త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS, Congress Mutual attack | ర‌ణరంగంగా బోయిన్‌ప‌ల్లి పీఎస్‌.. బీఆర్ఎస్‌, కాంగ్రెస్ ప‌ర‌స్ప‌ర దాడి

BRS, Congress Mutual attack | బోయిన్‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్ మంగ‌ళ‌వారం రణ‌రంగంగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేత‌లు పీఎస్ ముందే రాళ్లు, క‌ర్ర‌లు, కుర్చీలతో ప‌ర‌స్ప‌రం దాడి చేసుకుని బీభ‌త్సం సృష్టించారు.

S

Telangana | Published On Sep 8, 2026, 4.42 pm IST

BRS, Congress Mutual attack | ర‌ణరంగంగా బోయిన్‌ప‌ల్లి పీఎస్‌.. బీఆర్ఎస్‌, కాంగ్రెస్ ప‌ర‌స్ప‌ర దాడి
Advertisement

BRS, Congress Mutual attack | త్రినేత్ర‌.న్యూస్: బోయిన్‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్ మంగ‌ళ‌వారం రణ‌రంగంగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేత‌లు పీఎస్ ముందే రాళ్లు, క‌ర్ర‌లు, కుర్చీలతో ప‌ర‌స్ప‌రం దాడి చేసుకుని బీభ‌త్సం సృష్టించారు. ఒక‌రికొక‌రు వ్య‌తిరేకంగా నినాదాలు చేసుకుంటూ హోరెత్తించారు. ఈ క్ర‌మంలో బీఆర్ఎస్ శ్రేణుల దాడిలో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఓ మ‌హిళా కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌పై దాడి చేశారు. మ‌రో కార్య‌క‌ర్త‌కు చేయి విరిగిన‌ట్లు స‌మాచారం.

కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ ఎర్ర‌వ‌ల్లి ఫామ్‌హౌస్ ముట్ట‌డి నేప‌థ్యంలో కేటీఆర్, హ‌రీశ్ రావు అసెంబ్లీ నుంచి ఎర్ర‌వ‌ల్లికి బ‌య‌లుదేరారు. ఈ క్ర‌మంలో మార్గ‌మ‌ధ్య‌లోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నారన్న స‌మాచారంతో గులాబీ కార్య‌క‌ర్త‌లు అక్క‌డ‌కు భారీగా చేరుకున్నారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు సైతం పీఎస్‌కు త‌ర‌లివ‌చ్చారు. ఒకే స‌మ‌యంలో ఇరుపార్టీల శ్రేణులు ఎదురు ప‌డ‌డంతో తీవ్ర ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసింది. ప‌రిస్థితి చేయిదాటి పోకుండా పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసి ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరు పార్టీల కార్య‌క‌ర్త‌ల‌ను చెద‌ర‌గొట్టి పంపించివేశారు.

Advertisement
Advertisement