Surekha Vani | సురేఖా వాణి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ – అడ్వాంటేజ్ తీసుకోవద్దంటూ వార్నింగ్
ఓ యువకుడితో టాలీవుడ్ నటి సురేఖావాణి సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అతడిని సురేఖావాణి పెళ్లిచేసుకోబోతున్నట్లు ప్రచారం మొదలైంది. ఈ వీడియోపై టాలీవుడ్ నటి క్లారిటీ ఇచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని చెప్పింది.
Entertainment | Published On Nov 7, 2026, 1.37 pm IST
Surekha Vani | టాలీవుడ్ నటి సురేఖా వాణి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. వ్యూస్, రీచ్ కోసం తన పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకుంటే ఊరుకోనంటూ వార్నింగ్ ఇచ్చింది. సురేఖవాణి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ యువకుడితో ఈ టాలీవుడ్ నటి చాలా సన్నిహితంగా కనిపిస్తోంది. ఇది డీప్‌ఫేక్ వీడియోనా? నిజమా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఆ యువకుడిని సురేఖావాణి పెళ్లిచేసుకోబోతుందంటూ ప్రచారం మొదలైంది.
అనుమతి లేకుండానే...
ఈ వీడియోపై సురేఖావాణి క్లారిటీ ఇచ్చింది. "నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. అనుమతి లేకుండానే నా వ్యక్తిగత కంటెంట్ లీక్ అయ్యింది. ఎవరైనా కంటెంట్‌ను షేర్ చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాను. వ్యూస్ రీచ్ కోసం నేను ఉన్న ఈ పరిస్థితిని అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని చూస్తే ఊరుకోను. నా వ్యక్తిగత ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నా" అంటూ సురేఖ వాణి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అంటూ పేర్కొన్నది. ఈ పోస్ట్‌తో లీక్‌డ్ వీడియోపై క్లారిటీ ఇచ్చింది.
సోషల్ మీడియా రూమర్లు...
గత కొంతకాలంగా సినిమాలతో కంటే సోషల్ మీడియాలో రూమర్లు, వివాదాలతోనే సురేఖా వాణి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. సినిమాలు తగ్గించింది. శీనుగాడు చిరంజీవి ఫ్యాన్ అనే మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో సురేఖావాణి కెరీర్ మొదలైంది. నాయక్, బాద్‌షా, శ్రీమంతుడు, పిల్లా నువ్వులేని జీవితంతో పాటు తెలుగులో వందకుపైగా సినిమాలు చేసింది. సురేఖావాణి బాటలోనే ఆమె కూతురు సుప్రీత కూడా అడుగులు వేసింది. ప్రస్తుతం హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేస్తోంది.
View this post on Instagram
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Zomato | జొమాటో గుడ్ న్యూస్.. 40 కిలోమీటర్ల దూరం నుంచీ ఫుడ్ డెలివరీ..
- ●Harry Boxer | రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు హ్యారీ బాక్సర్ అరెస్ట్
- ●Manne Krishank | కొండల్‌రెడ్డికి మెమరీ లాస్ ఉందట.. బ్యాంక్ లోన్ ఎగ్గొట్టడానికి ఓ హాస్పిటల్ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది
- ●Tamil Nadu | దీపావళికి ముందు చికెన్ ప్రియులకు షాక్.. అంతుచిక్కని వ్యాధితో 50వేల కోళ్లు మృతి..
- ●FDA | పండుగ వేళ ఎఫ్‌డీఏ కొరడా.. బ్లింకిట్, జెప్టో లైసెన్సులు రద్దు.. డీమార్ట్‌పై చర్యలు
- ●Rytu Bharosa to all | అటు కరువు సాయం..ఇటు రైతు భరోసా..హకీంపేట సభలో సీఎం అనౌన్సమెంట్?

Zomato | జొమాటో గుడ్ న్యూస్.. 40 కిలోమీటర్ల దూరం నుంచీ ఫుడ్ డెలివరీ..

Harry Boxer | రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు హ్యారీ బాక్సర్ అరెస్ట్

Manne Krishank | కొండల్‌రెడ్డికి మెమరీ లాస్ ఉందట.. బ్యాంక్ లోన్ ఎగ్గొట్టడానికి ఓ హాస్పిటల్ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది

Tamil Nadu | దీపావళికి ముందు చికెన్ ప్రియులకు షాక్.. అంతుచిక్కని వ్యాధితో 50వేల కోళ్లు మృతి..






