త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamannaah | నా హీరోల్లో అత‌డే హ్యాండ్‌స‌మ్ – కియారా అద్వానీ భ‌ర్త‌పై త‌మ‌న్నా పొగ‌డ్త‌లు

హ్యాండ్‌స‌మ్ హీరో అంటూ కియారా అద్వానీ భ‌ర్త సిద్ధార్థ్ మ‌ల్హోత్రాపై త‌మ‌న్నా ప్ర‌శంస‌లు కురిపించింది. తాను ప‌నిచేసిన అత‌డే అంద‌గాడు అని అన్న‌ది. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన బాలీవుడ్ హార‌ర్ మూవీ ది వాన్ సెప్టెంబ‌ర్ 25న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

N

Entertainment | Published On Sep 17, 2026, 4.15 pm IST

Tamannaah | నా హీరోల్లో అత‌డే హ్యాండ్‌స‌మ్ – కియారా అద్వానీ భ‌ర్త‌పై త‌మ‌న్నా పొగ‌డ్త‌లు
Advertisement

Tamannaah | కియారా అద్వానీ భ‌ర్త సిద్ధార్థ్ మ‌ల్హోత్రాపై మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ప్ర‌శంస‌లు కురిపించింది. తాను ప‌నిచేసిన హీరోల్లో మోస్ట్ హ్యాండ్‌స‌మ్ హీరో అత‌డేన‌ని అన్న‌ది. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, త‌మ‌న్నా హీరోహీరోయిన్లుగా న‌టించిన‌ ది వాన్ మూవీ సెప్టెంబ‌ర్ 25న విడుద‌ల కాబోతుంది. హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను బుధ‌వారం ముంబైలో రిలీజ్ చేశారు. ఈ వేడుక‌లో సిద్ధార్థ్ మ‌ల్హోత్రాపై ప్ర‌శంస‌లు కురిపించింది.

హ్యాండ్‌స‌మ్‌...

"హ్యాండ్‌స‌మ్ అనే బిరుదుకు అర్హుడు సిద్ధార్థ్‌.  ఇరవై ఏళ్ల కెరీర్ లో నేను ప‌నిచేసిన హీరోల్లో చాలా అంద‌గాడు. సెట్స్‌లో అత‌డి మ‌ర్యాద‌, అభిమానం న‌న్ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. స్క్రీన్‌పై చాలా డాషింగ్‌గా, రెబెల్ అటిట్యూడ్‌తో క‌నిపిస్తారు. కానీ రియ‌ల్‌లైఫ్‌లో మాత్రం సెన్సిటివ్ ప‌ర్స‌న్‌. ఎవ‌రిని ఇబ్బంది పెట్ట‌డు. అత‌డితో ప‌నిచేసిన జ్ఞాప‌కాల‌ను ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను" అని అన్న‌ది. త‌మ‌న్నా ప్ర‌శంస‌ల‌తో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా సిగ్గుప‌డిపోయాడు. త‌మ‌న్నాతో క‌లిసి ప‌నిచేయాల‌నే నా త‌మ‌న్నా (కోరిక‌) ఈ సినిమాతో తీరింద‌ని స‌ర‌దాగా కామెంట్లు చేశాడు. ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో వీరిద్ద‌రి నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. కియారా అద్వానీని ట్యాగ్ చేస్తూ ఈ వీడియోను నెటిజ‌న్లు పోస్ట్ చేస్తున్నారు. కియారా చాలా ల‌క్కీ అని కామెంట్లు పెడుతున్నారు.

ఎమోష‌న‌ల్‌...

ఈ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లోనే సినిమాలోని ఛాఠీ మైయా సాంగ్ గురించి మాట్లాడుతూ ఎమోష‌న‌ల్ త‌మ‌న్నా అయ్యింది. "నేను పుట్టి పెరిగింది మొత్తం ముంబైలోనే. ఛాఠీ పూజ గురించి పెద్ద‌గా తెలియ‌దు. ఈ పూజ చేయ‌డానికి ముందు మ‌హిళ‌లు 36 గంట‌ల పాటు క‌ఠిన ఉప‌వాసం ఉంటార‌ని తెలిసింది. క‌నీసం నీళ్లు కూడా తాగ‌ర‌ని విన్నాను. ఫెస్టివ‌ల్ వెనుక ఉండే క‌ష్టం విన‌గానే క‌న్నీళ్లు ఆపుకోలేక‌పోయాయి. ఆ ఫీల్‌ను నిజంగానే నా పాత్ర‌లో చూపించాల‌నే పాట చిత్రీక‌ర‌ణ జ‌రిగిన‌న్నీ రోజులు ఒకే పూట భోజ‌నం చేశా" అని త‌మ‌న్నా చెప్పింది. వాన్ త‌న కెరీర్‌లోనే మోస్ట్ ఛాలెంజింగ్ మూవీ అని అన్న‌ది.

ది వాన్ మూవీకి పంచాయ‌త్ వెబ్‌సిరీస్ ఫేమ్ దీప‌క్ కుమార్ మిశ్రా...ది వాన్ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఎక్తా క‌పూర్‌తో క‌లిసి టీవీఎఫ్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.

Advertisement
Advertisement