CP PLUS | ఇక కార్లకు మరింత సేఫ్టీ.. కొత్త డ్యాష్ క్యామ్‌లు లాంచ్.. సిమ్ కనెక్టివిటీ సదుపాయం..
CP PLUS | వాహన భద్రత, రిమోట్ మానిటరింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీపీ ప్లస్ భారత మార్కెట్లో కొత్త కార్‌కామ్ 4జి డ్యాష్‌క్యామ్ సిరీస్‌ను విడుదల చేసింది. ఇందులో సీపీ-హెచ్27, సీపీ-హెచ్27బీ అనే రెండు మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి.
Technology | Published On Jul 22, 2026, 11.43 am IST
CP PLUS | వాహన భద్రత, రిమోట్ మానిటరింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీపీ ప్లస్ భారత మార్కెట్లో కొత్త కార్‌కామ్ 4జి డ్యాష్‌క్యామ్ సిరీస్‌ను విడుదల చేసింది. ఇందులో సీపీ-హెచ్27, సీపీ-హెచ్27బీ అనే రెండు మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ డ్యాష్‌క్యామ్‌లు వాహన ప్రయాణాలను రికార్డ్ చేయడంతో పాటు, ఈజీలివ్ ప్లస్ మొబైల్ యాప్ ద్వారా రిమోట్ యాక్సెస్, లైవ్ వ్యూయింగ్, వాహన లొకేషన్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను అందిస్తున్నాయి. సీపీ-హెచ్27 మోడల్‌లో ముందు భాగంలో 2 మెగాపిక్సెల్ ఫుల్ హెచ్‌డీ కెమెరా అందించారు. ఇందులో బిల్ట్-ఇన్ జీపీఎస్, టూ-వే టాక్, మోషన్ డిటెక్షన్, కొలిజన్ డిటెక్షన్, జీ-సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే అనుకూలమైన టైప్-సి హార్డ్‌వైర్ కిట్‌ను ఉపయోగిస్తే పార్కింగ్ మానిటరింగ్, టైమ్-ల్యాప్స్ రికార్డింగ్ కూడా పనిచేస్తాయి.
ఫుల్ హెచ్‌డీ కెమెరాలు, సిమ్ కనెక్టివిటీ..
సీపీ-హెచ్27బీ మోడల్‌లో డ్యూయల్ ఛానల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో ముందు భాగంలో 2 మెగాపిక్సెల్ ఫుల్ హెచ్‌డీ కెమెరాతో పాటు వెనుక భాగంలో కూడా 2 మెగాపిక్సెల్ ఫుల్ హెచ్‌డీ కెమెరా ఉంటుంది. దీంతో వాహనం ముందు, వెనుక భాగాలను ఒకేసారి రికార్డ్ చేయవచ్చు. ఈ మోడల్ కూడా ఈజీలివ్ ప్లస్ యాప్ ద్వారా రిమోట్ మానిటరింగ్, లైవ్ యాక్సెస్ వంటి కనెక్టెడ్ ఫీచర్లను అందిస్తుంది. ఈ రెండు డ్యాష్‌క్యామ్‌లు 4జి/5జి సిమ్ కనెక్టివిటీకి మద్దతు ఇస్తాయి. దీంతో ఎక్కడి నుంచైనా లైవ్ వీడియో చూడటం, వాహనం లొకేషన్ ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది. హెచ్‌డీఆర్ సపోర్ట్, హెచ్.265 వీడియో కంప్రెషన్, గరిష్టంగా 1 టెరాబైట్ మైక్రోఎస్‌డీ కార్డ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. అలాగే బిల్ట్-ఇన్ జీపీఎస్, టూ-వే టాక్, మోషన్ డిటెక్షన్, కొలిజన్ డిటెక్షన్, పార్కింగ్ మానిటరింగ్, టైమ్-ల్యాప్స్ రికార్డింగ్, వాయిస్ ప్రాంప్ట్, హెచ్‌డీఆర్, జీ-సెన్సార్ వంటి ఫీచర్లు రెండు మోడళ్లలోనూ అందుబాటులో ఉన్నాయి.
ధర ఎంతంటే..
సీపీ-హెచ్27లో 2 మెగాపిక్సెల్ రిజల్యూషన్‌తో 25 ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్, హెచ్-115 డిగ్రీలు, డీ-136 డిగ్రీలు, వీ-61 డిగ్రీల వ్యూ యాంగిల్ అందించారు. ఎమ్‌పీ4 వీడియో ఫార్మాట్, జేపీజీ ఫోటో ఫార్మాట్, మైక్రోఫోన్, స్పీకర్ సపోర్ట్, టైప్-సి 5వీ/3.4ఏ పవర్ సపోర్ట్, -10 డిగ్రీల నుంచి 60 డిగ్రీల సెల్సియస్ వరకు ఆపరేటింగ్ టెంపరేచర్‌ను సపోర్ట్ చేస్తుంది. సీపీ-హెచ్27బీలో ముందు, వెనుక రెండింటిలోనూ 2 మెగాపిక్సెల్ ఫుల్ హెచ్‌డీ కెమెరాలు ఉన్నాయి. ముందు కెమెరాకు 3.0 ఎంఎం ఎఫ్1.5 లెన్స్, వెనుక కెమెరాకు 3.35 ఎంఎం ఎఫ్2.0 లెన్స్ ఇచ్చారు. ముందు కెమెరా హెచ్-115 డిగ్రీలు, డీ-136 డిగ్రీలు, వీ-61 డిగ్రీల వ్యూ యాంగిల్‌ను అందిస్తే, వెనుక కెమెరా హెచ్-102 డిగ్రీలు, డీ-124 డిగ్రీలు, వీ-53 డిగ్రీల వ్యూ యాంగిల్‌ను అందిస్తుంది. మిగతా కనెక్టివిటీ, స్టోరేజ్, రికార్డింగ్, జీపీఎస్, పార్కింగ్ మోడ్ వంటి ఫీచర్లు సీపీ-హెచ్27తో సమానంగా ఉన్నాయి. సీపీ ప్లస్ కార్‌కామ్ 4జీ సీపీ-హెచ్27 ధర రూ. 7,599 ఉండగా, సీపీ-హెచ్27బీ ధర రూ. 11,699గా ఉంది. ఈ రెండు మోడళ్లు ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
తాజావార్తలు
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల



