త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harry Boxer | రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు.. లారెన్స్​ బిష్ణోయ్ సన్నిహితుడు హ్యారీ బాక్సర్ అరెస్ట్

Harry Boxer | గ్యాంగ్‌స్టర్ (Gangster) లారెన్స్‌ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi)కు చెందిన కీల‌క ఆప‌రేటివ్‌, మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్ట‌ర్ల‌లో ( most-wanted gangsters) ఒక‌రైన హ్యారీ బాక్స‌ర్ (Harry Boxer) అమెరికాలో ప‌ట్టుబ‌డ్డారు. కాలిఫోర్నియాలో అత‌డిని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తాజాగా వెల్లడించాయి.

D

National | Published On Nov 7, 2026, 1.23 pm IST

Harry Boxer | రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు.. లారెన్స్​ బిష్ణోయ్ సన్నిహితుడు హ్యారీ బాక్సర్ అరెస్ట్
Advertisement

Harry Boxer | త్రినేత్ర న్యూస్ : గ్యాంగ్‌స్టర్ (Gangster) లారెన్స్‌ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi)కు చెందిన కీల‌క ఆప‌రేటివ్‌, మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్ట‌ర్ల‌లో ఒక‌రైన హ్యారీ బాక్స‌ర్ (Harry Boxer) అమెరికాలో ప‌ట్టుబ‌డ్డారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) ఇచ్చిన సమాచారంతో కాలిఫోర్నియాలో అత‌డిని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తాజాగా వెల్లడించాయి. విదేశాల్లో ఉంటూ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్ ఎక్స్‌టార్షన్ నెట్‌వ‌ర్క్‌ను నిర్వహించడంలో ఇత‌డు కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. అతడిని భారత్‌కు రప్పించేందుకు అవసరమైన న్యాయపరమైన ప్రక్రియను దర్యాప్తు సంస్థలు ప్రారంభించ‌నున్నాయి.

కాగా, ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టి ముంబై నివాసం వెలుప‌ల జ‌రిగిన కాల్పులు ఘ‌ట‌న‌కు బాక్స‌ర్ బాధ్య‌త వ‌హించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత సోష‌ల్ మీడియా పోస్టులు, ఆడియో సందేశాల ద్వారా ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు కూడా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఇత‌డిపై హ‌త్య‌, హ‌త్యాయ‌త్నం, దాడి, కాల్పులు, బెదిరింపుల ద్వారా వ‌సూళ్ల‌కు పాల్పడిన‌ట్లు అనేక క్రిమిన‌ల్ కేసులు న‌మోద‌య్యాయి.

ఎవరీ హ్యారీ బాక్సర్..?

హ్యారీ బాక్సర్ అస‌లు పేరు హ‌రిచంద్ జాట్ (Harichand Jat). ఇత‌డు రాజ‌స్థాన్‌లోని కోట్‌పుత్లీ-బేహ్రోర్ జిల్లా బామ్‌సుర్ ప్రాంతానికి చెందిన వాడు. జైపూర్‌లో ఉన్న స‌మ‌యంలో బాక్సింగ్ నేర్చుకుంటున్న స‌మ‌యంలో అత‌డికి హ్యారీ బాక్స‌ర్ అనే పేరు వ‌చ్చింది. నేర సామ్రాజ్యంలోకి రాక‌ముందు పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ, బాక్సింగ్‌ కోచ్‌గా కూడా ప‌నిచేశాడు. ఆ తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీల‌క‌ సభ్యుడిగా ఎదిగి.. విదేశాల నుంచి గ్యాంగ్ ఎక్స్‌టార్షన్ నెట్‌వర్క్‌ను విజయవంతంగా నడిపించాడు. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఇతనిపై అనేక క్రిమిన‌ల్‌ కేసులు ఉన్నాయి. వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడటం, హత్యలు, హత్యా ప్ర‌యత్నాలకు పాల్పడటంలో ఇతడు ఆరితేరాడు.

Also Read..

పండుగ‌ వేళ ఎఫ్‌డీఏ కొరడా.. బ్లింకిట్, జెప్టో లైసెన్సులు రద్దు.. డీమార్ట్‌పై చ‌ర్య‌లు

ఈ 20 కాస్త 420గా మారింది.. కేంద్రంపై రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం

నాపై ఏడుసార్లు హ‌త్యాప్ర‌య‌త్నం చేశారు.. అభిషేక్ బెన‌ర్జీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Advertisement
Advertisement