Bandi Sanjay | ముందు దేశం.. ఆ తర్వాతే పార్టీ : కేంద్ర మంత్రి బండి సంజయ్
Bandi Sanjay | ముందు దేశం.. ఆ తర్వాతే పార్టీ.. స్వార్థం అనేది చివరన.. ఇదే మా పార్టీ విధానం అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్( Dharmendra Pradhan ) రాజీనామాను ఉద్దేశించి కేంద్ర మంత్రి బండి సంజయ్( Bandi Sanjay ) ఎక్స్ వేదికగా స్పందించారు.
Bandi Sanjay | త్రినేత్ర.న్యూస్ : ముందు దేశం.. ఆ తర్వాతే పార్టీ.. స్వార్థం అనేది చివరన.. ఇదే మా పార్టీ విధానం అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్( Dharmendra Pradhan ) రాజీనామాను ఉద్దేశించి కేంద్ర మంత్రి బండి సంజయ్( Bandi Sanjay ) ఎక్స్ వేదికగా స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థి ఉద్యమాల నుంచి మొదలుకొంటే కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పదవులు అలంకరించిన వ్యక్తి అని, ఆయన దశాబ్దాల పాటు ప్రజా జీవితానికి అంకితమయ్యారని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజాస్వామ్యంలో ప్రజల మాట వినడం, వారి గళాన్ని గౌరవించడం, తప్పనిపరిస్థితుల్లో డిమాండ్‌కు అనుగుణంగా బాధ్యత తీసుకునే ధైర్యం కలిగి ఉన్నారు. పదవులు తాత్కాలికమే.. ప్రజల విశ్వాసమే అత్యంత ప్రధానం అని బండి తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన మంత్రి పదవి నుంచి తప్పుకోవడం మా ఆర్గనైజేషన్ విలువలకు ప్రతిబింబం అని చెప్పారు. పదవి కంటే బాధ్యతకు, స్వప్రయోజనం కంటే దేశానికి ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యమన్నారు. ఇన్నాళ్లు ప్రజా సేవకు అంకితమైన ధర్మేంద్ర ప్రధాన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. బీజేపీ అంటే ఇదే.. ప్రజాస్వామ్యం అంటే.. ముందు దేశం.. ఏదైనా ఆ తర్వాతనే అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
This is what we are about: Nation First, Party Next, Self Last.
Shri @dpradhanbjp ji has spent decades in public life, from the student movement to serving in key responsibilities in the Union Government.
Under the leadership of Hon’ble PM Shri @narendramodi ji, democracy means…
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 25, 2026
తాజావార్తలు
- ●Jagadeesh Reddy | జెన్‌జీకి రాజకీయాలు తెలుసు.. దేశ నిర్మాణానికి వారు సిద్ధంగా ఉన్నరు
- ●Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. లేఖ సారాంశం ఇదే..
- ●Musi Riverfront | వారం రోజుల్లో మూసీ సుందరీకరణకు టెండర్లు
- ●Nara Rohith | నారా రోహిత్ ట్రిపుల్ ట్రీట్ - హీరోగా... విలన్‌గా... సర్ప్రైజ్
- ●Dharmendra Pradhan | కాక్రోచ్లకు తలొగ్గిన కేంద్రం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
- ●Atal Pension Yojana | నెలకు రూ.5వేల పెన్షన్ కావాలా.. ఈ కేంద్ర ప్రభుత్వ పథకంలో చేరండి..

Jagadeesh Reddy | జెన్‌జీకి రాజకీయాలు తెలుసు.. దేశ నిర్మాణానికి వారు సిద్ధంగా ఉన్నరు

Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. లేఖ సారాంశం ఇదే..

Musi Riverfront | వారం రోజుల్లో మూసీ సుందరీకరణకు టెండర్లు

Nara Rohith | నారా రోహిత్ ట్రిపుల్ ట్రీట్ - హీరోగా... విలన్‌గా... సర్ప్రైజ్



