త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rawat | ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్‌కు షాక్‌.. ప‌ద‌వుల నుంచి త‌ప్పుకున్న మాజీ సీఎం

Harish Rawat | ఉత్తరాఖండ్ (Uttarakhand) అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ (Congress) సీనియర్‌ నేత హరీశ్‌ రావత్ (Harish Rawat) పార్టీ ప‌ద‌వుల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

G

National | Published On Sep 12, 2026, 10.11 am IST

Harish Rawat | ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్‌కు షాక్‌.. ప‌ద‌వుల నుంచి త‌ప్పుకున్న మాజీ సీఎం
Advertisement

Harish Rawat | త్రినేత్ర‌.న్యూస్‌: ఉత్తరాఖండ్ (Uttarakhand) అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ (Congress) సీనియర్‌ నేత హరీశ్‌ రావత్ (Harish Rawat) పార్టీ ప‌ద‌వుల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌న మాజీ స‌హాయ‌కుడు, ప్ర‌స్తుతం పీఏగా (PA) ప‌నిచేస్తున్న చంద‌న్ సింగ్ జీనా (Chandan Singh Jeena) నివాసంతోపాటు ప‌లు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ED) సోదాలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అవినీతిపై కాంగ్రెస్‌ చేస్తున్న పోరాటాన్ని బలహీనపరచకూడదనే ఉద్దేశంతోనే ప‌ద‌వుల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు (Resignation) ఫేస్‌బుక్ పోస్టు ద్వారా వెల్ల‌డించారు.

2026లో జ‌రిగిన గ్రామ పంచాయ‌తీ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్ (VDO) ప‌రీక్ష‌లో అక్ర‌మాల‌కు సంబంధించిన మ‌నీలాండ‌రింగ్ కేసు ద‌ర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఉత్త‌రాఖండ్‌లోని డెహ్రాడూన్ స‌హా ప‌లు ప్రాంతాల్లో సోదాలు నిర్వ‌హించారు. అందులో రావ‌త్‌ మాజీ ఓఎస్డీ, సన్నిహితుడు చంద‌న్ సింగ్‌ జీనా నివాసం కూడా ఉంది. ఈ సంద‌ర్భంగా ఇంట్లో లెక్క‌ల్లో చూప‌ని రూ.32 ల‌క్ష‌ల నగదు, సుమారు 200.5 గ్రాముల‌ బంగారం, 12 స‌గ్జ‌రీ గ‌డియారాల‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ వ్యవహారంలో వాస్తవాలు దర్యాప్తులో తేలుతాయని రావ‌త్ వెల్ల‌డించారు. జీనా సౌమ్యుడు, కష్టపడి పనిచేసే వ్యక్తి అని పేర్కొంటూనే.. గ్రామీణాభివృద్ధి అధికారుల నియామకంలో ఓఎంఆర్‌ షీట్లతో అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు బయటపడితే తాను చేసేదేమీ లేదన్నారు. అయితే ప్రస్తుత ఆరోపణలను తాను నమ్మడం లేదని స్పష్టం చేశారు. నియామక పరీక్షల్లో అక్రమాలు అంటే యువత భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని వెల్ల‌డించారు.

ఎన్నిక‌ల ముందు రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని ప్ర‌భావితం చేయ‌డానికి కొత్త క‌థ‌నాన్ని సృష్టించే ప్ర‌య‌త్నం జరుగుతున్న‌ద‌ని ఆయ‌న ఆరోపించారు. త‌న కార‌ణంగా కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిష్ట‌కు, అవినీతికి వ్య‌తిరేకంగా పార్టీ చేస్తున్న పోరాటానికి ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌ని భావిస్తున్నాని, అందువ‌ల్ల రాష్ట్ర కాంగ్రెస్ కార్య‌వ‌ర్గం, కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ (CWC)లో త‌న ప‌ద‌వుల నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని తెలిపారు.

Advertisement
Advertisement