త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Godavari Pushkaralu | గోదావ‌రి పుష్క‌రాలు.. బ‌డ్జెట్‌లో రూ.500కోట్లు కేటాయించిన తెలంగాణ స‌ర్కార్‌..!

Godavari Pushkaralu | వ‌చ్చే ఏడాది జ‌రుగ‌నున్న గోదావ‌రి పుష్క‌రాల కోసం తెలంగాణ ప్ర‌భుత్వం బ‌డ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించింది. అసెంబ్లీలో ఆర్థిక‌శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. గోదావ‌రి పుష్క‌రాలు ప్ర‌తి 12 ఏళ్ల ఒక‌సారి నిర్వ‌హించే విష‌యం తెలిసిందే.

P

Telangana | Published On Mar 20, 2026, 12.39 pm IST

Godavari Pushkaralu | గోదావ‌రి పుష్క‌రాలు.. బ‌డ్జెట్‌లో రూ.500కోట్లు కేటాయించిన తెలంగాణ స‌ర్కార్‌..!
Advertisement

Godavari Pushkaralu | వ‌చ్చే ఏడాది జ‌రుగ‌నున్న గోదావ‌రి పుష్క‌రాల కోసం తెలంగాణ ప్ర‌భుత్వం బ‌డ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించింది. అసెంబ్లీలో ఆర్థిక‌శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. గోదావ‌రి పుష్క‌రాలు ప్ర‌తి 12 ఏళ్ల ఒక‌సారి నిర్వ‌హించే విష‌యం తెలిసిందే. అత్యంత పవిత్ర‌మైన గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్నాయి. ఆయా ప‌విత్ర దినాల్లో సుమారు 8 కోట్ల మంది భ‌క్తులు పుణ్యస్నానాలు చేస్తార‌ని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా 'కుంభమేళా' తరహాలో పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్ర‌భుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పుష్కరాల నిర్వహణ, రోడ్ల విస్తరణ, కొత్త ఘాట్ల నిర్మాణం, దేవాలయాల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఇప్ప‌టికే ప్ర‌భుత్వం మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు నేతృత్వంలో కేబినెట్ స‌బ్ క‌మిటీ ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, భద్రత, రద్దీ నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించే చర్యలు తీసుకుంటోంది. ఈ గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం ఈ బడ్జెట్‌లో రూ.500కోట్లు ప్ర‌తిపాదించిన‌ట్లు ఆర్థిక‌మంత్రి తెలిపారు.

ఇదిలా ఉండ‌గా.. మ‌హారాష్ట్ర త్ర‌యంబ‌కేశ్వ‌ర్‌లో జ‌న్మించిన గోదావ‌రి న‌ది.. నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద తెలంగాణలోకి అడుగుపెడుతుంది. భద్రాచలం వరకు ప్రవహిస్తుంది. ఈ న‌ది ప‌రీవాహ‌క ప్రాంతంలో బాసర, ధర్మపురి, మంథని, కాళేశ్వరం, భద్రాచలం స‌హా ప్ర‌ముఖ ఆల‌యాలు ఉన్నాయి. గోదావ‌రిని ద‌క్షిణగంగ‌గా పిలుస్తారు. వ‌చ్చే ఏడాది ప్రారంభం జ‌రుగ‌నున్న పుష్క‌రాల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్ప‌టికే స‌న్నాహ‌క స‌మావేశం నిర్వ‌హించింది. పుష్క‌రాల కోసం కేబినెట్ సబ్ క‌మిటీని నియ‌మించింది. దీనికి మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. క‌మిటీ ఆధ్వ‌ర్యంలో పుష్క‌రాల నిర్వ‌హ‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, ఏర్పాట్ల‌పై చ‌ర్చించారు. ఘాట్లకు వెళ్లేందుకు రోడ్ల‌ను వేయ‌డంతో పాటు తాగునీరు, పారిశుధ్యం, ర‌వాణా త‌దిత‌ర మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌పై చ‌ర్చించారు. ముంద‌స్తుగా ప్ర‌ణాళిక త‌యారు చేసుకొని ముందుకెళ్లాల‌ని సూచించారు. పుష్క‌రాల‌ను వైభ‌వంగా, ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణం ఉట్టిప‌డేలా వేడుక‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement