Tollywood | ఆడవాళ్లను డామినేట్ చేసే సినిమా కాదు – మగాళ్లు జిందాబాద్ టైటిల్‌పై హీరో కామెంట్స్
మరో వెరైటీ టైటిల్‌తో హీరో నందు సినిమా చేయబోతున్నాడు. అతడి కొత్త మూవీకి మగాళ్లు జిందాబాద్ అనే పేరును ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. వెన్నెలకిషోర్, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి శిష్యుడు నార ప్రవీణ్ దర్శకత్వం వహించబోతున్నాడు.
Entertainment | Published On Sep 18, 2026, 2.56 pm IST
Tollywood | సైక్ సిద్ధార్థ్, అగ్లీ స్టోరీ తర్వాత మరో వైరెటీ టైటిల్‌తో హీరో నందు సినిమా చేయబోతున్నారు. అతడి కొత్త మూవీకి మగాళ్లు జిందాబాద్ అనే పేరును ఫిక్స్ చేశారు. వెన్నెలకిషోర్, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాలో లక్ష్మీదుర్గ హీరోయిన్‌గా నటిస్తోంది. అనిల్ రావిపూడి శిష్యుడు నారా ప్రవీణ్ మగాళ్లు జిందాబాద్ మూవీతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మగాళ్ల బాధలు...కష్టాలు...
టైటిల్ గురించి హీరో నందు మాట్లాడుతూ "ఆడవాళ్లను డామినేట్ చేయడానికి ఈ టైటిల్ పెట్టలేదు. మగవాళ్ళ బాధలు, కష్టాలు చెప్పుకోవడానికి చాలామంది ఆలోచిస్తారు. అలాంటి వారిపై సెటైరికల్ కామెడీగా ఈ సినిమా చేస్తోన్నం. ఇందులో ఎలాంటి వివాదాలు ఉండవు. ఆడవాళ్లను తక్కువ చేసి చూపించడం లేదు. నిజ జీవితంలో మగవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆద్యంతం వినోదాత్మకంగా దర్శకుడు ఈ సినిమాలో చూపించారు.సైక్ సిద్ధార్థ్, అగ్లీ స్టోరీ సినిమాలను ఫ్యామిలీ ఆడియెన్స్ చూడలేకపోయారు. కుటుంబ ప్రేక్షకులను టార్గెట్‌గా పెట్టుకొని ఈ సినిమా చేశాం" అని అన్నారు. సమాజంలో ఆడవాళ్లకు కి దక్కే కంఫర్ట్ , న్యాయం , సింపథీ మగాడికి దక్కట్లేదు అనే టాపిక్ ను వ్యంగ్యంగా ఆవిష్కరిస్తూ ఔట్ అండ్ ఔట్ కామెడీగా ఈ సినిమా సాగుతుందని దర్శకుడు అన్నారు.
ఇరవై ఏళ్ల ప్రయాణం...
నందు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇరవై ఏళ్లు దాటిపోయింది.2006లో రిలీజైన ఫొటో మూవీతో హీరోగా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. పాఠశాల, ఐస్‌క్రీమ్ 2, సవారీ, 365 డేస్‌తో పాటు పలు చిన్న సినిమాల్లో హీరోగా నటించాడు. పెళ్లిచూపులు, దండోరా, సమ్మోహనం, జయజానకినాయకతో పాటు పలు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Trisha | చెన్నై క్వీన్ డబుల్ ధమాకా – సంక్రాంతి బరిలో త్రిష రెండు సినిమాలు
సెప్టెంబర్ 18, 2026

Meghamsh Srihari | మిస్టరీ డెత్ కేసుతో శ్రీహరి కొడుకు మూవీ – ట్రెండింగ్‌లో ఆస్మాన్ టీజర్
సెప్టెంబర్ 17, 2026

Payal Rajput | బోల్డ్ ఫొటోలతో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ రచ్చ – అవకాశాల కోసమేనా?
సెప్టెంబర్ 17, 2026
తాజావార్తలు
- ●TMC | ఫుట్‌బాల్ Vs ఎన్వలప్.. తృణమూల్ కాంగ్రెస్‌కు కొత్త పేరు, గుర్తు
- ●Harish Rao | భయపడుకుంటూ రాకండి.. నేన్ ఇక్కడే ఉన్నా.. దగ్గరుండి మీకు అన్నీ చూపిస్తా
- ●MLA Manohar Reddy | మిషన్ భగీరథ నీళ్లే మాకు దిక్కు
- ●iPhone 18 Pro | ఐఫోన్ 18 ఫోన్ల కోసం భారత్‌లో భారీ క్రేజ్.. ఢిల్లీలో యాపిల్ ప్రేమికుల బారులు..
- ●Ramchandar Rao | మీరు రాజకీయాల్లోకి రాకముందు ఆస్తులెన్నో ప్రజలకు చెప్పాలి
- ●Priya Bhavani Shankar | ఇరుముడి హీరోయిన్‌కు లక్కీ ఛాన్స్ - నాని, నితిన్ సినిమాలో రుక్మిణిగా?

TMC | ఫుట్‌బాల్ Vs ఎన్వలప్.. తృణమూల్ కాంగ్రెస్‌కు కొత్త పేరు, గుర్తు

Harish Rao | భయపడుకుంటూ రాకండి.. నేన్ ఇక్కడే ఉన్నా.. దగ్గరుండి మీకు అన్నీ చూపిస్తా

MLA Manohar Reddy | మిషన్ భగీరథ నీళ్లే మాకు దిక్కు

iPhone 18 Pro | ఐఫోన్ 18 ఫోన్ల కోసం భారత్‌లో భారీ క్రేజ్.. ఢిల్లీలో యాపిల్ ప్రేమికుల బారులు..



