా పనిచేయనివ్వాలి.

Also Read..

ట్రంప్‌కు మిడ్‌ట‌ర్మ్ ఝ‌లక్‌.. భార‌త స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ..

మ‌ళ్లీ ఆస్ప‌త్రిలో చేరిన శ‌ర‌ద్ ప‌వార్

బేతుప‌ల్లి చెరువు.. మ‌త్స్య‌కారులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సుర‌క్షితం

Advertisement
Advertisement