త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Manohar Reddy | మిష‌న్ భ‌గీర‌థ నీళ్లే మాకు దిక్కు

MLA Manohar Reddy | తాండూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని గ్రామాల్లో తాగునీటి కొర‌త తీవ్రంగా ఉంద‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే మ‌నోహ‌ర్ రెడ్డి తెలిపారు. మిష‌న్ భ‌గీర‌థ నీళ్లే మాకు దిక్కు.. ప్ర‌స్తుతం అవి కూడా రావ‌డం లేద‌ని శాస‌న‌స‌భ‌లో ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

S

Telangana | Published On Sep 18, 2026, 2.42 pm IST

MLA Manohar Reddy | మిష‌న్ భ‌గీర‌థ నీళ్లే మాకు దిక్కు
Advertisement

శాస‌న‌స‌భ‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆవేద‌న‌

MLA Manohar Reddy | త్రినేత్ర‌.న్యూస్ : తాండూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని గ్రామాల్లో తాగునీటి కొర‌త తీవ్రంగా ఉంద‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే మ‌నోహ‌ర్ రెడ్డి తెలిపారు. మిష‌న్ భ‌గీర‌థ నీళ్లే మాకు దిక్కు.. ప్ర‌స్తుతం అవి కూడా రావ‌డం లేద‌ని శాస‌న‌స‌భ‌లో ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జీరో అవ‌ర్ సంద‌ర్భంగా మ‌నోహ‌న్ రెడ్డి తాగునీటి ఎద్ద‌డిపై స‌భ‌లో లేవ‌నెత్తారు.

మా తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో మిష‌న్ భగీర‌థ నీరు రాక‌పోవ‌డం, గ‌తంలో ఉన్న బోర్ల‌న్నీ డ్రై కావ‌డంతో గ్రామాల్లో నీటి స‌మ‌స్య తీవ్రంగా ఉంది. ఏ గ్రామంలో కూడా మిష‌న్ భ‌గీర‌థ నీళ్లు రావ‌డం లేదు. తాండూరు ప‌ట్ట‌ణంలో మిష‌న్ భ‌గీర‌థ నుంచి రోజూ 14 ఎంఎల్‌డీ రావాలి. ప్ర‌స్తుతం 10 ఎంఎల్‌డీ కూడా అక్క‌డ రావ‌డం లేదు. ప్ర‌తి గ్రామంలో కూడా అదే ప‌రిస్థితి ఉంది. నీళ్ల కొర‌త తీవ్రంగా వేధిస్తుంది. మిష‌న్ భ‌గీర‌థ‌ను న‌మ్ముకుంటే త‌ప్ప‌.. ఊర్ల‌లో నీళ్లు తాగే ప‌రిస్థితి లేదు. తాండూరు క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దుల్లో ఉంది. మూడు నాలుగు రోజుల‌కు కూడా మిష‌న్ భ‌గీర‌థ నీళ్లు రావ‌డం లేదు.. వాట‌ర్ స‌ర‌ఫ‌రాకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రిని కోరుతున్నాన‌ని మ‌నోహ‌ర్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement