Pithapuramlo | సెప్టెంబర్ 18న ‘పిఠాపురంలో… అలా మొదలైంది’
Pithapuramlo | ‘ప్రేయసి రావే’ ఫేమ్ దర్శకుడు మహేష్ చంద్ర తెరకెక్కించిన తాజా చిత్రం ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’. డాక్టర్ రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ తదితరులు నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Pithapuramlo | ‘ప్రేయసి రావే’ ఫేమ్ దర్శకుడు మహేష్ చంద్ర తెరకెక్కించిన తాజా చిత్రం ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’. డాక్టర్ రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ తదితరులు నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ప్రేమ, హాస్యం, సెంటిమెంట్‌తో పాటు తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ప్రధానంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించినట్లు దర్శకుడు మహేశ్ చంద్ర తెలిపారు. యువతకు మంచి సందేశాన్ని అందించేలా కథను తీర్చిదిద్దామని చెప్పారు. మన చుట్టూ కనిపించే సహజమైన మనుషులు, సంఘటనల ఆధారంగా కథనం సాగుతుందని.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని పేర్కొన్నారు.
బ్రహ్మానందం వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణ
హాస్య బ్రహ్మ డాక్టర్ బ్రహ్మానందం వాయిస్ ఓవర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు తెలిపారు. ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్ వడయార్ కీలక పాత్రలో నటించారని చెప్పారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని వెల్లడించారు. ‘నిజంగా కెమెరా పెట్టి లైవ్ చేసినట్టుగా సినిమా ఉంటుంది. ఇలాంటి సహజమైన కాన్సెప్టులు ఎప్పుడూ ఎవర్‌గ్రీన్‌గానే ఉంటాయి. ‘ఇరుముడి’, ‘విశ్వనాథం అండ్ సన్స్’, ‘మా ఇంటి బంగారం’ తరహాలో మా సినిమా కూడా కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుంది’ అని మహేష్ చంద్ర పేర్కొన్నారు.
భారీ తారాగణం
ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ, దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, జూనియర్ పవన్ కళ్యాణ్, జేడీవీ ప్రసాద్, కేఏ పాల్ రాము, జబర్దస్త్ శేషు తదితరులు నటించారు. మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్‌ఎం మురళి (గోదారి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీరామ్ ఏదోటి స్టోరీ డెవలప్‌మెంట్, డైలాగ్స్ అందించగా.. బీ సత్యనారాయణ ఎడిటర్‌గా, జీసీ క్రిష్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను మహేష్ చంద్ర నిర్వహించారు. కుటుంబ అనుబంధాలు, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●BJP Memorandum to Governor | ఫీజు బకాయిలు విడుదలయ్యేలా చూడండి.. గవర్నర్‌కు బీజేపీ వినతి
- ●Stock Markets | ముడి చమురు ధరల మంట.. భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు..
- ●TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- ●Delhi buildings | ఢిల్లీలో 38% భవనాలు రిస్క్‌లోనే.. భూకంపం వస్తే అంతే సంగతులు
- ●ICICI Lombard | ఐసీఐసీఐ లాంబార్డ్‌కు రూ.1 కోటి జరిమానా.. అసలు కారణం ఇదే..
- ●Maremma | రవితేజ మేనల్లుడి ‘మరెమ్మ’కు ‘ఏ’ సర్టిఫికెట్.. విడుదల ఎప్పుడంటే?

BJP Memorandum to Governor | ఫీజు బకాయిలు విడుదలయ్యేలా చూడండి.. గవర్నర్‌కు బీజేపీ వినతి

Stock Markets | ముడి చమురు ధరల మంట.. భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు..

TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Delhi buildings | ఢిల్లీలో 38% భవనాలు రిస్క్‌లోనే.. భూకంపం వస్తే అంతే సంగతులు





