Mamata Banerjee | సువేందు చేతిలో ఓటమి.. భవానీపూర్ ఫలితాలపై హైకోర్టును ఆశ్రయించిన మమతా బెనర్జీ
Mamata Banerjee | భవానీపూర్ నియోజకవర్గంలో (Bhabanipur assembly seat) సువేందు అధికారి (Suvendu Adhikari) చేతిలో ఓడిపోవడాన్ని మమతా బెనర్జీ (Mamata Banerjee) అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తన ఓటమిని కలకత్తా హైకోర్టులో (Calcutta High Court) సవాల్ చేశారు.
Mamata Banerjee | తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో (TMC) సంక్షోభం తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే టీఎంసీ రెండుగా చీలిపోయింది. ఇక తాను పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గంలో (Bhabanipur assembly seat) సువేందు అధికారి (Suvendu Adhikari) చేతిలో ఓడిపోవడాన్ని మమతా బెనర్జీ (Mamata Banerjee) అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో తన ఓటమిని కలకత్తా హైకోర్టులో (Calcutta High Court) సవాల్ చేశారు. భవానీపూర్ ఫలితాన్ని సవాల్ చేస్తూ మమతా బెనర్జీ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర ఓటమి చవిచూసిన తర్వాత దీదీ హైకోర్టును ఆశ్రయించడం ఇది రెండోసారి.
కాగా, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దీదీ పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఆమె 15,105 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో బెంగాల్ రాష్ట్రంలో తొలిసారి అధికారం చేపట్టింది. ఎన్నికల్లో మమతను ఓడించిన సువేందు అధికారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Also Read..
దొంగ, దొంగ అంటూ.. మరో టీఎంసీ నేతపై కోడిగుడ్లతో దాడి.. వీడియో వైరల్
'వరి' వద్దంటున్నారు.. మరి 'ఆరుతడి' పంటలేవి..? ఏ పంటకు ఎన్ని నీళ్లు అవసరమో తెలుసా..?
తాజావార్తలు
- ●iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ కొనాలంటే ఈ దేశమే బెస్ట్.. భారత్తో పోలిస్తే భారీ తేడా..
- ●సభలో కాంగ్రెస్ ఎత్తు.. బయట బీఆర్ఎస్ పైఎత్తు? ‘22ఏ’ చుట్టూ మారుతున్న పొలిటికల్ గేమ్!
- ●Gongidi Sunitha | ఇళ్లల్లో అక్కాచెల్లెళ్లు, అమ్మల ముందు బనియన్లు వేసుకోరా?
- ●BRICS Summit | పుతిన్, జిన్పింగ్ కార్లు ఎందుకంత స్పెషల్..? అణుబాంబు దాడులను తట్టుకుంటాయా?
- ●Deepika Padukone | దీపికా పడుకోణ్తో సినిమా - నా కెరీర్లో చేసిన పెద్ద తప్పు - బాలీవుడ్ హీరో కామెంట్స్
- ●Mercury Transit in Virgo | కన్యారాశిలో బుధుడి సంచారం.. భద్ర రాజయోగంతో ఈ మూడు రాశుల వారికి అదృష్టం!

iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ కొనాలంటే ఈ దేశమే బెస్ట్.. భారత్తో పోలిస్తే భారీ తేడా..

సభలో కాంగ్రెస్ ఎత్తు.. బయట బీఆర్ఎస్ పైఎత్తు? ‘22ఏ’ చుట్టూ మారుతున్న పొలిటికల్ గేమ్!

Gongidi Sunitha | ఇళ్లల్లో అక్కాచెల్లెళ్లు, అమ్మల ముందు బనియన్లు వేసుకోరా?

BRICS Summit | పుతిన్, జిన్పింగ్ కార్లు ఎందుకంత స్పెషల్..? అణుబాంబు దాడులను తట్టుకుంటాయా?






