Telangana Women’s Commission | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై రాష్ట్ర మహిళా కమిషన్‌కు కాంగ్రెస్ మహిళా నేతల ఫిర్యాదు
అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షర్టులు విప్పి మహిళా పోలీసులను అవమానించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే?
- మహిళా కానిస్టేబుళ్ల ముందే చొక్కాలు విప్పడం సిగ్గుచేటన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
- విధుల్లో ఉన్న పోలీసులను అగౌరవపరిచిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్
- తమ పార్టీ మహిళా నేతలపై పోలీసుల తీరును నిరసిస్తూ జాతీయ కమిషన్‌కు వెళ్తామన్న బీఆర్ఎస్
Telangana Women's Commission | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ శాసనసభ వద్ద సోమవారం చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మహిళా పోలీసుల పట్ల అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించారంటూ అధికార కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు.. రాష్ట్ర మహిళా కమిషన్ (Women's Commission) మెట్లు ఎక్కారు. హైదరాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో వారు అధికారికంగా ఫిర్యాదు సమర్పించారు.
మహిళా కానిస్టేబుళ్ల ముందే చొక్కాలు విప్పారు..
ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ ప్రాంగణంలో ప్రతిపక్ష నేతలు ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని కాంగ్రెస్ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్ల ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చొక్కాలు విప్పి వీరంగం సృష్టించారని ఆమె ఆరోపించారు. పబ్లిక్ ప్లేసుల్లో (Public places) ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, ఇలా మహిళల గౌరవానికి భంగం కలిగించడం దారుణమన్నారు. పాపం ఆ మహిళా కానిస్టేబుల్ తలదించుకుని నిలబడాల్సి రావడం ఎంత దారుణమో ఆలోచించాలన్నారు.

లీగల్ యాక్షన్ తీసుకోవాలి..
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలను, వివరాలను మహిళా కమిషన్‌కు అందజేశామని ఎమ్మెల్యే పద్మావతి తెలిపారు. విధుల్లో ఉన్న మహిళా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన బీఆర్ఎస్ నేతలపై వెంటనే లీగల్ యాక్షన్ (Legal action) తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. పోలీసులు కేవలం మహిళా నేతలను రక్షించే ప్రయత్నం మాత్రమే చేశారని స్పష్టం చేశారు.

జాతీయ కమిషన్‌కు వెళ్తామన్న బీఆర్ఎస్..
అయితే, ఈ వివాదం మరో మలుపు తిరిగింది. అసెంబ్లీ గేటు బయట జరిగిన తోపులాటలో తమ పార్టీకి చెందిన సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల మహిళా పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌తో పాటు (National Women's Commission), ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేస్తామని వారు ప్రకటించడంతో తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కాయి.
అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాము.ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు బాధించింది.మహిళా ఉద్యోగులు,ప్రజాప్రతినిధులు ఉన్న ప్రదేశంలో చొక్కాలు విప్పుకుని వీరంగం సృష్టించడం సిగ్గుచేటు. pic.twitter.com/vpRxRL21QX
— Mamidala Yashaswini (@YJR_INC) September 8, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR and Harish Rao Arrest | ఎర్రవల్లి వద్ద హైటెన్షన్: ‘ఎవడ్రా నువ్వు’ అంటూ పోలీసుల జులుం.. కేటీఆర్, హరీష్ రావుల అరెస్ట్
సెప్టెంబర్ 8, 2026

MLA Vijaya Ramana Rao | మహానటి సావిత్రి కంటే గొప్పగా నటిస్తున్నారు.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు
సెప్టెంబర్ 8, 2026

KTR | వలువలు విప్పుతున్నానన్న రేవంత్‌రెడ్డి.. విలువల గురించి మాట్లాడుతున్నడు : కేటీఆర్
సెప్టెంబర్ 7, 2026
తాజావార్తలు
- ●BJP Memorandum to Governor | ఫీజు బకాయిలు విడుదలయ్యేలా చూడండి.. గవర్నర్‌కు బీజేపీ వినతి
- ●Stock Markets | ముడి చమురు ధరల మంట.. భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు..
- ●TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- ●Delhi buildings | ఢిల్లీలో 38% భవనాలు రిస్క్‌లోనే.. భూకంపం వస్తే అంతే సంగతులు
- ●ICICI Lombard | ఐసీఐసీఐ లాంబార్డ్‌కు రూ.1 కోటి జరిమానా.. అసలు కారణం ఇదే..
- ●Maremma | రవితేజ మేనల్లుడి ‘మరెమ్మ’కు ‘ఏ’ సర్టిఫికెట్.. విడుదల ఎప్పుడంటే?

BJP Memorandum to Governor | ఫీజు బకాయిలు విడుదలయ్యేలా చూడండి.. గవర్నర్‌కు బీజేపీ వినతి

Stock Markets | ముడి చమురు ధరల మంట.. భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు..

TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Delhi buildings | ఢిల్లీలో 38% భవనాలు రిస్క్‌లోనే.. భూకంపం వస్తే అంతే సంగతులు



