Supreme Court | హిందీ విషయంలో మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి.. తమిళనాడు సర్కార్‌పై సుప్రీం ఆగ్రహం
Supreme Court | తమిళనాడు ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. ప్రతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాల (Navodaya Vidyalayas) ఏర్పాటుకు భూమిని కేటాయించాలంటూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించుకోవడానికి సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.
Supreme Court | త్రినేత్ర.న్యూస్ : జవహర్ నవోదయ విద్యాలయాల (JNV) ఏర్పాటు విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. ప్రతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాల (Navodaya Vidyalayas) ఏర్పాటుకు భూమిని కేటాయించాలంటూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలన్న టీవీకే ప్రభుత్వం విజ్ఞప్తిని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.
విద్యార్థులకు లభించే నాణ్యమైన విద్యావకాశాలను దెబ్బతీస్తూ, ఈ అంశాన్ని భాషా వివాదంగా మార్చవద్దని హితవు పలికింది. స్కూళ్లలో హిందీ బోధన పట్ల తమిళనాడు ప్రభుత్వం తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని అభిప్రాయపడింది. తమిళనాడు గడ్డపై హిందీ బోధించకూడదనే మొండి వైఖరి పనికిరాదని స్పష్టం చేసింది. నవోదయ విధానం రాష్ట్ర భాషా విధానానికి పూర్తి విరుద్ధంగా ఉందని తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వాదించారు. దీని వల్ల తమిళ భాషకు ప్రాధాన్యత తగ్గుతుందన్న ప్రభుత్వ ఆందోళనను ధర్మాసనం ముందు ఉంచారు.
అయితే, ప్రభుత్వ వాదనను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. నవోదయ పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకం కాదని జస్టిస్ బీవీ నాగరత్న స్పష్టం చేశారు. త్రిభాషా విధానం కింద ప్రాంతీయ భాష, ఆంగ్లంతో పాటు ఏదైనా మూడో భారతీయ భాషను బోధించవచ్చని తెలిపింది. అది కచ్చితంగా హిందీ మాత్రమే అయి ఉండాల్సిన నిబంధన ఏమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సహకార సమాఖ్యస్ఫూర్తితో (cooperative federalism) భాషా వివాదంపై కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం చర్చలు జరపాలని సూచించారు. గతంలో ఇచ్చిన భూమి కేటాయింపు ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం.. ప్రతి జిల్లాలో జేఎన్‌వీల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మూడు నెలల గడువు విధించింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది.
కాగా, ప్రస్తుతం దేశంలో ఒక్క నవోదయ పాఠశాల కూడా లేని ఏకైక రాష్ట్రం తమిళనాడు మాత్రమే. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జవహర్‌లాల్ నెహ్రూ నవోదయ విద్యాలయాలు (JNVs) జాతీయ విద్యా విధానం ప్రకారం త్రిభాషా సూత్రాన్ని (Three-Language Formula) పాటిస్తాయి. దీని ప్రకారం ఇంగ్లీష్, ప్రాంతీయ భాషతో పాటు హిందీని కూడా బోధిస్తారు. అయితే, తమిళనాడు దశాబ్దాలుగా కేవలం తమిళం, ఇంగ్లీష్ భాషలనే తన అధికారిక ద్విభాషా విధానంగా (Two-language policy) చట్టబద్ధంగా అమలు చేస్తోంది. త్రిభాషా విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం హిందీ భాషను బలవంతంగా రుద్దుతోందని తమిళనాడు ఆరోపిస్తోంది. హిందీని తప్పనిసరి చేయడం వల్ల తమిళ భాష ప్రాధాన్యత తగ్గుతుందనే ఉద్దేశంతో ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు మొదటి నుంచి నవోదయ పాఠశాలల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి.
Also Read..
నా హీరోల్లో అతడే హ్యాండ్‌సమ్ - కియారా అద్వానీ భర్తపై తమన్నా పొగడ్తలు
తిరుమలలో వైభవంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు.. సింహవాహనంపై మలయప్ప విహారం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tribunal Reforms | ఖాళీల కారణంగా ట్రిబ్యునల్స్ మూతపడకూడదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన
సెప్టెంబర్ 15, 2026

Supreme Court | సుప్రీంలో హైడ్రాకు భారీ షాక్.. ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత
సెప్టెంబర్ 15, 2026

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●నిజాం కోటను కాపాడేందుకు ఆఖరి ప్రయత్నం.. కరాచీ టూ హైదరాబాద్ సీక్రెట్ ఫ్లైట్ కథ!
- ●PM Modi | ప్రధాని మోదీ 76వ పుట్టినరోజు స్పెషల్.. రక్తదానం చేసిన సీఎం
- ●Anthropic | మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కు ఆంథ్రోపిక్ పోటీ.. క్లాడ్లోనే డాక్యుమెంట్లు..
- ●Ranbir Kapoor | వినాయకుడి ప్రసాదం వద్దన్న బాలీవుడ్ హీరో - బీఫ్ మ్యాన్ అంటూ ట్రోల్స్
- ●Special Trains | ప్రయాణికులకు తీపికబురు..! పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..
- ●Amazon Alexa Plus | అమెజాన్ నుంచి అలెక్సా ప్లస్.. ఇక మీ మాటే ఆదేశం..

నిజాం కోటను కాపాడేందుకు ఆఖరి ప్రయత్నం.. కరాచీ టూ హైదరాబాద్ సీక్రెట్ ఫ్లైట్ కథ!

PM Modi | ప్రధాని మోదీ 76వ పుట్టినరోజు స్పెషల్.. రక్తదానం చేసిన సీఎం

Anthropic | మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కు ఆంథ్రోపిక్ పోటీ.. క్లాడ్లోనే డాక్యుమెంట్లు..

Ranbir Kapoor | వినాయకుడి ప్రసాదం వద్దన్న బాలీవుడ్ హీరో - బీఫ్ మ్యాన్ అంటూ ట్రోల్స్



