Bengal Signature Scandal | బెంగాల్‌లో ముదిరిన పొలిటికల్ క్రైసిస్: టీఎంసీలో ‘సంతకాల’ స్కామ్ కలకలం.. ఇద్దరు ఎమ్మెల్యేల బహిష్కరణ
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు! ఫోర్జరీ సంతకాల వ్యవహారాన్ని బయటపెట్టిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలపై పార్టీ బహిష్కరణ వేటు వేసింది. అసలేం జరిగింది?
- అసెంబ్లీలో ప్రతిపక్ష నేతకు మద్దతుగా ఇచ్చిన లేఖలో తమ సంతకాలను టీఎంసీ ఫోర్జరీ చేసిందని ఇద్దరు ఎమ్మెల్యేలు ఫిర్యాదు
- ఫిర్యాదు చేసిన రితబ్రత బెనర్జీ, సందీపన్ సాహాలపై టీఎంసీ 'పార్టీ వ్యతిరేక కార్యకలాపాల' కింద బహిష్కరణ వేటు
- టీఎంసీ అవినీతి సొంత ఎమ్మెల్యేలను కూడా వదల్లేదని బెంగాల్ సీఎం సువేందు అధికారి విమర్శ
- ఈ స్కామ్‌పై సీఐడీ విచారణ
- టీఎంసీ కీలక నేత అభిషేక్ బెనర్జీకి సైతం నోటీసులు జారీ
Bengal Signature Scandal | త్రినేత్ర.న్యూస్ : ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పశ్చిమ బెంగాల్ (West Bengal) మాజీ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో అంతర్గత సంక్షోభం తారాస్థాయికి చేరింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా శోభన్‌దేబ్ చటోపాధ్యాయను సమర్థిస్తూ ఇచ్చిన లేఖలో తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఫిర్యాదు చేసిన ఇద్దరు సొంత ఎమ్మెల్యేలపైనే టీఎంసీ బహిష్కరణ వేటు వేసింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి (Suvendu Adhikari) ఈ స్కామ్‌ను బయటపెట్టడంతో బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఎమ్మెల్యేలపై వేటు వేసిన టీఎంసీ
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీ, సందీపన్ సాహాలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు టీఎంసీ ప్రకటించింది. పార్టీ సమావేశాలకు డుమ్మా కొట్టడంతో పాటు, పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగించేలా వారు వ్యవహరించారని టీఎంసీ వైస్ ప్రెసిడెంట్ చంద్రమా భట్టాచార్య సంతకం చేసిన ఆ బహిష్కరణ లేఖలో పేర్కొన్నారు. "ఇది దారుణం. అసెంబ్లీ పవిత్రతను కాపాడాలి" అని బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం ఏమన్నారంటే
సీఎం సువేందు అధికారి ఈ వివాదంపై స్పందిస్తూ టీఎంసీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "టీఎంసీ అవినీతి కేవలం బెంగాల్ ప్రజలనే కాదు, ఆ పార్టీ సొంత ఎమ్మెల్యేలను కూడా వదల్లేదు. టీఎంసీ తమ ఎమ్మెల్యేల సంతకాలను సైతం దొంగిలించింది. రితబ్రత, సందీపన్ అనే ఇద్దరు ఎమ్మెల్యేలే స్వయంగా ఫిర్యాదు చేశారు. ఇందులో మా పాత్ర ఏమీ లేదు" అని సీఎం సువేందు మీడియాతో స్పష్టం చేశారు.
రంగంలోకి సీఐడీ.. అభిషేక్ బెనర్జీ చుట్టూ ఉచ్చు?
ప్రస్తుతం ఈ ఫోర్జరీ సంతకాల కుంభకోణంపై బెంగాల్ సీఐడీ (CID) దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో పలువురు టీఎంసీ నేతలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. టీఎంసీ కీలక నేత, పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీకి (Abhishek Banerjee) కూడా విచారణకు హాజరుకావాలని సీఐడీ నోటీసులు పంపినప్పటికీ, ఆయన విచారణకు వెళ్లలేదని సమాచారం.
ఈ మొత్తం వివాదానికి అభిషేక్ బెనర్జీనే బాధ్యుడని బహిష్కృత నేత సందీపన్ సాహా ఆరోపించారు. "ఎమ్మెల్యేల లిస్ట్‌పై జనరల్ సెక్రటరీగా ఆయన సంతకం చేశారు. అసలు ఆ లిస్ట్‌లోనే ఎన్నో తప్పులు ఉన్నాయి. అస్సలు లేని వ్యక్తుల సంతకాలను సబ్‌మిట్ చేయడం అతిపెద్ద బ్లండర్. తన బాధ్యతను ఆయన సరిగ్గా నిర్వర్తించలేదు" అని సాహా విమర్శించారు.
బెదిరిస్తున్నారన్న మమతా బెనర్జీ
అధికారం కోల్పోయిన తర్వాత టీఎంసీ తన నేతలను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతోంది. పలువురు నేతలు బహిరంగంగానే పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ పరిణామాలపై మాజీ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే టీఎంసీని చీల్చే ప్రయత్నం చేస్తోందని ఆమె మండిపడ్డారు. "మా పార్టీ మీటింగ్‌కి రాకుండా నా ఎమ్మెల్యేలను పోలీసుల ద్వారా ఫోన్ చేయించి బెదిరిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నలుగురు ఎమ్మెల్యేలు నాకు చెప్పారు" అని మమత ఆరోపించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ కొనాలంటే ఈ దేశమే బెస్ట్.. భారత్‌తో పోలిస్తే భారీ తేడా..
- ●సభలో కాంగ్రెస్ ఎత్తు.. బయట బీఆర్ఎస్ పైఎత్తు? ‘22ఏ’ చుట్టూ మారుతున్న పొలిటికల్ గేమ్!
- ●Gongidi Sunitha | ఇళ్లల్లో అక్కాచెల్లెళ్లు, అమ్మల ముందు బనియన్లు వేసుకోరా?
- ●BRICS Summit | పుతిన్, జిన్‌పింగ్ కార్లు ఎందుకంత స్పెషల్..? అణుబాంబు దాడులను తట్టుకుంటాయా?
- ●Deepika Padukone | దీపికా పడుకోణ్‌తో సినిమా - నా కెరీర్లో చేసిన పెద్ద తప్పు - బాలీవుడ్ హీరో కామెంట్స్
- ●Mercury Transit in Virgo | కన్యారాశిలో బుధుడి సంచారం.. భద్ర రాజయోగంతో ఈ మూడు రాశుల వారికి అదృష్టం!

iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ కొనాలంటే ఈ దేశమే బెస్ట్.. భారత్‌తో పోలిస్తే భారీ తేడా..

సభలో కాంగ్రెస్ ఎత్తు.. బయట బీఆర్ఎస్ పైఎత్తు? ‘22ఏ’ చుట్టూ మారుతున్న పొలిటికల్ గేమ్!

Gongidi Sunitha | ఇళ్లల్లో అక్కాచెల్లెళ్లు, అమ్మల ముందు బనియన్లు వేసుకోరా?

BRICS Summit | పుతిన్, జిన్‌పింగ్ కార్లు ఎందుకంత స్పెషల్..? అణుబాంబు దాడులను తట్టుకుంటాయా?






