త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Diwali celebrations in Indiramma Houses | కోమల-సమ్మయ్య దంప‌తుల ఇందిర‌మ్మ‌ ఇంట్లో దీపావ‌ళి జ‌రుపుకున్నా.. చాలా సంతోషంగా ఉంది

Diwali celebrations in Indiramma Houses | సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ (Husnabad) పట్టణంలోని 12వ వార్డులో కోమల- సమ్మయ్య దంపతుల ఇందిరమ్మ ఇంట్లో (Indiramma Houses) ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి “మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” జ‌రుపుకున్న‌ట్లు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar)  తెలిపారు.

S

Telangana | Published On Nov 7, 2026, 1.51 pm IST

Diwali celebrations in Indiramma Houses | కోమల-సమ్మయ్య దంప‌తుల ఇందిర‌మ్మ‌ ఇంట్లో దీపావ‌ళి జ‌రుపుకున్నా.. చాలా సంతోషంగా ఉంది
Advertisement
  • బ‌ట్ట‌లు పెట్టి స్వీట్లు తినిపించాను
  • పేద కుటుంబాల క‌ల‌ను సాకారం చేస్తున్నం
  • మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ హ‌ర్షం

Diwali celebrations in Indiramma Houses | త్రినేత్ర న్యూస్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ (Husnabad) పట్టణంలోని 12వ వార్డులో కోమల- సమ్మయ్య దంపతుల ఇందిరమ్మ ఇంట్లో (Indiramma Houses) ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి “మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” జ‌రుపుకున్న‌ట్లు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar)  తెలిపారు. స్వీట్లు తినిపించి బ‌ట్ట‌లు కూడా పెట్టాన‌ని సంతోషం వ్యక్తం చేశారు. రేవంత్ హ‌యాంలోని ప్ర‌జా ప్ర‌భుత్వంలో పేదల సొంతింటి క‌ల‌ను సాకారం చేస్తున్నామ‌ని చెప్పారు. ఈమేరకు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా మాట్లాడారు.

2,500కు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి

దశాబ్ద కాలంగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాల కలను ప్రజా పాలన ప్రభుత్వంలోసాకారం చేస్తున్నాం. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి దశలో మంజూరైన 3,500 ఇందిరమ్మ ఇళ్లలో 2,500కు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. పదేళ్ల నిరీక్షణ తర్వాత సొంతింట్లో దీపావళి జరుపుకుంటున్న ప్రతి కుటుంబంలో ఆనందం చూడటం ఎంతో సంతోషంగా ఉంది. ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సందర్భంగా లబ్ధిదారు ఇంట్లో క్రాకర్స్ కాల్చి, బాణసంచా పేల్చి ఘనంగా దీపావళి వేడుకలు జరుపుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరికీ దీపావళి శుభాకాంక్షలు.

ఒకప్పుడు సొంతిల్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబం.. నేడు తమ సొంతింట్లో దీపాలు వెలిగిస్తూ దీపావళి పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషకరం. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఈ దీపావళి ప్రతి పేద కుటుంబం జీవితంలో కొత్త వెలుగులు నింపాలి. ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి. ఇది కేవలం ఇల్లు కాదు.. ఒక కుటుంబం ఎన్నో ఏళ్లుగా కన్న కలలకు సాకారం అని పొన్నం పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ కౌన్సిలర్ లు, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement