త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Brahmotsavam | కల్పవృక్ష వాహనంపై ద‌ర్శ‌న‌మిచ్చిన మ‌ల‌య‌ప్ప‌.. ప‌ర‌వ‌రించిన భ‌క్త‌జ‌నం..!

Brahmotsavam | తిరుమ‌ల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

P

Devotional | Published On Sep 18, 2026, 3.32 pm IST

Brahmotsavam | కల్పవృక్ష వాహనంపై ద‌ర్శ‌న‌మిచ్చిన మ‌ల‌య‌ప్ప‌.. ప‌ర‌వ‌రించిన భ‌క్త‌జ‌నం..!
Advertisement

Brahmotsavam | తిరుమ‌ల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో నిర్వహించిన ఈ వాహనసేవను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు పరవశించారు.

భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షం

క్షీరసాగర మథన సమయంలో ఆవిర్భవించిన దివ్య సంపదల్లో కల్పవృక్షానికి ప్రత్యేక స్థానం ఉంది. కోరిన కోరికలను నెరవేర్చే దివ్య వృక్షంగా పురాణాల్లో కల్పవృక్షాన్ని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించిన శ్రీనివాసుడు భక్తుల సర్వాభీష్టాలను నెరవేర్చే దివ్య స్వరూపంలో దర్శనమిచ్చారు. గోవుల గోపన్న అలంకారంలో స్వామివారు కల్పవృక్ష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతుండగా భక్తులు గోవింద నామస్మరణతో మార్మోగించారు. వాహనసేవ సాగిన మార్గంలో భక్తులు పెద్ద ఎత్తున నిలబడి స్వామివారి దర్శనం కోసం వేచి చూశారు. భక్తుల గోవింద నామస్మరణలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో తిరుమలలో భక్తిభావం వెల్లివిరిసింది.

కల్పవృక్ష వాహనసేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి పాల్గొన్నారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు వాహనసేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ నిర్వహిస్తున్న వాహనసేవలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. స్వామివారి వివిధ వాహనాలపై వివిధ అలంకారాల్లో ద‌ర్శ‌న‌మిస్తున్న స్వామివారిని ద‌ర్శించుకునేందుకు పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు తిరుమ‌ల‌కు త‌ర‌లివ‌స్తున్నారు.

Advertisement
Advertisement