త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Surat Man | రూ.10 వేలు విత్‌డ్రా ఫెయిల్‌.. 9 ఏళ్ల త‌ర్వాత బ్యాంకు నుంచి రూ.3 ల‌క్ష‌లు వ‌సూలు చేసిన క‌స్ట‌మ‌ర్‌

Surat Man | గుజ‌రాత్‌ సూర‌త్‌కు చెందిన ఓ వ్య‌క్తి (Surat Man) తొమ్మిదేళ్ల క్రితం ఏటీఎమ్ (ATM) నుంచి రూ.10 వేలు విత్ డ్రా (Rs 10,000 Withdraw) చేశాడు. ఆ విత్‌డ్రా ఫెయిల్ అయ్యింది. బ్యాంకును సంప్ర‌దించ‌గా.. ఎలాంటి స్పంద‌నా లేదు. దీంతో అత‌డు న్యాయ‌పోరాటానికి దిగాడు. చివ‌రికి తొమ్మిదేళ్ల పోరాటం త‌ర్వాత అత‌డు కోల్పోయిన రూ.10 వేల‌కు 30 రెట్లు ఎక్కువ‌గా బ్యాంకు నుంచి వ‌సూలు చేశాడు.

D

National | Published On Mar 20, 2026, 12.43 pm IST

Surat Man | రూ.10 వేలు విత్‌డ్రా ఫెయిల్‌.. 9 ఏళ్ల త‌ర్వాత బ్యాంకు నుంచి రూ.3 ల‌క్ష‌లు వ‌సూలు చేసిన క‌స్ట‌మ‌ర్‌
Advertisement

Surat Man | గుజ‌రాత్‌ సూర‌త్‌కు చెందిన ఓ వ్య‌క్తి (Surat Man) తొమ్మిదేళ్ల క్రితం ఏటీఎమ్ (ATM) నుంచి రూ.10 వేలు విత్ డ్రా (Rs 10,000 Withdraw) చేశాడు. అయితే, ఆ విత్‌డ్రా ఫెయిల్ అయ్యింది. దీంతో కంగారుప‌డిన స‌ద‌రు వ్య‌క్తి బ్యాంకును సంప్ర‌దించ‌గా.. ఎలాంటి స్పంద‌నా లేదు. దీంతో అత‌డు న్యాయ‌పోరాటానికి దిగాడు. చివ‌రికి తొమ్మిదేళ్ల పోరాటం త‌ర్వాత అత‌డు కోల్పోయిన రూ.10 వేల‌కు 30 రెట్లు ఎక్కువ‌గా బ్యాంకు నుంచి వ‌సూలు చేశాడు.

వివ‌రాల్లోకి వెళితే.. ఓ వ్య‌క్తి 2017, ఫ్రిబ‌వ‌రి 18న సూర‌త్‌లోని ఉద్నా ప్రాంతంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎమ్‌కు వెళ్లాడు. అక్క‌డ ఏటీఎమ్ నుంచి రూ.10 వేలు విత్‌డ్రా చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. కార్డు పెట్టి పిన్ ఎంట‌ర్ చేశాడు. కానీ న‌గ‌దు రాలేదు. కాసేప‌టికి డ‌బ్బులు క‌ట్ అయిన‌ట్లు అత‌డి ఫోన్‌కు మాత్రం మెసేజ్ వ‌చ్చింది. దీంతో అత‌డు ఒక్క‌సారిగా షాక‌య్యాడు. ఫిబ్ర‌వ‌రి 21న దుంభాల్ ప్రాంతంలోని బ్యాంక్ ఆఫ్ బ‌రోడా బ్రాంచ్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఆ త‌ర్వాత కూడా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల్సిందిగా బ్యాంకుకు చాలా మెయిల్స్ పెట్టాడు.

అయితే, బ్యాంకు నుంచి అత‌డికి ఎలాంటి స్పంద‌నా రాలేదు. దీంతో అత‌డు ఆర్బీఐని ఆశ్ర‌యించాడు. ప‌రిస్థితిని వివ‌రిస్తూ.. ఏటీఎమ్ సెంట‌ర్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ని కూడా ప‌రిశీలించాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడు. అత‌డి అభ్య‌ర్థ‌న‌ను అధికారులు ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. చివ‌రికి అత‌డు 2017 డిసెంబ‌ర్ 20న వినియోగ‌దారుల ఫోర‌మ్‌ (consumer forum)ను ఆశ్ర‌యించాడు. విచార‌ణ సంద‌ర్భంగా ఏటీఎమ్ ఎస్‌బీఐ బ్యాంక్‌కు చెందిన‌ద‌ని బ్యాంక్ ఆఫ్ బ‌రోడా (Bank of Baroda) వాదించింది. ట్రాన్జాక్ష‌న్ స‌క్సెస్ అని చూపించింద‌ని.. అలాంట‌ప్పుడు అది ఎస్‌బీఐ బ్యాంకుదే బాధ్య‌త అని కోర్టుకు తెలిపింది. అయితే, బీవోబీ వాద‌న‌ను వినియోగ‌దారుల ఫోర‌మ్ తోసిపుచ్చింది. లావాదేవీకి సంబంధించి బ్యాంకు ఆధారాల‌ను చూపించాల‌ని పేర్కొంది. అంతేకాదు, ఆర్బీఐ రూల్స్ ప్ర‌కారం.. ఆ మొత్తాన్ని ఐదు రోజుల్లోగా రీఫండ్ చేయాల్సి ఉండ‌గా.. బ్యాంకు అలా చేయ‌డంలో విఫ‌ల‌మైంద‌ని క‌మిష‌న్ గుర్తించింది.

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాపై వినియోగ‌దారుల ఫోర‌మ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు బ్యాంకుకు భారీ ఫైన్ వేసింది. క‌స్ట‌మ‌ర్‌కు చెందిన రూ.10వేల అమౌంట్‌పై 9శాతం వ‌డ్డీతో స‌హా చెల్లించాల‌ని ఆదేశించింది. న‌గ‌దు చెల్లింపులో ఆల‌స్య‌మైనందుకుగానూ.. రోజుకు రూ.100 చొప్పున ఫైన్ కూడా వేసింది. దీంతోపాటూ డ‌బ్బు పోగొట్టుకుని అత‌డు ప‌డ్డ మాన‌సిక వేద‌న‌కు రూ.3,000, న్యాయ‌ప‌ర‌మైన ఖ‌ర్చుల కోసం మ‌రో రూ.2,000 చెల్లించాల‌ని బ్యాంకును ఆదేశించింది. ఇక క‌స్ట‌మ‌ర్ త‌న డ‌బ్బును కోల్పోయి 2026, ఫిబ్ర‌వ‌రి 26 నాటికి 3288 రోజులు కావ‌డంతో.. ఈ ప‌రిహారం మొత్తం రూ.3 ల‌క్ష‌లు దాటింది. క‌స్ట‌మ‌ర్‌కు వ‌డ్డీ, అస‌లు, ఇత‌ర ఛార్జీలు క‌లిపి మొత్తం రూ. 3,28,800 చెల్లించాల్సి ఉంటుంది.

Also Read..

గోదావ‌రి పుష్క‌రాలు.. బ‌డ్జెట్‌లో రూ.500కోట్లు కేటాయించిన తెలంగాణ స‌ర్కార్‌..!

ఆరు గ్యారంటీల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాలంటూ గ‌న్‌పార్క్ వ‌ద్ద బీఆర్ఎస్ నిర‌స‌న‌

తెలంగాణ బడ్జెట్ 2026-27 హైలైట్స్: రూ. 3.24 లక్షల కోట్లతో భారీ బడ్జెట్.. విద్య, వ్యవసాయానికి పెద్దపీట!

Advertisement

తాజావార్తలు

Advertisement