BJP Memorandum to Governor | ఫీజు బకాయిలు విడుదలయ్యేలా చూడండి.. గవర్నర్‌కు బీజేపీ వినతి
BJP Memorandum to Governor | రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గవర్నర్‌ను కోరినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు.
BJP Memorandum to Governor | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గవర్నర్‌ను కోరినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు. నిన్న గాయాలపాలైన యువమోర్చా నాయకులతో వెళ్లి మంగళవారం గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు. దాదాపు 40 లక్షల మంది ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు.
అనంతరం రాంచందర్ రావు మాట్లాడారు. హైకోర్టు చివాట్లు పెడితే ఈ సంవత్సరం నూతనంగా చేరిన విద్యార్థులకు విడుదల చేశారు. ఇందులో మా ఆందోళనలు కలిసొచ్చాయి. 15 వేల కోట్లు విద్యార్థులకు ఇస్తే వెలుగులు చూస్తామని వారు ఎదురుచూస్తున్నారు. కాలేజీ సిబ్బందికి సగం జీతాలు ఇచ్చి పిల్లలకు బోధన జరిపిస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిటీ తగ్గిపోయే అవకాశం ఉంది. విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ ఏం చేస్తున్నారని మేం ప్రశ్నిస్తున్నం. గవర్నర్‌కు కూడా ఇదే విషయం చెప్పాం.
ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల 40 లక్షల మందికి పైగా బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు సర్టిఫికెట్లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీక్ష చేపట్టినా, 8 లక్షల మంది విద్యార్థులు ముఖ్యమంత్రికి లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరాం.
ఒక మంచి వాతావరణం నిర్మాణం చేయాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చో, సలహా ఇచ్చో ఫీజు బకాయిలు విడుదల చేయించాలని కోరాం. అడిగితే లాఠీచార్జీలు, తప్పుడు కేసులు పెడుతున్నరు. అనేక రోజులుగా జిల్లాల్లో, మండలాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి వారికి సలహా ఇస్తానని గవర్నర్ చెప్పారు అని రాంచందర్ రావు తెలిపారు.
గవర్నర్‌ను కలిసిన వారలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొమ్మ జయశ్రీ, బి. శాంతి కుమార్, డి.కళ్యాణ్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్. గౌతమ్ రావు, వేముల అశోక్, టి. వీరేందర్ గౌడ్, పార్టీ అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్, కార్యదర్శి పి. భరత్ ప్రసాద్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుండే తదితరులు ఉన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Stock Markets | ముడి చమురు ధరల మంట.. భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు..
- ●TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- ●Delhi buildings | ఢిల్లీలో 38% భవనాలు రిస్క్లోనే.. భూకంపం వస్తే అంతే సంగతులు
- ●ICICI Lombard | ఐసీఐసీఐ లాంబార్డ్కు రూ.1 కోటి జరిమానా.. అసలు కారణం ఇదే..
- ●Maremma | రవితేజ మేనల్లుడి ‘మరెమ్మ’కు ‘ఏ’ సర్టిఫికెట్.. విడుదల ఎప్పుడంటే?
- ●Osmania University 85th Convocation | జాబ్ సీకర్స్ వద్దు.. ఎంట్రప్రెన్యూర్స్గా ఎదగండి

Stock Markets | ముడి చమురు ధరల మంట.. భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు..

TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Delhi buildings | ఢిల్లీలో 38% భవనాలు రిస్క్లోనే.. భూకంపం వస్తే అంతే సంగతులు

ICICI Lombard | ఐసీఐసీఐ లాంబార్డ్కు రూ.1 కోటి జరిమానా.. అసలు కారణం ఇదే..







