Halisahar | మమతా బెనర్జీ కాన్వాయ్‌పై రాళ్ల దాడి
Halisahar | పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాన్వాయ్‌పై ఆదివారం దాడి జరిగింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హాలిషహర్‌లో ఆందోళనకారులు ఆమె కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా రాళ్లు, వాటర్ బాటిళ్లు, చెప్పులు వాహనంపైకి విసిరారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
- హాలిషహర్‌లో దీదీని అడ్డుకున్న ఆందోళనకారులు..
- వాటర్ బాటిళ్లు, చెప్పులు విసిరడంతో ఉద్రిక్త పరిస్థితులు
Halisahar | పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాన్వాయ్‌పై ఆదివారం దాడి జరిగింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హాలిషహర్‌లో ఆందోళనకారులు ఆమె కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా రాళ్లు, వాటర్ బాటిళ్లు, చెప్పులు వాహనంపైకి విసిరారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త బిర్జు కియోట్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు మమతా బెనర్జీ బయలుదేరారు. ఆమె వాహనాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల కస్టడీలోనే బిర్జు మృతి చెందాడంటూ నినదించారు.
పోలీసుల సమక్షంలోనే దాడి జరిగిందన్న దీదీ
దాడి ఘటనపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. తన కారుపై పెద్ద రాళ్లు విసిరారని ఆమె ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారన్నారు. ‘‘కారు అద్దం తెరిచి ఉంటే మా తలలు పగిలిపోయేవి. ప్రాణాలు కూడా పోయి ఉండేవి. అదృష్టవశాత్తూ మేం సురక్షితంగా బయటపడ్డాం’’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగిందని ఆరోపించిన ఆమె.. ‘‘ఇలాంటి ఘటనను గతంలో ఎప్పుడూ చూడలేదు. ఏం జరుగుతోంది? పోలీసులు బీజేపీకి భద్రత కల్పిస్తున్నారా?’’ అని ప్రశ్నించారు. మమతా బెనర్జీ కాన్వాయ్‌పై జరిగిన దాడిని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘సువేందు అధికారి పోలీస్ శాఖను నాశనం చేశారు’’ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
అనుమానాస్పద స్థితిలో టీఎంసీ కార్యకర్త మృతి
తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త, మాజీ కౌన్సిలర్ భర్త అయిన బిర్జు కియోట్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆయన మృతిపై కుటుంబీకులు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం రాత్రి పోలీసులు బిర్జును అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసు కస్టడీలో ఆయనను తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. మరుసటి రోజు పోలీసు లాకప్‌లో అపస్మారక స్థితిలో కనిపించారని పేర్కొన్నారు. రాత్రి సమయంలో తన భర్తను కలిసినప్పుడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని బిర్జు భార్య తెలిపారు. అలాంటప్పుడు ఉదయం ఆయన మృతి చెందినట్లు సమాచారం ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు. పోలీసు కస్టడీలోనే తన భర్తపై దాడి జరిగిందని ఆరోపించారు. తన భర్త మృతదేహంపై తీవ్ర గాయాలు, రక్తపు మరకలు కనిపించాయని ఆమె పేర్కొన్నారు. చేతులు, కాళ్లు తాడుతో కట్టి కొట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయని ఆరోపించారు. ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
#WATCH | Barrackpore: Former West Bengal Chief Minister Mamata Banerjee says, "Large stones were hurled at my car by anti-social elements,right in front of the police. The attack on the vehicle was so severe that if the windows had been open, my head would have been split open.… pic.twitter.com/PIdFM1Oxcr
— ANI (@ANI) August 9, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Aviation | ఎయిర్ ఇండియా పైలట్‌కు ‘డోప్’ టెస్ట్‌లో పాజిటివ్?
- ●Medico Priyanka | మెడికో ప్రియాంకది హిట్ అండ్ రన్ కాదు.. ఆమెపై హత్యాయత్నం జరిగింది
- ●Varun Batchigari | అమెరికాలో ప్రియురాలిని చంపి భారత్‌కు పారిపోతుండగా.. జర్మనీలో దొరికిపోయిన ఇండియన్ స్టూడెంట్!
- ●Anasuya | గుమ్మడి కాయ దొంగ అంటూ అనసూయ పోస్ట్ - ఆ హీరోకు కౌంటర్ అంటోన్న నెటిజన్లు
- ●August 15 | నిఘానీడలో ఎర్రకోట.. పంద్రాగస్టుకు కట్టుదిట్టబమైన భద్రత
- ●Harish Rao | నిరుపేదలను డాక్టర్లను చేసే బాధ్యత నాదే.. పట్టుదలతో చదివి గొప్ప ఆఫీసర్లుగా ఎదగండి

Aviation | ఎయిర్ ఇండియా పైలట్‌కు ‘డోప్’ టెస్ట్‌లో పాజిటివ్?

Medico Priyanka | మెడికో ప్రియాంకది హిట్ అండ్ రన్ కాదు.. ఆమెపై హత్యాయత్నం జరిగింది

Varun Batchigari | అమెరికాలో ప్రియురాలిని చంపి భారత్‌కు పారిపోతుండగా.. జర్మనీలో దొరికిపోయిన ఇండియన్ స్టూడెంట్!

Anasuya | గుమ్మడి కాయ దొంగ అంటూ అనసూయ పోస్ట్ - ఆ హీరోకు కౌంటర్ అంటోన్న నెటిజన్లు




