త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | బీఆర్ఎస్‌, బీజేపీ ల‌క్ష్యం ఒక్క‌టే.. అందుకే నాపై కుట్ర‌: సీఎం రేవంత్‌

G

Telangana | Published On Jul 22, 2026, 12.11 pm IST

Revanth Reddy | బీఆర్ఎస్‌, బీజేపీ ల‌క్ష్యం ఒక్క‌టే.. అందుకే నాపై కుట్ర‌: సీఎం రేవంత్‌
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) పార్టీలు వేరైన‌ప్ప‌టికీ.. వాళ్ల ల‌క్ష్యం మాత్రం ఒక్క‌టేన‌ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. వారి త‌ప్పుల‌ను ప్ర‌శ్నిస్తున్నందుకు కొడంగ‌ల్‌లో (Kondangal) త‌న‌ను దెబ్బ‌తీయాల‌ని కుట్ర చేస్తున్నార‌ని ఆరోపించారు. త‌న‌ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌కు (Congress) ఓట్లు వేసిన‌వాళ్ల ఓట్లు తొల‌గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, త‌న‌పై కుట్ర‌లు చేసిన‌వాళ్ల‌ను ఇక్క‌డి ప్ర‌జ‌లు తిప్పికొట్టాల‌న్నారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కొడంగ‌ల్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణపై (SIR) బీఎల్‌ఏలతో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్‌ మాట్లాడారు. ప్రతి పేదవాడికి మంచి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రం కోసం రోజుకు 18 గంటలు పనిచేసినా తనకు సమయం సరిపోవడం లేద‌ని చెప్పారు.

కొడంగల్‌లో నేరుగా ఎదుర్కోలేక త‌న‌ను దొంగ దెబ్బ‌తీయాల‌ని బీఆర్ఎస్, బీజేపీ నేత‌లు కుట్ర చేస్తున్నార‌ని తెలిపారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసినవాళ్ల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాని వెల్ల‌డించారు. కొడంగల్‌లో దెబ్బతీస్తే రాష్ట్ర స్థాయికి రాలేడు అని ఆలోచిస్తున్నార‌ని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 90శాతం కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తారని, వారి ఓట్లు తొలగిద్దామని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కొడంగల్‌లో 78శాతం ఓటర్లు నమోదు చేసుకున్నార‌ని, మిగిలిన 22 శాతం ఓట్లు నమోదు చేయించాల‌న్నారు. మిగిలిన ఓటర్లతో బీఎల్‌ఏలు ఎస్‌ఐఆర్‌ నమోదు చేయించాల‌ని సూచించారు. నియోజకవర్గంలో అర్హులైన వారి ఓట్లు తొలగించేందుకు వీల్లేదన్నారు. ఓటరు జాబితాలో పేరు లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావని స్ప‌ష్టం చేశారు. గతంతో పోలిస్తే సరైన వివరాలు లేకపోతే పక్కన పెడతార‌ని, అనుమానాస్పదంగా ఉంటే సరైన ఆధారాలు చూపి ఓటర్లుగా నమోదు చేసుకోవాల‌న్నారు. అంత‌కుముందు త‌న నివాసంలో సర్ ఫామ్ నింపి అధికారుల‌కు ఇచ్చారు.

Advertisement
Advertisement