HDFC Bank | ఖాతాదారులకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ.. ఇక యూపీఐ నగదు విత్‌డ్రాయల్స్ కూడా ఆ పరిమితిలోకే..
HDFC Bank | ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ తన వినియోగదారులకు షాకిచ్చింది. తన ఖాతాదారులకు ముఖ్యమైన మార్పును ప్రకటించింది. 2026 ఏప్రిల్ 1 నుంచి యూపీఐ ఆధారిత కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్స్‌ను కూడా నెలవారీ ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిలో లెక్కించనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది.
HDFC Bank | ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ తన వినియోగదారులకు షాకిచ్చింది. తన ఖాతాదారులకు ముఖ్యమైన మార్పును ప్రకటించింది. 2026 ఏప్రిల్ 1 నుంచి యూపీఐ ఆధారిత కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్స్‌ను కూడా నెలవారీ ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిలో లెక్కించనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇటీవల ఖాతాదారులకు పంపిన సమాచారంలో యూపీఐ ద్వారా కార్డు లేకుండా తీసుకునే నగదు విత్‌డ్రాయల్స్‌ను ఇకపై ప్రత్యేక కేటగిరీగా పరిగణించబోమని స్పష్టం చేసింది. ఇకపై వీటిని డెబిట్ కార్డు ద్వారా చేసే సాధారణ ఏటీఎం విత్‌డ్రాయల్స్‌తో కలిపి నెలలో ఉచితంగా అనుమతించే లావాదేవీల సంఖ్యలో చేరుస్తారు. దీంతో నెలవారీ ఉచిత పరిమితిని దాటిన ఖాతాదారులు సాధారణ ఏటీఎం చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.
యూపీఐ ఆధారిత ఏటీఎం విత్‌డ్రాయల్ సదుపాయం ద్వారా డెబిట్ కార్డు తీసుకెళ్లకుండా నగదు పొందే అవకాశం ఉంది. ఏటీఎంలో స్క్రీన్‌పై కనిపించే డైనమిక్ క్యూఆర్ కోడ్‌ను మొబైల్‌లోని యూపీఐ యాప్ ద్వారా స్కాన్ చేసి, లావాదేవీని ధ్రువీకరించడం ద్వారా నగదు తీసుకోవచ్చు. డిజిటల్ చెల్లింపులు, సాంప్రదాయ నగదు వినియోగం మధ్య గ్యాప్‌ను తగ్గించేందుకు ఈ కార్డ్‌లెస్ క్యాష్ విధానాన్ని భారతీయ బ్యాంకింగ్ రంగంలో దశలవారీగా అమలు చేస్తున్నారు.
ఇకపై యూపీఐ, డెబిట్ కార్డు నగదు విత్ డ్రా రెండూ ఒక్కటే..
ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సాధారణ సేవింగ్స్, శాలరీ ఖాతాదారులకు తమ ఏటీఎంలలో నెలకు ఐదు ఉచిత నగదు విత్‌డ్రాయల్స్ అందిస్తోంది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో లావాదేవీలు చేస్తే దేశంలోని టాప్ ఆరు మెట్రో నగరాల్లో నెలకు మూడు ఉచిత విత్‌డ్రాయల్స్ మాత్రమే అనుమతిస్తారు. ఇతర నగరాలు, టైర్-2 ప్రాంతాల్లో నెలకు ఐదు ఉచిత విత్‌డ్రాయల్స్ లభిస్తాయి. బ్యాంక్ ప్రకటన ప్రకారం ఈ మార్పు ద్వారా బ్యాంకింగ్ చానళ్లలో చార్జీలను సమానం చేస్తామని, వినియోగదారులకు పారదర్శకమైన ఫీజు వసూలును కొనసాగించడం కోసం తీసుకున్న నిర్ణయమని పేర్కొంది. ఈ మార్పుతో డిజిటల్ ఆధారిత ఏటీఎం లావాదేవీలు కూడా సంప్రదాయ విత్‌డ్రాయల్స్‌తో సమానంగా పరిగణించబడనున్నాయి. ఖాతాదారులు తమ నెలవారీ పరిమితిని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంటుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



