త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ranbir Kapoor | వినాయ‌కుడి ప్ర‌సాదం వ‌ద్ద‌న్న‌ బాలీవుడ్ హీరో – బీఫ్ మ్యాన్ అంటూ ట్రోల్స్‌

రామాయ‌ణం రిలీజ్ ముగింట ర‌ణ‌భీర్ క‌పూర్ చిక్కుల్లో ప‌డ్డాడు. వినాయ‌కుడి ప్ర‌సాదం తిన‌డానికి ఈ బాలీవుడ్ హీరో నిరాక‌రించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ర‌ణ‌భీర్‌ను నెటిజ‌న్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. బీఫ్ మ్యాన్ అంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

N

Entertainment | Published On Sep 17, 2026, 5.17 pm IST

Ranbir Kapoor | వినాయ‌కుడి ప్ర‌సాదం వ‌ద్ద‌న్న‌ బాలీవుడ్ హీరో – బీఫ్ మ్యాన్ అంటూ ట్రోల్స్‌
Advertisement

Ranbir Kapoor | రామాయ‌ణ రిలీజ్ ముంగిట బాలీవుడ్ హీరో ర‌ణ‌భీర్ క‌పూర్ చిక్కుల్లో ప‌డ్డాడు. వినాయ‌కుడి ప్ర‌సాదాన్ని తీసుకోవ‌డానికి నిరాక‌రించిన ర‌ణ‌భీర్ క‌పూర్ వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇందులో వినాయ‌కుడి పూజా కార్య‌క్ర‌మాల్లో ఈ బాలీవుడ్ హీరో పాల్గొన్నాడు. చివ‌ర‌లో అత‌డికి ఓ భ‌క్తుడు ప్ర‌సాదం ఇవ్వ‌బోగా... తాను డైట్‌లో ఉన్నానంటూ తిన‌డానికి నిరాక‌రించాడు. ప్ర‌సాదం తీసుకోకుండా వెళ్లిపోయాడు. రీసెంట్‌గానే ఈ సంఘ‌ట‌న జ‌రిగిందంటూ నెటిజ‌న్లు కామెంట్లు, ట్వీట్స్ పెడుతున్నారు.

మైథాల‌జీ...

మైథాల‌జీ మూవీ...ర‌ణ‌భీర్ క‌పూర్ హీరోగా న‌టించిన రామాయ‌ణ మూవీ న‌వంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ మైథాల‌జీ సినిమా కోసం ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టేందుకు ఈ బాలీవుడ్ హీరో రెడీ అవుతోన్న టైమ్‌లో ఈ వీడియో వైర‌ల్ కావ‌డం హిందీ ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌రంగా మారింది.

రాముడి పాత్ర కోసం...

అయితే ఈ వీడియో ఇప్ప‌టిది కాద‌ని స‌మాచారం. 2023 టైమ్‌లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింద‌ని అంటున్నారు. రామాయ‌ణ సినిమాను అంగీక‌రించిన ర‌ణ‌భీర్ క‌పూర్ రాముడి పాత్ర కోసం బ‌రువు త‌గ్గారు. స్ట్రిక్ట్ డైట్‌ను ఫాలో అయ్యారు. స్వీట్స్‌కు చాలా రోజుల పాటు దూరంగా ఉన్నారు. అందుకే ఆయ‌న ప్ర‌సాదం స్వీక‌రించ‌డానికి నిరాక‌రించార‌ని, అందులో వివాదం ఏం లేదంటూ ఫ్యాన్స్ ర‌ణ‌భీర్ క‌పూర్‌కు స‌పోర్ట్ చేస్తున్నారు.

బీఫ్ మ్యాన్‌...

నెటిజ‌న్లు మాత్రం ఈ బాలీవుడ్ హీరోను తెగ ట్రోల్ చేస్తున్నారు. ప్ర‌సాదం తీసుకోవ‌డానికి ఇష్టం లేకే డైట్ అంటూ అబ‌ద్ధం చెప్పాడ‌ని అంటున్నారు. కొంచెం ప్ర‌సాదం తింటే బ‌రువు పెర‌గ‌ర‌ని, ఆరోగ్యం పాడైపోద‌ని కామెంట్లు పెడుతున్నారు. రామాయ‌ణ సినిమాలో రాముడి పాత్ర చేస్తోన్న ర‌ణ‌భీర్ క‌పూర్ భ‌క్తి ఏమిటో ఈ వీడియోతోనే తెలిసిపోతుంద‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. బీఫ్ మ్యాన్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. నెటిజ‌న్ల కామెంట్లు వైర‌ల్ అవుతోన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Paps Desk (@papsdesk)

Advertisement
Advertisement