త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FDA | పండుగ‌ వేళ ఎఫ్‌డీఏ కొరడా.. బ్లింకిట్, జెప్టో లైసెన్సులు రద్దు.. డీమార్ట్‌పై చ‌ర్య‌లు

FDA | మ‌హారాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ (FDA) అధికారులు ప్ర‌త్యేక త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా నిబంధ‌న‌లు ఉల్లంఘించిన ప్రముఖ క్విక్-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లపై కొర‌డా ఝుళిపించారు. మొత్తం 105 ఫుడ్ బిజినెస్ లైసెన్సులను సస్పెండ్ చేయ‌డంతో పాటు 7 సంస్థలను పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు.

D

National | Published On Nov 7, 2026, 12.56 pm IST

FDA | పండుగ‌ వేళ ఎఫ్‌డీఏ కొరడా.. బ్లింకిట్, జెప్టో లైసెన్సులు రద్దు.. డీమార్ట్‌పై చ‌ర్య‌లు
Advertisement

FDA | త్రినేత్ర న్యూస్ : దీపావ‌ళి (Diwali) పండుగ వేళ మ‌హారాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ (FDA) అధికారులు ప్ర‌త్యేక త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా నిబంధ‌న‌లు ఉల్లంఘించిన ప్రముఖ క్విక్-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లపై కొర‌డా ఝుళిపించారు. నవంబర్ 4, 5 తేదీల్లో జరిగిన డ్రైవ్‌లో మొత్తం 105 ఫుడ్ బిజినెస్ లైసెన్సులను సస్పెండ్ చేయ‌డంతో పాటు 7 సంస్థలను పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు.

త‌నిఖీల్లో భాగంగా ముంబైలోని ప్రముఖ క్విక్-కామర్స్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లైన బ్లింకిట్ (Blinkit), జెప్టో (Zepto) లతో పాటు 'బిర్యానీ బై కిలో', 'టాసిన్ పిజ్జా', 'జంబో బర్గర్' వంటి ప్రముఖ ఫుడ్ అవుట్‌లెట్ల లైసెన్సులను ఎఫ్‌డీఏ సస్పెండ్ చేసింది. అత్యధికంగా నాసిక్ డివిజన్‌లో 39, ముంబైలో 28, పూణేలో 20, అమరావతిలో 15, ఛత్రపతి శంభాజీనగర్‌లో 2, థానేలో ఒక సంస్థ‌ లైసెన్స్‌ను ర‌ద్దు చేసింది. బోరివలిలోని 'రాజ్‌ధాని బిర్యానీ సెంటర్' ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిబంధనలను ఉల్లంఘించినందుకు పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది.

నాగ్‌పూర్‌లోని కామ్తీ రోడ్‌లో ఉన్న డీ-మార్ట్ (D-Mart) అవుట్‌లెట్‌పై కూడా అధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇందులో భాగంగానే లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు శుద్ధి చేసిన సోయాబీన్ నూనెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ పండుగ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా 69కి పైగా సంస్థల నుంచి రూ.1.35 కోట్లకు పైగా విలువైన సురక్షితం కాని లేదా కల్తీ ఆహార నిల్వలను సీజ్ చేశారు. వీటిలో పండుగ సమయంలో ఎక్కువగా వాడే కోవా, పనీర్, నెయ్యి, వంట నూనెలు, మిఠాయిలు, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వ్యాపారాలపై కఠిన చర్యలు ఉంటాయని ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే హెచ్చరించారు. ప్రాణాంతకమైన, సురక్షితం కాని ఆహారాన్ని విక్రయించడం ద్వారా ఎవరైనా మరణిస్తే.. చట్టప్రకారం జీవిత ఖైదు, రూ. 10 లక్షల వరకు జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.

Also Read..

ఈ 20 కాస్త 420గా మారింది.. కేంద్రంపై రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం

నాపై ఏడుసార్లు హ‌త్యాప్ర‌య‌త్నం చేశారు.. అభిషేక్ బెన‌ర్జీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

వైట్‌హౌస్‌లో దీపావ‌ళి వేడుక‌లు.. ట్రంప్‌కు గిఫ్ట్‌గా హ‌నుమాన్ చాలీసా

Advertisement
Advertisement