Special Trains | ప్రయాణికులకు తీపికబురు..! పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..
Special Trains | ప్రయాణికుల దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని వీక్లీ ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. చర్లపల్లి–షాలిమార్, కోయంబత్తూర్–జైపూర్, జోధ్‌పూర్–చెన్నై బీచ్, కాన్పూర్ సెంట్రల్–ఎస్‌ఎంటీవీ బెంగళూరు మార్గాల్లో నడుస్తున్న వీక్లీ స్పెషల్ ట్రైన్లను అదనపు సర్వీసులతో కొనసాగించనున్నట్లు ప్రకటించింది.
Special Trains | ప్రయాణికుల దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని వీక్లీ ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. చర్లపల్లి–షాలిమార్, కోయంబత్తూర్–జైపూర్, జోధ్‌పూర్–చెన్నై బీచ్, కాన్పూర్ సెంట్రల్–ఎస్‌ఎంటీవీ బెంగళూరు మార్గాల్లో నడుస్తున్న వీక్లీ స్పెషల్ ట్రైన్లను అదనపు సర్వీసులతో కొనసాగించనున్నట్లు ప్రకటించింది. చర్లపల్లి–షాలిమార్ (08046) రైలు అక్టోబర్ 3 నుంచి నవంబర్ 28 వరకు రాకపోకలు సాగిస్తుందని తెలిపింది. ఇక షాలిమార్–చర్లపల్లి (08045) రైలు అక్టోబర్ 2 నుంచి నవంబర్ 27 అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ రైలు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండి, సామర్లకోట, తూని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళంరోడ్, బర్హంపూర్, ఖుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, సత్రగాచి స్టేషన్లలో ఆగుతుందని తెలిపింది.
కోయంబత్తూర్–జైపూర్ మధ్య...
కోయంబత్తూర్–జైపూర్ (06181) రైలు అక్టోబర్ 8 నుంచి నవంబర్ 29 వరకు రాకపోకలు సాగిస్తుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. జైపూర్–కోయంబత్తూర్ (06182) రైలు అక్టోబర్ 11 నుంచి 29 నంబర్ వరకు ప్రతి ఆదివారం రాకపోకలు సాగిస్తుందని చెప్పింది. ఈ రైలు రెండుమార్గాల్లో తిరుప్పూర్, ఈరోడ్, సేలం, కాట్పాడి, రేణిగుంట, కడప, కర్నూల్ సిటీ, గద్వాల్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముఖ్దేడ్, నాందేడ్, పూర్ణా, హింగోలి, వాసిమ్, అకోలా, మల్కాపూర్, భూస్వల్, జాల్నా, ఉద్నా, బడోదరా, గోద్రా, రత్లాం, మాండ్‌సోర్, బిల్వారా, నసిరాబాద్, అజ్మీర్, కిషన్‌గఢ్ తదితర స్టేషన్లలో ఆగుతుందని తెలిపింది.
జోధ్‌పూర్–చెన్నై బీచ్ రైళ్లు పొడిగింపు..
జోధ్‌పూర్–చెన్నై బీచ్ (04815) మధ్య వీక్లీ స్పెషల్ రైలు అక్టోబర్ మూడు నుంచి నవంబర్ 28 వరకు రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. చెన్నై సెంట్రల్–జోధ్‌పూర్ (04816) వీక్లీ స్పెషల్ రైలు అక్టోబర్ 6 నుంచి డిసెంబర్ 1 వరకు పొడిగించినట్లు పేర్కొంది. ఈ రైళ్లు ప్రతి శనివారం, గురువారాల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ రైలు ఇరుమార్గాల్లో జోధ్‌పూర్, జైపూర్, సవాయ్ మాధోపూర్, కోటా, భోపాల్, నాగ్‌పూర్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, నెల్లూరు, గూడూరు, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ తదితర స్టేషన్లలో రైళ్లు ఆగుతాయని వివరించింది.
కన్పూర్ సెంట్రల్-బెంగళూరు రైలు..
ఇక కాన్పూర్ సెంట్రల్–ఎస్‌ఎంటీవీ బెంగళూరు (04131) రైలు ప్రతి శనివారం అక్టోబర్ 4 నుంచి నవంబర్ 18 వరకు నడుస్తుంది. ఎస్‌ఎంటీవీ బెంగళూరు–కాన్పూర్ సెంట్రల్ (04132) రైలు అక్టోబర్ 7 నుంచి నవంబర్ 18 వరకు నడుస్తుందని పేర్కొంది. ఈ రైలు ప్రయాగ్‌రాజ్, శంకర్‌గఢ్, మక్రానా, కుచ్‌మన్ సిటీ, జైపూర్, దుర్గాపూర్, సవాయ్ మాధోపూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, ఎంజీఆర్ చెన్నై సెంటర్ స్టేషన్లలో ఆగుతుందని వివరించింది. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Special Trains | వినాయక చవితి రద్దీ.. ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
సెప్టెంబర్ 16, 2026

Special Trains | వరుస సెలవులు.. నేడు, రేపు సికింద్రాబాద్-కాగజ్‌నగర్-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు..
సెప్టెంబర్ 12, 2026

Special Trains | పండుగల వేళ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్.. ఈ రూట్లో భారీగా ప్రత్యేక రైళ్లు..!
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Malka Komaraiah - AVN Reddy | ప్రమోషన్లు ఎప్పుడిస్తారు? స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయండి
- ●Payal Rajput | బోల్డ్ ఫొటోలతో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ రచ్చ - అవకాశాల కోసమేనా?
- ●నిజాం కోటను కాపాడేందుకు ఆఖరి ప్రయత్నం.. కరాచీ టూ హైదరాబాద్ సీక్రెట్ ఫ్లైట్ కథ!
- ●PM Modi | ప్రధాని మోదీ 76వ పుట్టినరోజు స్పెషల్.. రక్తదానం చేసిన సీఎం
- ●Anthropic | మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు ఆంథ్రోపిక్ పోటీ.. క్లాడ్లోనే డాక్యుమెంట్లు..
- ●Ranbir Kapoor | వినాయకుడి ప్రసాదం వద్దన్న బాలీవుడ్ హీరో - బీఫ్ మ్యాన్ అంటూ ట్రోల్స్

Malka Komaraiah - AVN Reddy | ప్రమోషన్లు ఎప్పుడిస్తారు? స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయండి

Payal Rajput | బోల్డ్ ఫొటోలతో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ రచ్చ - అవకాశాల కోసమేనా?

నిజాం కోటను కాపాడేందుకు ఆఖరి ప్రయత్నం.. కరాచీ టూ హైదరాబాద్ సీక్రెట్ ఫ్లైట్ కథ!

PM Modi | ప్రధాని మోదీ 76వ పుట్టినరోజు స్పెషల్.. రక్తదానం చేసిన సీఎం



