త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gaddam Prasad | కేసీఆర్‌కు ఫోన్ చేసిన స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్‌!

Gaddam Prasad | శాసనసభలో నిన్న జరిగిన ఘటనపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ స్పందించారు. నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని భావించామని, అందుకే హరీశ్‌రావుకు మైక్‌ ఇచ్చామని తెలిపారు. క్షమాపణ చెప్పకుండా అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడంతో తాను అసహనానికి గురికావాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

P

Telangana | Published On Sep 8, 2026, 4.46 pm IST

Gaddam Prasad | కేసీఆర్‌కు ఫోన్ చేసిన స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్‌!
Advertisement

Gaddam Prasad | శాసనసభలో నిన్న జరిగిన ఘటనపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ స్పందించారు. నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని భావించామని, అందుకే హరీశ్‌రావుకు మైక్‌ ఇచ్చామని తెలిపారు. క్షమాపణ చెప్పకుండా అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడంతో తాను అసహనానికి గురికావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. స్పీకర్‌గా తాను సభలో నాలుగు వైపులా చూస్తుంటానని, సభ ప్రజాస్వామ్యబద్ధంగా సాగాలన్నదే తన ఆలోచన అని చెప్పారు. వాస్తవానికి మైక్‌ ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా.. మాట్లాడే అవకాశం ఇచ్చామని తెలిపారు. హరీశ్‌రావు పదేళ్లపాటు సభలో మంత్రిగా పనిచేశారని, కనీసం ఈ విషయంలో స్పందించకపోతే ఎలా అని ప్రశ్నించారు. ‘స్పీకర్‌ పరిధి కాదు అంటే ఎలా? పబ్లిక్‌ గార్డెన్స్‌ నుంచి మా పరిధే. నేనే చర్యలు తీసుకోవచ్చు’ అని స్పష్టం చేశారు.

సస్పెండ్‌ చేయడం పెద్ద విషయం కాదు..

ఎమ్మెల్సీలు కౌశిక్‌రెడ్డి సహా ఇద్దరిని సస్పెండ్‌ చేసి పంపే అధికారం తనకు ఉందని స్పీకర్ తేల్చి చెప్పారు. అయితే, అలా చేయడం సరైన పద్ధతి కాదని, కాంగ్రెస్‌ విధానం అలా ఉండదని పేర్కొన్నారు. సభలో క్రమశిక్షణను కాపాడుతూనే ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. కడియం శ్రీహరిని ప్యానెల్‌ స్పీకర్‌గా నియమిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాను సభకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.

మహిళా ఎమ్మెల్యేల అంశంపై చర్యలు

కేటీఆర్‌, కౌశిక్‌రెడ్డి పోలీసులపై దాడి చేసిన వీడియోలు కనిపించాయని స్పీకర్‌ పేర్కొన్నారు. మహిళా ఎమ్మెల్యేల అంశంపై ముఖ్యమంత్రి కూడా సీరియస్‌గా ఉన్నారని, దీనిపై నివేదిక తెప్పించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాసనసభలో ప్రస్తుతం అమలు చేస్తున్న నిబంధనలు గత ప్రభుత్వం, కేసీఆర్‌ హయాంలో రూపొందించినవేనని స్పీకర్‌ తెలిపారు. ‘వాళ్లు పెట్టిన రూల్స్‌నే మేం అమలు చేస్తున్నాం’ అని చెప్పారు. గతంలోనూ సభలో విభేదాలు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కనిపిస్తున్న విధంగా వ్యవహరించలేదని పేర్కొన్నారు. సబితా ఇంద్రారెడ్డితో గతంలో రాజకీయంగా యుద్ధం జరిగిన సందర్భాలు ఉన్నా.. సభలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావని గుర్తుచేశారు.

కేసీఆర్‌కు ఫోన్‌ చేశా

సభ ప్రారంభానికి ముందు శాసనసభా పక్ష నేతలకు ఫోన్‌ చేసి మాట్లాడుతానని స్పీకర్‌ తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా ఫోన్‌ చేసి సభకు రావాలని కోరినట్లు చెప్పారు. అయితే ఆరోగ్యం సహకరించడం లేదని కేసీఆర్‌ తనకు చెప్పారని వెల్లడించారు. ఇక రాహుల్‌ గాంధీ ప్లకార్డులు తీసుకుని వెళ్లిన సందర్భంలో స్పీకర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారని, అనంతరం ఆయన ప్లకార్డులు ఇచ్చేశారని పేర్కొన్నారు. సభలో నిబంధనలు పాటిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement